విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్‌కు ముందే బిగ్ డీల్స్ | Viswanath And Sons Movie Business | Sakshi
Sakshi News home page

విశ్వనాథ్ అండ్ సన్స్.. రిలీజ్‌కు ముందే బిగ్ డీల్స్

Aug 13 2026 5:21 PM | Updated on Aug 13 2026 5:31 PM

Viswanath And Sons  Movie Business

సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌తో దూసుకెళ్తోంది. ‘కరుప్పు’ విజయంతో సూర్య మార్కెట్ మరింత బలపడటంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్‌ విలువ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి అడ్వాన్స్ బుకింగ్స్‌పైనే పడింది.

తమిళనాడులో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో కాకపోయినా మోస్తరు స్థాయిలో కొనసాగుతున్నాయి. సాక్‌నిల్క్‌ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ చిత్రం తమిళనాడులో రూ.7.23 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌ను నమోదు చేసింది. ‘కరుప్పు’ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

థియేట్రికల్ బిజినెస్‌ రూ.90 కోట్లు
ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ మొత్తం సుమారు రూ.215 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో థియేట్రికల్‌, నాన్‌-థియేట్రికల్‌ హక్కులు ఉన్నాయి. తమిళనాడు థియేట్రికల్ హక్కుల విలువ రూ.45 కోట్లు కాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.15 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతో మొత్తం థియేట్రికల్ బిజినెస్‌ రూ.90 కోట్లకు చేరింది. ఓటీటీ, శాటిలైట్‌, సంగీత హక్కులతో కూడిన నాన్‌-థియేట్రికల్‌ బిజినెస్‌ విలువ రూ.125 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. థియేటర్ల పరంగా ఈ చిత్రం విజయవంతం కావాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ.175 కోట్ల గ్రాస్‌ను సాధించాల్సి ఉంటుంది.

ఆగస్టు 14న రాబోతోంది..
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య, మమితా బైజు జంటగా నటించారు. రాధికతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదం ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement