త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? 2015లో అసలేం జరిగింది? | Why Trisha Krishnan Called Off Her Marriage in 2015 | Sakshi
Sakshi News home page

త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? 2015లో అసలేం జరిగింది?

Aug 13 2026 11:55 PM | Updated on Aug 14 2026 11:20 AM

Why did Trisha wedding get called off in 2015

హీరోయిన్‌ త్రిష పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి. దశాబ్ద కాలంగా ఆమె పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్ల సంగతి పక్కనపెడితే, ఆమె జీవితంలో పెళ్లికి సంబంధించిన కీలక పరిణామం 2015లో జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో త్రిషకు 2014లో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని 2015 జనవరిలో త్రిష స్వయంగా వెల్లడించారు. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని నెలలకే జరగాల్సిన వివాహం రద్దయింది.

ఆ వ్యాపారవేత్త పెళ్లి తర్వాత త్రిష సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు కారణంగానే నిశ్చితార్థం రద్దయిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. అనంతరం తాను సింగిల్‌గా, సంతోషంగా ఉన్నాననే సందేశాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అనంతరం కొంతకాలానికి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి, నన్ను సినిమాల్లో నటించడం ఆపమని అడిగారు. దాంతో సినిమాలకు బదులుగా, నా నిశ్చితార్థానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. నేను కేవలం గర్భవతి అయినప్పుడు మాత్రమే విరామం తీసుకుంటాను. ఒకవేళ నాకు ప్రధాన పాత్రలు ఆఫర్ చేయకపోతే, నా ఇమేజ్‌కు సరిపోయే పాత్రలు చేస్తాను కానీ చిత్ర పరిశ్రమకు మాత్రం దూరం కాను. నా చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉండాలన్నదే నా కోరిక అని త్రిష తన అభిప్రాయాన్ని తెలిపారు. 

ఆ తర్వాత టాలీవుడ్‌ నటుడు రానా సహా పలువురు హీరోలు, ప్రముఖులతో త్రిషకు సంబంధాలు ఉన్నాయంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని ఖండిస్తూ తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో త్రిషతో తమిళ నటుడు, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్‌ పేర్లను కలిపి పలు కథనాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. వీటిలో కొన్ని వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నప్పటికీ త్రిష మాత్రం సంయమనం పాటిస్తూ, తనదైన శైలిలో స్పందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement