కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్- ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా అనిపించింది. ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.
టాక్సిక్ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు యశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఓ అభిమాని అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. తాను వెళ్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. అందుకే తన అభిమాని అంత్యక్రియలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అతని మరణం నన్ను బాధించిందని.. కానీ నేను వెళ్తే మిగతా అభిమానులు కూడా అదే పని చేస్తారని యశ్ తెలిపారు.
కాగా.. 2021 ఫిబ్రవరిలో కర్ణాటకలోని మాండ్యా జిల్లా కొడిదొడ్డి గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్ అభిమాని రామకృష్ణ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. తన అంత్యక్రియలకు యశ్, రాజకీయ నాయకుడు సిద్దరామయ్య హాజరు కావాలని కోరుతూ ఒక లేఖను రాశాడు. ఇది చూసి సిద్దరామయ్య అంత్యక్రియలకు హాజరయ్యారు. కానీ యశ్ హాజరు కాలేదు. తాజాగా తాను అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే.. మిగతా ఫ్యాన్స్ కూడా అలానే చేస్తారని.. ఆ ఆలోచనా విధానమే తప్పని యశ్ స్పష్టం చేశారు.


