రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్‌గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.
అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్‌గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్‌టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR
— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026


