'కాంటా లగా..' పాటతో ఫేమస్ అయిన బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కడదాకా తోడుంటానని మాటిచ్చిన భార్య ఇలా అర్ధాంతరంగా వదిలేసి పోవడంతో భర్త, నటుడు పరాగ్ త్యాగి గుండెపగిలేలా ఏడ్చాడు. భార్య బ్రష్‌తో పళ్లు తోముకుంటూ, ఆమె బట్టలను తడుముకుతూ ఆవిడ జ్ఞాపకాల్లోనే కాలం గడిపేస్తున్నాడు. షెఫాలిపై ప్రేమకు గుర్తుగా ఛాతిపై భార్య ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు.
అదే కారణం
ఇకపోతే షెఫాలి.. బ్యూటీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఉపవాసం ఉన్నరోజు ఓ ఇంజక్షన్ తీసుకున్న కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వెలువడ్డాయి. దాన్ని గతంలోనే పరాగ్ కొట్టిపారేశాడు. అయితే తన భార్య చావుకు అసలు కారణం చేతబడి అని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలామంది ఇలాంటివి నమ్మరు. కానీ, నేను నమ్ముతాను. చేతబడులు జరుగుతున్నాయి.
ఒక్కసారి కాదు, రెండుసార్లు
చాలామంది వారు పడే కష్టాల కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. అలా నా భార్యపై చేతబడి చేశారు. కానీ, ఎవరు చేశారనేది నాకు తెలీదు. ఏదో తప్పు జరుగుతోందని నాకు రెండుసార్లు అనిపించింది. అయితే మొదటిసారి పరిస్థితులు వాటంతటవే చక్కదిద్దుకున్నాయి. రెండోసారి మాత్రం పరిస్థితులు తీవ్రంగా మారిపోయాయి.
చేయిదాటిపోయింది
నాకు దైవభక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగిపోయినప్పుడు ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని నేను ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యను తాకినప్పుడు కూడా ఏదో జరుగుతోందని అర్థమైంది. తనను కాపాడమని భగవంతుడిని ఎంతగానో వేడుకున్నాను. కానీ అంతా చేయిదాటిపోయింది అని చెప్పుకొచ్చాడు. షెఫాలి జరివాలా (Shefali Jariwala).. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లోనూ పాల్గొంది.


