సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ సిగ్మా. ఈ చిత్రానికి సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే జాసన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించనుంది.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఓలమ్మో వగలాడి అంటూ సాగే లిరికల్ పాట విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా.. ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ పాటను తమన్, యువన్ శంకర్ రాజా, సంజనా దివాకర్ ఆలపించారు. కాగా.. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.


