ఒకే రోజు ఐదు సినిమాలు.. గెలిచేదెవరో..? | 2026 August 14 Release Movies Names in Telugu | Sakshi
Sakshi News home page

ఒకే రోజు ఐదు సినిమాలు.. గెలిచేదెవరో..?

Aug 13 2026 4:22 PM | Updated on Aug 13 2026 4:28 PM

2026 August 14 Release Movies Names in Telugu

ఒక్కో సినిమాది ఒక్కో కథ. ఒక్కో దర్శకుడిది ఒక్కో కాన్సెప్ట్‌. ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్‌ వరకు, హారర్‌ నుంచి పీరియాడిక్‌ కథల వరకు విభిన్న జానర్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు ఐదు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాలపై అంచనాలను పెంచేశాయి. మరి ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌:  సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌'. మమితా బైజు కథానాయికగా నటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

పళ్ళ బురుసు:  ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వంలో సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పళ్ళ బురుసు'. అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎపిక్‌ స్టూడియోస్‌లు నిర్మించిన ఈ సినిమా కూడా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.

మకుటం:  విశాల్‌ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం 'మకుటం'. ఆర్‌బీ చౌదరి నిర్మించిన ఈ సినిమాలో దుషార విజయన్‌, అంజలి కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

అగధ:  ఎంఎస్‌ రాజు రచన, దర్శకత్వంలో శ్రవణ్‌ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'అగధ'. కామాక్షీ భాస్కర్ల, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్‌, సిజ్జు, రోషన్‌, శ్రేయ రాణి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆవారాపన్‌ 2:  'ఆవారపన్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన సినిమా 'ఆవారపన్‌ 2'. నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహించాడు. ఇమ్రాన్‌ హష్మీ సరసన దిశా పటాని నటించింది. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

బట్వారా 1947:  సన్నీ డియోల్‌ ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బట్వారా 1947'. ఈ చిత్రంతో ప్రీతి జింటా మళ్లీ వెండితెరపై కనిపించనుంది. షబానా ఆజ్మీ, అలీ ఫజల్‌, కరణ్‌ డియోల్‌, సర్గమ్‌ సింగ్‌లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆమిర్‌ ఖాన్‌ నిర్మించారు. ఈ సినిమా కూడా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇలా విభిన్న కథాంశాలతో వస్తున్న ఈ సినిమాల్లో ఏ చిత్రం ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరో కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement