విశ్వనాథ్ అండ్ సన్స్.. ఎవరికెంత రెమ్యునరేషన్‌? | Suriya’s Viswanath & Sons Movie Remuneration: Here’s How Much the Star Charged | Sakshi
Sakshi News home page

Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్.. పారితోషికం ఎవరికెంతంటే?

Aug 13 2026 5:32 PM | Updated on Aug 13 2026 5:50 PM

Suriya Vishwanath and Sons Movie Remunaration for Stars

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్‌గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్‌ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనే విషయంపై చర్చ మొదలైంది. ఈ చిత్రానికి సూర్య దాదాపు రూ.45 కోట్ల వరకు వసూలు చేశారని టాక్ వినిపిస్తోంది. ఇది దాదాపు సూర్య పారితోషికానికి డబులు అని తెలుస్తోంది. మమితా బైజు కోటిన్నర నుంచి మూడు కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ మూవీలో రవీనా టాండన్ తన రోల్‌కు దాదాపు రూ.2 నుంచి 3 కోట్ల వరకు ఛార్జ్ చేశారని టాక్. వీరితో పాటు రాధిక శరత్‌కుమార్ దాదాపు రూ.40 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement