ఆమెతో 16ఏళ్ల ప్రేమ.. నటుడు ఎమోషనల్‌ | Parag Tyagi Remembers Late Wife Shefali Jariwala on Their Wedding Anniversary | Sakshi
Sakshi News home page

ఆమెతో 16ఏళ్ల ప్రేమ.. నటుడు ఎమోషనల్‌

Aug 12 2026 5:50 PM | Updated on Aug 12 2026 5:56 PM

Parag Tyagi Remembers Late Wife Shefali Jariwala on Their Wedding Anniversary

వివాహ వార్షికోత్సవం సందర్భంగా నటుడు పరాగ్‌ త్యాగి.. తన భార్య దివంగత నటి షెఫాలీ జరివాలాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు షెఫాలీతో సరదాగా గడిపిన ఒకప్పటి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ముంబై జుహు బీచ్‌లో వీరిద్దరు ఆనందంగా గడిపిన క్షణాలు ఆ వీడియోలో కనిపించాయి.

‘ హ్యాపీ యానివర్సరీ. టుగెదర్‌ ఫరెవర్‌. పరి సింబా( వారు పెంచుకున్న కుక్క), పాప..మనది 16 ఏళ్ల స్వచ్ఛమైన ప్రేమ. నేను కూడా మీ ఇద్దరినీ చేరేవరకు నా ప్రేమను కొనసాగిస్తూనే ఉంటా’ అని భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

టీవీలోనే ప్రపోజ్‌..
‘నచ్‌ బలియే 5’ డ్యాన్స్‌ రియాలిటీ షోలో జాతీయ టెలివిజన్‌ వేదికపైనే పరాగ్‌ షెఫాలీకి ప్రపోజ్‌ చేశాడు. అనంతరం 2014 ఆగస్టు 12న ఇరువూరు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

గుండెపోటుతో మృతి..
కాగా షెఫాలీ జరివాలా 2025 జూన్‌ 27న ముంబైలో మృతి చెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమెను ఓ సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి  చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటికి షెఫాలీ వయసు 42 ఏళ్లు. ఆమె మృతితో సినీ, టెలివిజన్‌ పరిశ్రమలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి.

సింబాతోనూ అనుబంధం..
షెఫాలీతో పాటు వారి పెంపుడు కుక్క సింబాతోనూ పరాగ్‌కు ఎంతో అనుబంధం ఉండేది. షెఫాలీ మరణం తర్వాత సింబా తనకు అండగా నిలిచిందని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. అయితే జులై 23న సింబా కూడా కన్నుమూసింది. ఆ సమయంలో షెఫాలీ, సింబా కలిసి ఉన్న పాత వీడియోను పరాగ్‌ షేర్‌ చేస్తూ.. ‘‘ఇప్పుడు మమ్మీ ఒంటరిగా లేదు. సింబా మమ్మీతో చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరినీ కలిసేందుకు ఆ వైపునకు వెళ్లాలని ఎదురుచూస్తున్నా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement