సుప్రీం కొలీజియం సిఫార్సు
న్యూఢిల్లీ: నలుగురు న్యాయమూర్తులను వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలిజీయం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొలీజియం ఈ నెల 6న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న వి.కామేశ్వర్‌రావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, బాంబే హైకోర్టులో జడ్జీగా పని చేస్తున్న జస్టిస్ రవీంద్ర వి.ఘూగేను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, పంజాబ్–హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశ్వనీకుమార్ మిశ్రాను అదే కోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది.


