టాలీవుడ్‌కు శ్రీలీల దూరమవుతోందా? అసలు కారణం ఇదేనా! | SreeLeela Expanding her reach into other film industries | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌కు శ్రీలీల దూరమవుతోందా? అసలు కారణం ఇదేనా!

Aug 12 2026 11:46 PM | Updated on Aug 12 2026 11:46 PM

SreeLeela Expanding her reach into other film industries

ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉన్న శ్రీలీల ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టుల విషయంలో కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త తెలుగు సినిమా ఏదీ లేకపోవడంతో, టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయా అనే చర్చ మొదలైంది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, ఆ తర్వాత చాలా మంది అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది. అయితే ‘రాబిన్‌హుడ్’, ‘మాస్ జాతర’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆమె కెరీర్‌పై  తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే శ్రీలీల పూర్తిగా టాలీవుడ్‌కు దూరమవుతున్నారని చెప్పడం తొందరపాటే. ప్రస్తుతం ఆమె తమిళం, హిందీ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. తమిళ నటుడు ధనుష్‌తో ఓ తమిళ సినిమాలో నటిస్తుండగా, బాలీవుడ్‌లోనూ కార్తీక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్ వంటి హీరోలతో ప్రాజెక్టులు చేస్తోంది.

తెలుగులో వరుసగా సినిమాలు చేసిన తర్వాత శ్రీలీల ప్రస్తుతం ప్రాజెక్టుల సంఖ్య కంటే విభిన్నమైన కథలు, మంచి పాత్రల కోసం ఇతర భాషల్లో అవకాశాలపై దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. చాలా కాలంగా వరుసగా కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించింది. ఇప్పుడు ఇతర పరిశ్రమల్లో తన పరిధిని విస్తరించుకోవడం ద్వారా కొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement