మీ అందరి ప్రేమకు కృతజ్ఞుడిని: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ | Jr Ntr Tweet After His Shoulder Surgery Goes Viral | Sakshi
Sakshi News home page

Jr Ntr: 'త్వరలో మళ్లీ కలుద్దాం': జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

Aug 12 2026 7:52 PM | Updated on Aug 12 2026 8:01 PM

Jr Ntr Tweet After His Shoulder Surgery Goes Viral

భుజానికి సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించారు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. నా కోసం మీరు ప్రార్థనలు చేసినందుకు చాలా కృతజ్ఞుడిని అని అన్నారు. నా శస్త్రచికిత్స విజయవంతమైంది.. నేను క్షేమంగా ఉన్నానని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రి వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. మీ మద్దతు నాకు ప్రతిరోజూ బలాన్ని ఇస్తుంది.. త్వరలో మళ్లీ కలుద్దాం అంటూ రాసుకొచ్చారు. 

కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో జతకట్టారు.  వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో యంగ్ టైగర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement