breaking news
Parag Tyagi
-
ఆమెతో 16ఏళ్ల ప్రేమ.. నటుడు ఎమోషనల్
వివాహ వార్షికోత్సవం సందర్భంగా నటుడు పరాగ్ త్యాగి.. తన భార్య దివంగత నటి షెఫాలీ జరివాలాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు షెఫాలీతో సరదాగా గడిపిన ఒకప్పటి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబై జుహు బీచ్‌లో వీరిద్దరు ఆనందంగా గడిపిన క్షణాలు ఆ వీడియోలో కనిపించాయి.‘ హ్యాపీ యానివర్సరీ. టుగెదర్ ఫరెవర్. పరి సింబా( వారు పెంచుకున్న కుక్క), పాప..మనది 16 ఏళ్ల స్వచ్ఛమైన ప్రేమ. నేను కూడా మీ ఇద్దరినీ చేరేవరకు నా ప్రేమను కొనసాగిస్తూనే ఉంటా’ అని భావోద్వేగ పోస్ట్ చేశారు.టీవీలోనే ప్రపోజ్..‘నచ్ బలియే 5’ డ్యాన్స్ రియాలిటీ షోలో జాతీయ టెలివిజన్ వేదికపైనే పరాగ్ షెఫాలీకి ప్రపోజ్ చేశాడు. అనంతరం 2014 ఆగస్టు 12న ఇరువూరు సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.గుండెపోటుతో మృతి..కాగా షెఫాలీ జరివాలా 2025 జూన్ 27న ముంబైలో మృతి చెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమెను ఓ సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటికి షెఫాలీ వయసు 42 ఏళ్లు. ఆమె మృతితో సినీ, టెలివిజన్ పరిశ్రమలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి.సింబాతోనూ అనుబంధం..షెఫాలీతో పాటు వారి పెంపుడు కుక్క సింబాతోనూ పరాగ్‌కు ఎంతో అనుబంధం ఉండేది. షెఫాలీ మరణం తర్వాత సింబా తనకు అండగా నిలిచిందని ఆయన పలుమార్లు పేర్కొన్నారు. అయితే జులై 23న సింబా కూడా కన్నుమూసింది. ఆ సమయంలో షెఫాలీ, సింబా కలిసి ఉన్న పాత వీడియోను పరాగ్ షేర్ చేస్తూ.. ‘‘ఇప్పుడు మమ్మీ ఒంటరిగా లేదు. సింబా మమ్మీతో చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరినీ కలిసేందుకు ఆ వైపునకు వెళ్లాలని ఎదురుచూస్తున్నా’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. View this post on Instagram A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi) -
నా భార్యపై చేతబడి.. తనను తాకగానే..: నటి భర్త
'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.అదే కారణంఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్మెంట్లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.ఒక్కసారి కాదు, రెండుసార్లుచాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి. చేయిదాటిపోయిందినాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం: అనసూయ ఆవేదన


