ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారం చేసినవారికి మరణశిక్ష విధిస్తేనే ఇటువంటి నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నది చాలామంది వాదన. మరి ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్న దానిపై ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
ఇదే మన భారతదేశం
ప్రస్తుతం దేశంలో దాదాపు 40 మంది ఎంపీలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందువల్లే అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలన్న బిల్లు ముందుకు కదలడం లేదని సదరు పోస్ట్‌లో ఉంది. ఆ పోస్ట్‌ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ మన వ్యవస్థకు దండం పెట్టింది. దీన్ని యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ రీపోస్ట్ చేసింది. ఇదే మన భారతదేశం.. మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతదేశం. చాలా దూరం కదా దారి.. మనం ఇంకా బట్టల దగ్గరే ఆగిపోయాం అని ఆవేదన వ్యక్తం చేసింది.
భారత్‌లో ఎలా ఉందంటే?
అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులకు సౌదీ అరేబియా, ఇరాన్, బంగ్లాదేశ్ వంటి అనేక దేశాల్లో ఉరిశిక్ష విదిస్తారు. కానీ భారత్‌లో మాత్రం అంతటి కఠిన శిక్షలు లేవు. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు అయితే మరణశిక్ష లేదా చనిపోయేవరకు శిక్ష విధించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆసిఫా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మహిళపై అత్యాచారం కేసులో కనీస జైలు శిక్ష పదేళ్లకు పెరిగింది. 16 ఏళ్ల లోపు అమ్మాయిలపై అఘాయిత్యానికి పాల్పడితే 20 ఏళ్ల వరకు శిక్ష పెంచారు.
🙏🙏🙏 pic.twitter.com/TdNN9aJgud
— Chinmayi Sripaada (@Chinmayi) January 17, 2026


