ఈడీ చీఫ్‌ పదవీ కాలం ఏడాది పొడిగింపు | ED Director Rahul Navin gets one-year extension | Sakshi
Sakshi News home page

ఈడీ చీఫ్‌ పదవీ కాలం ఏడాది పొడిగింపు

Aug 10 2026 5:08 AM | Updated on Aug 10 2026 5:08 AM

ED Director Rahul Navin gets one-year extension

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) డైరెక్టర్‌ రాహుల్‌ నవీన్‌(59) పదవీ కాలాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నవీన్‌ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్‌ 13వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది పాటు, 2027 జూలై 31వ తేదీ వరకు, లేదా పదవీ విరమణ వరకు నవీన్‌ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

నిబంధనల ప్రకారం ఈడీ డైరెక్టర్‌ పదవీ కాలం రెండేళ్లు కాగా, మూడేళ్లపాటు ప్రతిసారీ ఏడాది చొప్పున పొడిగించవచ్చు. రాహుల్‌ నవీన్‌ 2023 సెప్టెంబర్ 15న ఈడీ అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలను చేపట్టారు. 2024 ఆగస్టు 14న పూర్తిస్థాయి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement