breaking news
Enforcement Directorate (ED)
-
రూ .1,120 కోట్ల ఆస్తులు జప్తు.. అనిల్ అంబానీకి ఈడీ షాక్
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఊహించని షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ , రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, యస్ బ్యాంక్ మోసం కేసులో రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ నకు చెందిన రూ .1,120 కోట్ల విలువైన 18 ఆస్తులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్లను ఈడీ శుక్రవారం జప్తు చేసింది.ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందినవి 7 ఆస్తులు, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌కు చెందినవి 2 ప్రాపర్టీలు, రిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 9 ఆస్తులు ఉన్నాయి. అలాగేరిలయన్స్ వాల్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అధర్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి.వీటితో పాటు గమేషా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్‌తోపాటు రిలయన్స్ వెంచర్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫై మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అప్రకటిత పెట్టుబడులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. The Enforcement Directorate has attached over 18 properties, Fixed Deposits, Bank Balance, and Shareholding in Unquoted Investments of the Reliance Anil Ambani Group worth ₹1,120 Crore in the Reliance Home Finance Limited/Reliance Commercial Finance Limited/Yes Bank Fraud Case.… pic.twitter.com/556XsF7VvB— ANI (@ANI) December 5, 2025 -
మసాలా బాండ్ కేసులో కేరళ సీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: మసాలా బాండ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ న్కు, మాజీ మంత్రి థామస్ ఇస్సాక్‌కు, సీఎం చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎం అబ్రహాంకు సోమవారం ఈడీ నోటీసులు పంపింది. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ బోర్డ్ అధికారులు రూ.466.91 మేర విదేశీ మారకద్రవ్య నియంత్రణ నిబంధనలను, ఆర్బీఐ షరతు లను ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి జూన్ 27వ తేదీన కేసు నమోదు చేసింది. కేఐఐఎఫ్‌బీకి కేరళ సీఎం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
నకిలీ పత్రాలతో ఎస్బీఐ కార్ల లోన్ల మోసం : పలు లగ్జరీ కార్లు సీజ్
సాక్షి, ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్ లోన్ మోసం కేసు విచారణలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ED)పలు లగ్జరీ కార్లను సీజ్ చేసింది.ముంబై జోనల్ ఆఫీసులోని, నవంబర్ 25-26 తేదీలలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల కింద ఈడీ ఈ సోదాలు నిర్వహించింది.ఎస్బీఐలో వెలుగు చూసిన వాహన రుణ మోసంపై ఈడీ కఠిన చర్యలకు దిగింది. ఇందులో భాగంగా , పూణేలోని రుణగ్రహీతలు , కార్ డీలర్లకు చెందిన 12 నివాస ,కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేసింది. అప్పటి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ అమర్ కులకర్ణిపై కూడా సోదాలు జరిగాయి. ఈ సోదాల సందర్భంగా PMLA, 2002 సెక్షన్ 17 ప్రకారం. రుణగ్రహీతలు కొనుగోలు చేసిన వివిధ స్థిరాస్తుల గుర్తింపు BMWలు, వోల్వో, మెర్సిడెస్, ల్యాండ్ రోవర్లు స్వాధీనం చేసుకుంది. అలు పలు నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారి ఒకరు తెలిపారు.ED, Mumbai Zonal Office has conducted search operations on 25-26 November, 2025 under the provisions of Prevention of Money Laundering Act (PMLA), 2002 at Pune at 12 residential and office premises of loan borrowers, car dealers as well as the then branch manager of SBI in… pic.twitter.com/swQYRBL2U4— ED (@dir_ed) November 28, 2025 నిందిత రుణగ్రహీతలు నకిలీ పత్రాల ఆధారంగా మోసపూరితంగా అధిక విలువ గల కారు రుణాలను పొందారని మరియు తద్వారా బ్యాంకును మోసం చేశారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. 2017-2019 మధ్య కాలంలో, పూణేలోని యూనివర్సిటీ రోడ్ బ్రాంచ్‌లోని SBIలో చీఫ్ మేనేజర్‌గా పనిచేస్తున్నప్పుడు, కులకర్ణి తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశాడని, కొంతమంది రుణగ్రహీతలతో కలిసి SBIలో ఆటో లోన్ కౌన్సెలర్ ఆదిత్య సేథియాతో కలిసి లగ్జరీ కార్ల రుణాలను మోసపూరితంగా ప్రాసెస్ చేసాడు. నకిలీ పత్రాల ద్వారా SBI బ్రాంచ్ మేనేజర్‌తో కుమ్మక్కై BMW, వోల్వో, మెర్సిడెస్ , ల్యాండ్ రోవర్‌తో సహా వివిధ అధిక విలువ గల కార్లను కొనుగోలు చేశారని తేలింది. ఇలాంటి తప్పుడు సిఫార్సుల ద్వారా SBIని మోసం చేయడానికి నేరపూరిత కుట్ర పన్నాడని ఆరోపణలు నమోదైనాయి.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ACB, పూణే ,శివాజీనగర్ పోలీస్ స్టేషన్, పూణేలో నమోదైన కేసుల ఆధారంగా, ఐపీసీ 1860, అవినీతి నిరోధక చట్టం, 1988లోని వివిధ సెక్షన్ల కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇదీ చదవండి: స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్డేట్ చూశారా? -
ఉదయపూర్ వెడ్డింగ్, క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ. 331 కోట్లు, షాకైన ఈడీ
ఉదయపూర్ తాజ్ ఆరావళి రిసార్ట్‌లో ఒక పెళ్లి వేడుకు అత్యంత విలాసవంతంగా జరిగింది. గ త ఏడాది నవంబరులో జరిగిన ఈ డెస్టినేషన్ వివాహానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరా తీసింది. ఈ సందర్బంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఒక సాధారణ రాపిడో డ్రైవర్ ఖాతాలో రికార్డు స్థాయిలో నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది. ఈడీ దర్యాప్తులో ఈ షాకింగ్ మనీ ట్రయల్ వెలుగు చూసిందివధూవరులతో గానీ, వార బంధువులతో గానీ ర్యాపిడో డ్రైవర్‌కు ఎలాంటి సంబంధం లేకుండానే ఈ ఖాతా నుంచి ఉదయ్‌పూర్ పెళ్లి కోసం రూ. 1 కోటికి మంచి ఖర్చు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. గుజరాత్ యువ రాజకీయ నాయకుడు ఆదిత్య జులాకు సంబంధించిన వివాహంగా భావిస్తున్నారు. ఈ విలాసవంతమైన వివాహానికి నిధుల మూలం తీవ్రమైన ప్రశ్నలకు దారితీసింది. దీంతో ఏకంగా రూ. 331 కోట్లకు పైగా డిపాజిట్లు రాపిడో డ్రైవర్ ఖాతా ద్వారా జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. 1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్ దర్యాప్తులో భాగంగా ఇది వెలుగులోకి వచ్చింది. ర్యాపిడో డ్రైవర్ ఖాతానుంచి అన్ని కోట్లు ఎలా? ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో రాపిడో డ్రైవర్ ఖాతాలోకి రూ. 331.36 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఈ ఖాతా ఒక మ్యూల్ ఖాతా ద్వారా ఈ మోసం జరిగింది. మ్యూల్ ఖాతా అంటే ఏంటి? మ్యూల్ అకౌంట్ అనేది నేరస్థులు అక్రమ నిధులను స్వీకరించడానికి, బదిలీ చేయడానికి లేదా మనీ లాండరింగ్ చేయడానికి ఉపయోగించే బ్యాంక్ ఖాతా. ఖాతా నుండి డబ్బును వేరే వేరే అనుమానాస్పద ఖాతాలకుబదిలీ చేయడానికి మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తారు.దీని వలన అధికారులు నిధుల వాస్తవ మూలాన్ని గుర్తించడం కష్టమవుతుంది. ఖాతాదారులను తెలిసి లేదా తెలియకుండా కూడా ఈ బదిలీలు జరిగిపోతాయి. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల విచారణ సందర్భంగా ఈ మ్యూల్ ఖాతాను ఈడీ కనిపెట్టింది. ఈ లావాదేవీల అసలు మూలాలపై ఈడీ ఆరా తీస్తోంది.డిపాజిట్ల పరిమాణాన్ని దాచడానికే థర్డ్ పార్టీ ఖాతాలాను వాడారని ఈడీ భావిస్తోంది. డిపాజిట్ల పరిమాణం మరియు డ్రైవర్ ఖాతాను యాదృచ్ఛికంగా దుర్వినియోగం చేయడం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి మ్యూల్ ఖాతాలను హై-ఎండ్ వేడుకలు , అనుమానాస్పద ఖరీదైన కార్యక్రమాలకు ఎలా ఎక్కువగా ఉపయోగించబడుతుందో, అనుమానం లేని వ్యక్తులను అక్రమ కార్యకలాపాల కోసం ఎలా వాడుకుంటారు అనేది ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది.అధికారుల హెచ్చరికఇటీవలికాలంలోఇలాంటి ధోరణులు సర్వసాధారమవుతున్నాయని ఈడీ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. అయితే ఇలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడిన వారికి , వారికి సహకరించేవారికి చట్టపరంగా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి బ్యాంకు వినియోగదారులు పాటించాల్సిన సూచనలను ఈడీ జారీ చేసింది. ఇదీ చదవండి : స్మృతి-పలాష్ పెళ్లిలో మరో ట్విస్ట్ : ఇన్‌స్టాలో అప్డేట్ చూశారా?ఇలా జాగ్రత్తపడండి! బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, UPI లేదా నెట్-బ్యాంకింగ్ యాక్సెస్‌ను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దు. తెలియని వ్యక్తుల కోసం చెక్కులు లేదా ఆర్థిక పత్రాలపై సంతకం చేయవద్దు. బ్యాంకు ఖాతా ద్వారా ఏవైనా అసాధారణ డిపాజిట్లు, ఉపసంహరణలు లేదా మీఖాతాను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించినట్లయితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. •మీ బ్యాంకు ఖాతాను వాడుకొని, అందుకు డబ్బును ఆఫర్ చేసే వ్యక్తుల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలి. మీ పేరుతో జారీ అయిన, మీరు వాడని ఫోన్ నెంబర్లను ప్రభుత్వ పోర్టల్ tafcop.sancharsaathi.gov.inలో డీయాక్టివేట్ చేయించుకోవాలి. -
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు
సాక్షి, ఢిల్లీ: ప్రైవేట్ మెడికల్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. గురువారం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. సీబీఐ కేసు ఆధారంగానే ఈ తనిఖీలు జరుగుతున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ఎన్ఎంసీ ప్రమాణాలు పాటించకుండానే అప్రూవల్స్ నేపథ్యంతో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కళాశాలల ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది కూడా. ఈ క్రమంలో ఇవాళ ఇటు ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో.. ఏపీ, తెలంగాణల్లోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. పలు కీలక డాకుమెంట్లను పరిశీలిస్తున్న అధికారులు.. మెడికల్ సీట్ల కేటాయింపులు సహా పలు అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
గేమింగ్ సంస్థల డిపాజిట్లు ఫ్రీజ్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు చెందిన రూ. 523 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్ని నిషేధించిన తర్వాత ఆ మొత్తాన్ని ప్లేయర్లకు రిఫండ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా కంపెనీలు తమ దగ్గరే అట్టే పెట్టుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. విన్జో, గేమ్స్క్రాఫ్ట్ తదితర గేమింగ్ కంపెనీల డిపాజిట్లు వీటిలో ఉన్నాయి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా నవంబర్ 18–22 మధ్య ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లోని నిర్దేశ నెట్వర్క్స్ (ఎన్‌ఎన్‌పీఎల్), గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ (జీటీపీఎల్), విన్జో గేమ్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రియల్ మనీ గేమ్స్‌లో (ఆర్ఎంజీ) మనుషులతో కాకుండా సాఫ్ట్‌వేర్‌తో ఆడుతున్న విషయాన్ని కస్టమర్లకు తెలియనివ్వకుండా విన్జో అనైతిక వ్యాపార విధానాలు అమలు చేసిందని, క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహించిందని ఈడీ ఆరోపించింది. గేమర్లకు రిఫండ్ చేయాల్సిన మొత్తాన్ని తమ ఖాతాల్లో అట్టే పెట్టుకుందని పేర్కొంది. గేమ్స్‌క్రాఫ్ట్‌పై కూడా ఇదే తరహా ఆరోపణలున్నట్లు వివరించింది. -
ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్
సాక్షి, హైదరాబాద్: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ రూ.300 కోట్లు అక్రమాలు చేసిందని, అంతేకాకుండా ప్రభుత్వానికి మధుసూదన్‌రెడ్డి రూ.39 కోట్ల రాయల్టీ చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేని చోటకూడా అక్రమ మైనింగ్ చేపట్టారని, సబ్ కాంట్రాక్టులకు అనుమతి లేకున్నా జీవీఆర్ సంస్థకు సబ్ క్రాంట్రాక్లులచ్చారని కంపెనీపై ఫిర్యాదులున్నాయి. వాటితో పాటు అనుమతి తీసుకున్న చోట పరిమితికి మించి మైనింగ్ తవ్వకాలు చేపట్టి భారీగా కోట్లు కొల్లగొట్టారని సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీపై ఆరోపణలున్నాయి. ఈనేపథ్యంలో ఈడీ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. కంపెనీకి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. -
సైబర్ మోసాల కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్ట్‌టైం జాబ్‌లతో పెద్ద మొత్తంలో ఆదాయం పొందండి అంటూ ప్రకటనలు ఇస్తూ పలువురిని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన భారీ సైబర్ మోసాల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నకిలీ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో డబ్బు సంపాదన పేరుతో నడిచే మోసపూరిత ఎన్బీసీ యాప్, పవర్ బ్యాంక్ యాప్, హెచ్పీజెడ్ టోకెన్, ఆర్సీసీ యాప్, మేకింగ్ యాప్ వంటి మొబైల్ యాప్‌ల ద్వారా జరిగిన సైబర్ మోసాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీసు గురువారం 92 బ్యాంకు ఖాతాల్లోని రూ.8.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌లను తాత్కాలికంగా జప్తు చేసింది. కొన్ని క్రిప్టో వాలెట్లు, ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ కాయిన్ డీసీఎక్స్కు చెందిన ఖాతాలు సైతం జప్తు చేసినట్టు జోనల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కడప పోలీసులు గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మోసం ఎలా జరిగింది? వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు, బల్క్ ఎస్ఎంఎస్లతో సామాన్య ప్రజలను టార్గెట్ చేసిన మోసగాళ్లు ‘చిన్న పనులు చేస్తే భారీ కమిషన్’అంటూ పలు ఆకర్షణీయ ఆఫర్లు ఇచ్చారు. నకిలీ ఈ–కామర్స్ సైట్లలో వస్తువులు కొనడం, అమ్మడం అని చెప్పి ముందుగా డబ్బు డిపాజిట్ చేయించారు. చిన్న మొత్తంలో లాభం చూపి నమ్మకం కలిగించి, ఆ తర్వాత పెద్ద మొత్తాలు పెట్టించారు. డబ్బు విత్‌డ్రా చేయాలంటే ‘ట్యాక్స్ కట్టాలి’, ‘క్లియరెన్స్ రుసుం’అంటూ మరిన్ని చెల్లింపులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ యాప్‌లు అందుబాటులో లేకుండా, కస్టమర్లకు కనిపించకుండా చేసేవారు. ఇలా దేశవ్యాప్తంగా పలువురి నుంచి సుమారు రూ.285 కోట్లు కొల్లగొట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ డబ్బును 30 ప్రైమరీ బ్యాంక్ ఖాతాల్లో 15 రోజుల్లోపు ఉంచి, తర్వాత 80కి పైన ఇతర ఖాతాలకు మళ్లించారు. దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ట్రాకింగ్‌ను కష్టతరం చేశారు. అదేవిధంగా భారీ మొత్తంలో నిధులను క్రిప్టోకరెన్సీగా మార్చారు. కొంత సొమ్మును హవాలా మార్గాల ద్వారా రూటింగ్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పలు బ్యాంకు ఖాతాలు గుర్తించిన ఈడీ అధికారులు రూ.8.46 కోట్లు జప్తు చేశారు. -
అంబానీని వదలని ఈడీ
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన సుమారు రూ.1,400 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. తాత్కాలికంగా ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది. దాంతో ఇప్పటివరకు గ్రూప్‌నకు చెందిన మొత్తం రూ.9,000 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లయింది.విచారణకు గైర్హాజరుఈడీ తాజా చర్యలకు కొద్దిరోజుల ముందు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ విచారణకు హాజరుకాకుండా సమన్లను దాటవేశారు. విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఆయనను ఈడీ పిలిపించింది. కానీ విచారణకు ఆయన గైర్హాజరు కావడం ఇది రెండోసారి. ఏజెన్సీ చివరిసారిగా ఆగస్టులో అనిల్ అంబానీని ప్రశ్నించింది.హవాలా, నిధుల మళ్లింపు ఆరోపణలుఈడీ ఆరోపణల ప్రకారం, అనిల్ అంబానీ గ్రూప్ జైపూర్-రీంగస్ హైవే ప్రాజెక్ట్ నుంచి సూరత్‌లోని షెల్ కంపెనీల ద్వారా సుమారు రూ.40 కోట్లను విదేశాలకు తరలించి దుబాయ్‌కు పంపినట్లు అనుమానిస్తున్నారు. ఇది రూ.600 కోట్లకు పైగా విస్తృత అంతర్జాతీయ హవాలా నెట్‌వర్క్‌లో భాగమై ఉండవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది.ఇతర ప్రధాన ఆస్తుల జప్తుఅంబానీ గ్రూప్ కంపెనీలపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఇటీవల రూ.4,462 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దీనికి ముందు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) బ్యాంక్ రుణ కేసుకు సంబంధించి నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏసీ) ప్రాంగణంలో సుమారు రూ.7,545 కోట్ల విలువైన 132 ఎకరాల భూమిని కూడా ఈడీ జప్తు చేసింది.కేసు నేపథ్యంమోసం, కుట్ర, అవినీతి ఆరోపణలపై అనిల్ అంబానీతోపాటు ఆర్‌కామ్, ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 2010, 2012 మధ్య భారతీయ, విదేశీ బ్యాంకుల నుంచి మొత్తం రూ.40,000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్న ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలపై దర్యాప్తు జరుగుతోంది.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
ఐబొమ్మ ఇమ్మడి రవికి మరో బిగ్ షాక్!
సాక్షి,హైదరాబాద్: ఐబొమ్మ ఇమ్మడి రవి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. సినిమా పైరసీకి సంబంధించిన కేసును తెలంగాణ పోలీసులు ఇమ్మడి రవిని అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఐబొమ్మ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది.ఇందులో భాగంగా ఐబొమ్మ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు లేఖ రాసింది. ఐబొమ్మ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు అనుమానాలున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సీపీకి రాసిన లేఖలో పేర్కొంది. కాగా,అరెస్టు సమయంలో ఐబొమ్మ ఇమ్మడి రవి బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 3.5 కోట్లు ఫ్రీజ్ చేసిన పోలీసులు.. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు నిధులు వచ్చినట్లు గుర్తించారు. నెలకు రూ. 15 లక్షలు రూపాయలు క్రిప్టో వాలెట్ నుండి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు ట్రాన్స్‌ఫరయినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో వీటిపై ఈడీ దర్యాప్తు చేయనుంది. -
అల్‌ఫలా యూనివర్సిటీపై ఈడీ దాడులు
సాక్షి, ఢిల్లీ: ఎర్రకోట పేలుడు కేసులో అల్‌ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) దాడులు చేపట్టింది. యూనివర్సిటీకి అందుతున్న నిధులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. విశ్వవిద్యాలయానికి, నిషేధిత ఉగ్రవాద సంస్థలకు మధ్య ఉన్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల చిట్టాను ఛేదించే లక్ష్యంతో ఢిల్లీ, ఫరీదాబాద్‌లలో ఏకకాలంలో 25 వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయి.అల్‌ఫలా విశ్వవిద్యాలయం యజమానులు, సంబంధిత వ్యక్తులపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది. విశ్వవిద్యాలయం ఆర్థిక లావాదేవీలు, ఫీజుల వసూళ్లు, నిధుల మళ్లింపు తదితర అంశాలపై దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ దాడులలో కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలు, ఆర్థిక వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు హమాస్ తరహాలో డ్రోన్ ఆయుధాలతో దాడులకు ఉగ్రవాదుల ప్లాన్ చేశారని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ నేపధ్యంలో అధికారులు డ్రోన్లు, పలు ఆయుధాలను కనుగొన్నారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబి సహచరుడు జహీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ అరెస్టు దరిమిలా డ్రోన్ల దాడి ప్రణాళిక వెల్లడయ్యింది. డ్రోన్లకు ఆయుధాలు బిగించడంలో డ్యానిష్ సాంకేతిక సహకారం అందించాడని తేలింది. కారు బాంబు దాడికి ముందు డ్రోన్లకు రాకెట్లు ఉపయోగించాలని ప్రణాళికలు రూపొందించారని సమాచారం. రోడ్లకు పవర్ఫుల్ బ్యాటరీలు ఉపయోగించి భారీ ఆయుధాలు, కెమెరాలను బిగించాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. భారీ ఎత్తున జనం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ల ద్వారా దాడులు చేయాలని ముష్కరులు ప్లాన్ చేశారని ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. 2023లో ఇదే తరహాలో ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు చెబుతున్నారు. -
వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ..
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ తన వాంగ్మూలాన్ని వర్చువల్ విధానంలో నమోదు చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు అందుబాటులో ఉంచడానికి సిద్ధమని చెప్పారు. ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్) కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.వర్చువల్ విధానంలో హాజరుఅనిల్ అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి మాత్రమే ఈడీ సమన్లు జారీ చేసిందని ఆయన అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వర్చువల్ విధానం లేదా రికార్డ్ చేసిన వీడియో ద్వారా ఈడీకి తగిన తేదీ, సమయానికి తన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు అనిల్ అంబానీ అందుబాటులో ఉంటారని తెలిపారు.కేసు నేపథ్యంజైపూర్-రీంగస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించిన ఫెమా కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది.రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ రహదారి నిర్మాణానికి ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) కాంట్రాక్టును ఇచ్చింది.ఈ రోడ్డు ప్రస్తుతం గత నాలుగేళ్లుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్వహణలో ఉంది.ఈడీ అధికారుల తరఫున అనిల్ అంబానీ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ కేసు 15 ఏళ్ల నాటిదని, 2010లో జరిగిన రోడ్డు కాంట్రాక్టర్‌కు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ఇది పూర్తిగా దేశీయ ఒప్పందం, ఇందులో విదేశీ లావాదేవీలు లేవని ఆ ప్రకటనలో వివరించారు. అనిల్ అంబానీ ఏప్రిల్ 2007 నుంచి మార్చి 2022 వరకు అంటే దాదాపు 15 ఏళ్ల పాటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.ఇదీ చదవండి: ఉదయం 5 గంటలకు ఈమెయిల్.. -
బెట్టింగ్ యాప్స్ శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం
Betting App Case బెట్టింగ్ మహామ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లలో పాల్గొంటున్న సెలబ్రిటీలపై మండిపడ్డారు. వీళ్లేం సెలబ్రిటీలు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ నెట్టింట సంచలనంగా మారింది.ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌కు చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన నేపథ్యంలో సజ్జనార్ స్పందించారు. #SayNoToBettingAppsవీళ్లేం సెలబ్రిటీలు?అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని… pic.twitter.com/GWJIvSK7uF— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 7, 2025 (గుండెలు పగిలేలా ఏడ్చారు.. పోరాడి గెలిచారు!) ట్వీట్లో సజ్జనార్ ఏమన్నారంటే..వీళ్లేం సెలబ్రిటీలు?అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు?బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా?సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి.’’ అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదీ చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్ -
మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్
ఢిల్లీ: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా,శిఖర్ ధావన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ఆస్తుల్ని జప్తు చేసింది. రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఇటీవల ఈడీ విచారణకు రైనా,ధావన్ విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌ను కూడా ఈడీ గతంలోనే విచారించిన విషయం తెలిసిందే. సురేష్ రైనా రూ.6.44 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రూ.4.70 కోట్ల విలువైన శిఖర్ ధావన్‌కు చెందిన స్థిరాస్తుల్ని అటాచ్ చేసినట్లు తెలిపింది. ఈ ఆస్తులు 1xBet అనే విదేశీ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది.కేసు నేపథ్యం 1xBet అనే సంస్థ భారత్‌లో అక్రమంగా ఆన్లైన్ బెట్టింగ్ సేవలు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థకు సంబంధించిన సరొగేట్ యాప్స్ ద్వారా పలు ప్రముఖులు ప్రచారం చేసినట్లు ఈడీ గుర్తించింది. సురేష్ రైనా,శిఖర్ ధావన్,మ్యూజిక్ డైరెక్టర్ బాద్షా,యాక్టర్ కపిల్ శర్మ యూట్యూబర్ బీబీ కీ వైన్ (బువన్ బామ్)లను నిర్ధారించింది. వీరందంటూ బెట్టింగ్ యాప్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రమోట్ చేసినట్లు అభిపప్రాయం వ్యక్తి చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టీఎక్స్ బెట్ వంటి బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రజలు మోసపోయే అవకాశం ఉంది. అందుకే ఈ ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణ కొనసాగుతోందని ఈడీ పేర్కొంది. -
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు..
న్యూఢిల్లీ: బ్యాంకు మోసం, మనీలాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)రుణ మోసం కేసులో విచారణ కోసం నవంబర్ 14న విచారణకు రావాలని అనిల్ అంబానీని ఆదేశించింది. అనిల్ అంబానీని ఇదివరకే గత ఆగస్టులో ఈడీ ఓసారి విచారణకు పిలిచి ప్రశ్నించింది.అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ గ్రూప్ సంస్థలపై ఇప్పటికే ఈడీ, సీబీఐ, సెబీ విచారిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన దాదాపు రూ .7,500 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 30 ఆస్తులు, అధార్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్ బీర్ హైటెక్ బిల్డ్, గమేసా ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, విహాన్ 43 రియల్టీ, కాంపియన్ ప్రాపర్టీస్ తో ముడిపడి ఉన్న ఆస్తులు ఉన్నాయని ఈడీ అధికారులు తెలిపారు.రూ.17,000 కోట్ల బ్యాంక్ రుణాలు దారి మళ్లించినట్లు అనిల్ అంబానీ సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ, సెబీతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా రంగంలోకి దిగింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సీఎల్ఈ ప్రైవేట్ లిమిటెడ్ తో సహా పలు గ్రూప్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది. -
రుణదాతలకు ఉపశమనం.. ఈడీ, ఐబీబీఐ ఎస్ఓపీ ఖరారు
దివాలా ప్రక్రియలో చిక్కుకున్న కంపెనీల ఆస్తులను రుణదాతలకు తిరిగి ఇవ్వడానికి వీలు కల్పించేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ను ఖరారు చేశాయి. దీనివల్ల వివిధ కేసుల్లో స్తంభింపచేసిన సుమారు రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఆస్తులను రుణదాతలకు అందించనున్నారు.ఈ నిర్ణయం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జతచేయబడిన ఆస్తులను దివాలా పరిష్కార ప్రక్రియ (ఐబీసీ)లో ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు ఈ ఆస్తులు దివాలా ప్రక్రియలో అందుబాటులో లేకుండా పోవడంతో రికవరీకి అడ్డంకి ఏర్పడింది. ఇకపై పీఎంఎల్ఏలో అటాచ్ చేసిన ఆస్తులను సైతం ఐబీసీ ద్వారా రుణదాతలు రికవరీ చేసుకోవచ్చు.ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ (IP) జప్తు చేసిన ఆస్తులను విడుదల చేయడానికి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు ముందు ప్రామాణిక అండర్‌టేకింగ్ దాఖలు చేయవచ్చు.నిబంధనల ప్రకారం ఆమోదించిన తర్వాత ఈ ఆస్తులు రుణదాతల (బ్యాంకులు, పెట్టుబడిదారులు) ప్రయోజనం కోసం తిరిగి ఇస్తారు.నిందితులైన ప్రమోటర్లు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు ఈ ఆస్తుల నుంచి ఎటువంటి ప్రయోజనం పొందకుండా చూస్తారు.ఆర్థిక నేరస్థులపై ప్రాసిక్యూషన్‌ను నిర్ధారిస్తూనే రుణదాతల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ చర్య లక్ష్యమని ఈడీ నొక్కి చెప్పింది.పరిష్కారాలు వేగవంతంఈ నిర్ణయం వల్ల దివాలా పరిష్కారాలు వేగవంతం అవుతాయని, పీఎంఎల్ఏ అటాచ్మెంట్ల కారణంగా గతంలో జరిగిన సుదీర్ఘ న్యాయ పోరాటాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ ఏఆర్సీఎస్ సీఈఓ హరి హరా మిశ్రా ఈ చర్యను సమయానుకూల పరిష్కారంగా చూస్తున్నట్లు చెప్పారు. ఇది ఐబీసీ ప్రక్రియ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు.ఇదీ చదవండి: భారత ఏఐ గవర్నెన్స్ మార్గదర్శకాల్లో మార్పులు -
మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిందితుడిని పట్టుకోండి
న్యూఢిల్లీ: అదృశ్యమైన మహాదేవ్ బెట్టింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దుబాయ్ నుండి పారిపోయిన ఆ నిందితుడు, కోర్టులు, దర్యాప్తు సంస్థలతో ఆటలాడుకునే అవకాశం కల్పించవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం, నిందితుడు రవి ఉప్పల్ దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడంపై తీవ్రంగా స్పందించింది. భారత్ దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకున్న ఉప్పల్, దుబాయ్‌లో ఉండేవాడు. అనంతరం అక్కడి నుండి గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయినట్లు సమాచారం. దీంతో యుఏఈ అధికారులు అతడి అప్పగింత ప్రక్రియను మూసివేయడానికి చర్యలు ప్రారంభించాల్సి వచ్చింది. ‘అతన్ని ఎలా పట్టుకోవాలో ముందు తెలుసుకోండి’.. అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాయ్‌పూర్ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మార్చి 22న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ.. ఉప్పల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఉప్పల్ తరపు న్యాయవాది సమయం కోరడంతో, ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం, ఉప్పల్ తన భాగస్వామి సౌరభ్ చంద్రకర్‌తో కలిసి 2018లో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను ఏర్పాటు చేశాడు. ఇది ఆన్లైన్ గేమ్‌లపై చట్టవిరుద్ధంగా పందాలకు అనేక యాప్‌లను అనుమతించింది. ఈ స్కాం విలువ రూ.6,000 కోట్లు అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. -
చిక్కుల్లో అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది!. ఆర్‌కామ్ రుణ ఎగవేతలు, నిధుల మళ్లింపు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. అనిల్ అంబానీ, ఆయన గ్రూపు కంపెనీలు, వాటితో సంబంధం ఉన్న కంపెనీలకు చెందిన రూ.7,545 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటి వరకు ఈడీ సీజ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద 42 ప్రాపరీ్టలను అటాచ్ చేస్తూ అక్టోబర్ 31న ఈడీ ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా నవీ ముంబైలోని ధీరూభాయి అంబానీ నాలెడ్జ్ సిటీ (డీఏకేసీ)కి చెందిన రూ.4,462 కోట్ల విలువ చేసే 32 ఎకరాల విలువైన భూమిని సోమవారం అటాచ్ చేసింది. ఢిల్లీలోని రంజిత్ సింగ్ మార్గ్‌లో ఉన్న రిలయన్స్ సెంటర్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఇతర కంపెనీలకు చెందిన ఆస్తులు సీజ్ చేసిన వాటిల్లో ఉన్నాయి. ఇందులో రిలయన్స్ సెంటర్, డీఏకేసీ దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఆర్‌కామ్‌కు చెందినవిగా కంపెనీ వర్గాల సమాచారం. కాగా, ఈడీ చర్యలు కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపించబోవని రిలయన్స్ ఇన్ఫ్రా ప్రకటించింది. -
అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌పై ఈడీ చర్య
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. సుమారు రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అక్టోబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.జప్తు చేసిన ఆస్తుల వివరాలుమనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నగరాల్లోని ఆస్తులు జప్తు అయ్యాయి. సుమారు రూ. 3,084 కోట్లు విలువ చేసే ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో నివాస భవనాలు, కార్యాలయ ప్రాంగణాలు, భూములున్నాయి.అసలు కేసు ఏంటి?అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ యెస్ బ్యాంక్ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ RHFLకు రూ.2,965 కోట్లు, RCFLకు రూ.2,045 కోట్లు ఇచ్చింది. అయితే వీటిని తిరిగి చెల్లించడంలో అనిల్ అంబానీ, తన ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు విఫలమయ్యాయి.ఈడీ దర్యాప్తులో అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ లింక్డ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల మంజూరు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారాన్ని ఈడీ ఉద్దేశపూర్వక, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలుగా అభివర్ణించింది. కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసిన అదే రోజున రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందే రుణాలు అడ్వాన్స్ చేసినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్, అమెజాన్‌ల పంట పండించిన స్టార్టప్ -
ఈడీ అటాచ్ చేసినా.. ఆస్తులను అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వివిధ స్కీమ్‌ల ముసుగులో రూ.6,000 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్ మరో కుంభకోణానికి తెరలేపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్ని వివిధ మార్గాల్లో నకిలీ పత్రాల సాయంతో విక్రయించారు. హైదరాబాద్‌లోని కొన్ని ఆస్తుల్ని అమ్మేయగా... ముంబైలో విక్రయానికి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన ఈడీ అధికారులు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడంతోపాటు ఈ దందాలో నౌహీరాషేక్‌కు సహకరించిన సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.స్కీముల పేరుతో రూ.వేల కోట్ల మోసాలు హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ సహా వివిధ రకాలైన స్కీమ్‌ల పేరు చెప్పిన నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా అనేకమంది నుంచి డిపాజిట్లు సేకరించింది. గరిష్టంగా 36 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి దాదాపు రూ.5 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు భారీగా ఆస్తులు సీజ్ చేశారు.అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం అటాచ్ చేసిన ఆస్తులను కోర్టు అనుమతితో వేలం వేయడం ద్వారా ఈడీ నగదుగా మారుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని విక్రయించడం ద్వారా ఈడీ అధికారులు రూ.93 కోట్లు సమీకరించారు. అయితే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఫ్లాట్లను విక్రయించడానికి నౌహీరా షేక్ పథకం వేసింది. హైదరాబాద్‌లో ఉన్న కొన్నింటిని అమ్మేసి సొమ్ము చేసుకుంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ముంబైలో ఉన్న రూ.12 కోట్ల విలువ చేసే మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వీటిపై కొందరితో సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న నౌహీరా షేక్ రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుంది. ఓ ఫ్లాట్ ఖరీదు చేసిన యజమానిని విచారించిన ఈడీ వాంగ్మూలం సైతం నమోదు చేసింది.సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం నౌహీరా షేక్ వేసిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నెల 10 తేదీన వీటి విచారణ జరిగింది. ఈ సందర్భంలో ఈడీ అధికారులు అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసు కువెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యా యస్థానం ఆయా ఆస్తుల్ని ఈడీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా నౌహీరా షేక్‌ను ఆదేశించింది. అలా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోపక్క ఈడీ అధికారులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆస్తులనూ నౌహీరా షేక్ విక్రయించినట్టు గుర్తించారు. వీటి రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సబ్రిజిస్ట్రార్ల వ్యవహారం ఆరా తీస్తోంది. -
జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (వాల్‌మార్ట్ యాజమాన్యంలోనిది)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసును పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించింది. సంస్థ తన తప్పును అంగీకరించి జరిమానా చెల్లించడం ద్వారా సుదీర్ఘ న్యాయపరమైన చిక్కులు లేకుండా కేసును మూసివేసేందుకు ఈడీ ప్రతిపాదించినట్టు సమాచారం.అసలు కేసేంటి?ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు FEMA, పోటీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలపై ఈడీ చాలా కాలంగా దర్యాప్తు చేస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలకు విరుద్ధంగా ఈ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లపై రాయితీలను ఇస్తూ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఈడీ మొదట్లో 2009 నుంచి 2015 మధ్య జరిగిన ఉల్లంఘనలపై కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత కూడా 2016 నుంచి దాని వ్యాపార కార్యకలాపాల్లో దర్యాప్తును విస్తరించింది.FEMA ‘కాంపౌండింగ్’ అంటే ఏమిటి?కాంపౌండింగ్ అనేది ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ఒక నిబంధన. ఇది ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలు వాటి తప్పును స్వచ్ఛందంగా అంగీకరించడానికి, నిర్ణీత జరిమానా చెల్లించడానికి, తద్వారా క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా సుదీర్ఘ న్యాయపరమైన అడ్డంకులను నివారించడానికి వీలు కల్పిస్తుంది. రెగ్యులేటరీ సంస్థలు కేసులను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించడానికి ఇది ఒక సాధారణ యంత్రాంగంగా ఉపయోగపడుతుంది.ఈడీ ఆఫర్ఈడీ ఇచ్చిన ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌కు చాలా ముఖ్యమైనది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్‌ను అంగీకరిస్తే అది సంవత్సరాల తరబడి సాగే న్యాయ పోరాటాలు, అధిక వ్యయం, కార్యకలాపాలపై నిరంతర ప్రతిబంధకాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తప్పును అంగీకరించి జరిమానా చెల్లించడం ద్వారా సంస్థ తన ప్రతిష్ట దెబ్బతినకుండా కొంతమేరకు కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి పరిశీలనలో ఉన్న అమెజాన్ ఇండియా వంటి ఇతర ఈ-కామర్స్ సంస్థలకు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ కంటే కాంపౌండింగ్ మార్గం ఒక ఆచరణాత్మక పరిష్కారంగా కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్ అంగీకరిస్తుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం.. -
‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు ఎఫెక్ట్.. తమిళనాడులో ఈడీ సోదాలు
చెన్నై: మధ్యప్రదేశ్ ‘కోల్డ్రిఫ్’(Coldrif Syrup) దగ్గు మందు కారణంగా 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తయారు చేస్తున్న తమిళనాడులోని(Tamil Nadu) శ్రీసన్ ఫార్మా(Sreesan Pharma) సంస్థపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా చెన్నైలో(Chennai) శ్రీసన్ ఫార్మాకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో ఈడీ(Enforcement Directorate) అధికారులు తనిఖీలు చేపట్టారు.వివరాల ప్రకారం.. చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారుచేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids In Tamilnadu) అధికారులు సోమవారం శ్రేసన్ ఫార్మాతో సంబంధమున్న చెన్నైలో ఏడు ప్రదేశాల్లో సోదాలు, తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ చట్టంకింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దగ్గు మందు తయారుచేసిన శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని రంగనాథన్(73)ను ఇటీవల అరెస్టు చేసిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.#Coldrif #CoughSyrupDeaths pic.twitter.com/zzVw4roe8J— NDTV (@ndtv) October 13, 2025మరోవైపు.. మధ్యప్రదేశ్‌లో చిన్నారుల మరణాల నేపథ్యంలో శ్రేసస్ ఫార్మా కంపెనీలో తనిఖీ చేయగా.. సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని తేలడంతో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండగా దగ్గు, జలుబు, జ్వరాలతో వెళ్లిన చిన్నారులకు వైద్యులు కోల్డ్రిఫ్ సిరప్‌ను సూచించగా అందులోని విషపదార్థం వల్ల పిల్లల కిడ్నీలు విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్రిఫ్ను నిషేధించాయి.ఇదిలా ఉండగా.. ఔషధ తయారీ సంస్థగా ఈ కంపెనీ కేంద్ర పోర్టల్‌లో రిజిస్టర్ కాలేదని దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఇచ్చే గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (GMP) సర్టిఫికెట్ లేకుండానే దశాబ్దాల పాటు ఫార్మా సంస్థ నడిచేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినట్లు తెలిపారు. దీంతో, ఫార్మా కంపెనీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
అనిల్ అంబానీ సహయకుడి అరెస్ట్
అనిల్ అంబానీ సహాయకుడు.. రిలయన్స్ పవర్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అయిన 'అశోక్ కుమార్ పాల్'ను ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.రిలయన్స్ పవర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్‌కు.. రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే ఆయనను ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన ఈడీ.. గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు, శనివారం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కోరనున్నట్లు సమాచారం.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పాల్.. 2023 జనవరి 29న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయనకు సుమారు ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్‌తో అనుబంధం ఉంది. అయితే భువనేశ్వర్, కోల్‌కతాతో సహా పలు ప్రాంతాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సోదాలు ప్రారంభించిన చాలా రోజుల తరువాత ఈ అరెస్టు చేయడం జరిగింది.ఏమిటి ఈడీ కేసురిలయన్స్ పవర్‌తో పాటు.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపైన రూ. 17వేల కోట్ల బ్యాంకు లోన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆగస్టులో ముంబైలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన తర్వాత ED దర్యాప్తు చేపట్టింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం.. కింద 50 కంపెనీలు, గ్రూప్‌తో సంబంధం ఉన్న 25 మంది వ్యక్తులను కవర్ చేసింది. తాజాగా సీఎఫ్ఓ అరెస్ట్ కేసులో మరింత కీలకంగా మారిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా.. -
శబరిమలై వివాదం.. సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు
మాలీవుడ్ అగ్రతారలను జాతీయ దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్న వేళ.. సీనియర్ నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమలై అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే సినీ తారలను తెర మీదకు తెచ్చారంటూ వ్యాఖ్యానించారాయన. ఆలయం నుంచి బంగారం మాయం కావడం కేరళను కుదిపేస్తుండగా(Sabarimala gold theft).. అక్కడి హైకోర్టు ఇప్పటికే సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. శుక్రవారం పాలక్కాడ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సురేష్ గోపికి తారలపై జరుగుతున్న దర్యాప్తు సంస్థల సోదాల గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. శబరిమలై బంగారు చోరీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఆ ఇద్దరు తారలను ముందుకు తెచ్చారని ఆరోపించారు. అయితే ఇలాంటి ఘటనలు అసాధారణం కావని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు.. ఇలా ప్రముఖుల ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారయన. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూడాల్సి వస్తుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారాయన. అయితే.. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతున్నందున.. కేంద్రమంత్రిగా ఇంతకు మించి తానేం మాట్లాడబోనని ముగించారు. ఈ క్రమంలో ఎక్కడా ఆ కేసు ఏంటి? ఆ తారలు ఎవరు? అనే విషయాన్ని మాత్రం సురేష్ గోపి(Suresh Gopi reacts On Raids on Actors) ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే.. భూటాన్-నేపాల్ మార్గం ద్వారా అక్రమంగా లగ్జరీ కార్లను దిగుమతి చేసుకున్నారనే అభియోగాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)లు ఆపరేషన్ నమ్‌ఖోర్(Operation Numkhor) చేపట్టాయి. అగ్రనటులు పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు దుల్కర్ సల్మాన్, మరికొందరు తారల ఇళ్లలో తనిఖీలు చేశాయి. ఈ క్రమంలో దుల్కర్‌కు చెందిన రెండు కార్లను ఈడీ సీజ్ చేసింది. కోయంబత్తూర్‌కు చెందిన ఓ నెట్వర్క్ ద్వారా హవాలా మార్గంలో లావాదేవీలు జరిపి.. అక్రమ రిజిస్ట్రేషన్లతో లగ్జరీ కార్లు తెప్పించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలో దుల్కర్ తండ్రి.. అగ్రనటుడు మమ్ముట్టి ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తాజాగా సోదాలు జరిగాయి.ఇక.. శబరిమలై అయ్యప్ప దేవాలయంలో బంగారం మాయం కావడం కలకలం రేపింది. 2019లో మరమ్మతుల కోసం పంపిన బంగారు విగ్రహాలపై 1.5 కిలోల బంగారం మాయమైందని తాజా విచారణలో బయటపడింది. ఈ అంశం ఇటు అసెంబ్లీని కుదిపేసింది. చివరకు.. హైకోర్టు ఆదేశాలతో SIT విచారణ కొనసాగుతోంది. ఈలోపు.. అయ్యప్ప యోగదండం కూడా మాయమైందన్న విషయం భక్తులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.ఇదీ చదవండి: శబరిమలై వివాదంలో మరో ట్విస్ట్ -
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో ఈడీ సోదాలు
కోచి: భూటాన్ నుంచి లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో మాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుల కార్యాలయాలు, ఇళ్లల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. కేరళ, తమిళనాడుల్లో ఏకకాలంలో 17 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ప్రముఖ మాలీవుడ్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలకల్ తోపాటు పలువురు లగ్జరీ వాహనాల యజమానుల ఇళ్లు, ఆటో వర్క్‌షాప్‌లు, వ్యాపారుల ఆస్తుల్లో ఈ సోదాలు నిర్వ హించారు. కేరళలోని ఎర్నాకులం, త్రి స్సూరు, కోజికోడ్, మలప్పురం, కొట్టా యం, తమిళనాడులోని కోయంబత్తూ రు, చెన్నై తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నైలో మాలీవుడ్ సూపర్‌స్టార్ మమ్ముట్టికి చెందిన ఓ ప్రాపర్టీలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మమ్ముట్టి కుమారుడే దుల్కర్ సల్మాన్ అన్న విషయం తెలిసిందే. ఏమిటి కేసు?భూటాన్‌లో ఖరీదైన లగ్జరీ కార్లను సెకండ్‌హ్యాండ్‌లో కొందరు స్మగ్లర్లు తక్కువ ధరకు కొని, వాటిని అక్రమంగా భారత్‌కు తీసుకొచ్చి.. ఇక్కడే తయారైనట్లు పత్రాలు సృష్టించి అధిక ధరకు విక్రయించారు. ఈ క్రమంలో ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా)తోపాటు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)ను ఉల్లంఘించారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఇలా అక్రమంగా దిగుమతి చేసుకున్న కార్లను మాలీవుడ్ నటులు కొన్నట్లు ఈడీ విచారణలో తేలటంతో సోదాలు నిర్వహించింది. ఈ అంశంలో పీఎంఎల్ఏ కింద ఈడీ త్వరలో కేసు నమోదుచేసి మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. కోయంబత్తూర్‌కు చెందిన స్మగ్లింగ్ ముఠా తీసుకొచ్చిన కార్లలో ఒకదానికి దుల్కర్ సల్మాన్ కొనుగోలు చేయగా, దానిని కస్టమ్స్ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆయన కేరళ హైకోర్టుకు వెళ్లటంతో కారు కోసం అర్జీ పెట్టుకుంటే వారంలోగా పరిశీలించాలని కస్టమ్స్ విభాగాన్ని కోర్టు మంగళవారం ఆదేశించింది. -
ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌతేలా
నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela)కు చిక్కులు తప్పవని తెలుస్తోంది. తాజాగా ఈడీ విచారణకు ఊర్వశి హాజరైంది. కొద్దిరోజుల క్రితం విచారణకు రావాలని ఆమెకు ఈడీ కార్యాలయం సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు వెళ్లింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంత డబ్బు సంపాదించారు..? తనను వారు ఎలా సంప్రదించారు..? మనీ ట్రాన్షక్షన్స్ ఎలా చేస్తారు..? వంటి అంశాల గురించి ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లోని స్టార్స్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, సోనూ సూద్ వంటి స్టార్స్‌తో పాటు సురేశ్ రైనా వంటి క్రికెటర్స్ కూడా ఈ కేసులో ఉన్నారు. -
‘సృష్టి’ ఫెర్టిలిటీ.. ఈడీ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సృష్టిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్‌కు డాక్టర్ నమ్రత పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నమ్రతను త్వరలోనే ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సృష్టి ఫెర్టిలిటీ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. విశాఖ కేంద్రంగానే సరోగసీ పేరుతో పెద్ద ఎత్తున పిల్లల విక్రయాలు జరిగినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు కేజీహెచ్‌లో పనిచేస్తుండగా, మరొకరు శ్రీకాకుళం జిల్లాలో సేవలందిస్తున్నారు. వీరిలో ఒకరు బెయిల్‌పై విడుదలవగా, మరో ఇద్దరు రిమాండ్‌లో ఉన్నారు. 1988 బ్యాచ్‌లో వైద్య విద్య చదివి వైద్యులుగా స్థిరపడ్డ మరికొందరి పాత్ర కూడా ఇందులో ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. వారి వివరాలను ఇప్పటికే తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆయా వైద్యుల బ్యాంకు ఖాతాలను పరిశీలించి భారీగా నిధులు జమైన సందర్భాలపై ఆరా తీస్తున్నారు.ఫోన్లు స్విచ్ఛాఫ్..‘సృష్టి’ కేసు బయటకు రావడం.. ముగ్గురు 1998 బ్యాచ్ వైద్య విద్యార్థినులను అరెస్టు చేయడంతో మిగతావారి ఫోన్లు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం. దీంతో పోలీసుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. మరింత మంది ఈ దందాలో ఉన్నట్లు వెలుగు చూడడంతో వైద్య వర్గాల్లో గుబులు రేపుతోంది. గౌరవనీయమైన వైద్య వృత్తిలో ఉంటూ సరోగసి ముసుగులో అక్రమాలకు పాల్పడడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. -
'సోనూ సూద్'ను విచారిస్తున్న ఈడీ అధికారులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో(betting app case) ఈడీ విచారణకు బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సోనూసూద్‌కు ఈడీ ముందుకు వచ్చారు. 1xBet బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి ఆయనకు గతంలోనే ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే.ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ మధ్యాహ్నం 12 గంటలకు సోనూ సూద్ విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌నకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనూసూద్‌తో పాటు క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇప్పటికే వారిని కూడా విచారించారు. నిషేధిం ఉన్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెబ్రిటీలు కూడా చిక్కుల్లో పడ్డారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, హర్భజన్‌సింగ్, యువరాజ్‌సింగ్, సురేశ్ రైనాలను కూడా ఈడీ విచారించింది. -
‘స్కిల్’లో అడ్డంగా దొరికింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా ఎక్కడలేని హడావుడి చేస్తోంది. పనిగట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వారుస్తోంది. జరగని స్కామ్‌ను జరిగినట్లు చూపడానికి కుట్రలు, కుతంత్రాలతో కుప్పిగంతులు వేస్తోంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటూ రోజుకో కట్టుకథ చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. చంద్రబాబు ఏరికోరి నియమించిన సిట్ దర్యాప్తులో ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేక పోగా, ఇప్పుడు ఈడీ పేరు చెప్పి దుష్ప్రచారంలో మరో అంకానికి తెర తీసింది. దుబాయ్‌లో డబ్బులంటూ హంగామా చేస్తోంది. లేని స్కామ్‌ను పట్టుకుని కక్ష పూరితంగా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో అసలు స్కామ్ అంటే ఎలా ఉంటుంది.. ఇదే చంద్రబాబు ముఖ్య నిందితుడిగా ఉన్న ‘స్కిల్’ కేసులో ఈడీ ఎలా కొరడా ఝుళిపించిందో.. అన్ని ఆధారాలతో నాటి సిట్.. చంద్రబాబు బండారాన్ని ఎలా బట్టబయలు చేసిందో గుర్తు చేసుకోవాలంటే ఆ కేసు మూలాల్లోకి వెళ్లాల్సిందే. ఆ కేసులో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చిన ఇదే చంద్రబాబు ఎన్ని శ్రీరంగ నీతులు చెబుతున్నా ఆయన ‘స్కిల్ క్రిమినల్’ అని సీఐడీ ఏనాడో తేల్చి చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అదే విషయాన్ని నిగ్గు తేల్చింది.రూ.370 కోట్ల అంచనాలు రూ.3,300 కోట్లకు పెంచేసి.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)ను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు అనంతరం డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆరి్థక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు.. గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు. చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు.ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. అందుకే టెండర్ల ప్రక్రియ అనేది లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్ టెక్కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు. ఇక షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు నిధులు ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్ఎస్డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్ఎస్డీసీ తరఫున నిధులు ఎలా మంజూరు చేస్తామని తమ అభ్యంతరాలను పీవీ రమేశ్ తన నోట్ ఫైల్లో పొందుపరిచారు. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీఎస్ఎస్డీసీ సీఈవో గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తర్వాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు. అదే విషయాన్ని పీవీ రమేశ్ ప్రత్యేక కార్యదర్శి సునీతకు తెలియజేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందులో సాఫ్ట్వేర్ కొనుగోలుకు రూ.56 కోట్లు చెల్లించారు., మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలో షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 2018లోనే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం» ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం 2018లోనే గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పూణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్వాయిస్లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్ఎస్డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా అప్పటి సీఎం చంద్రబాబు ఏసీబీని అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు.» 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. » ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు. » ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లుగా వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది. దీంతో ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది.స్కిల్ కుంభకోణంలో బాబు అరెస్టు.. రిమాండ్‌లో 52 రోజులు » ఈ కేసులో కీలక ఆధారాలు లభించడంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు. » అప్పటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతోపాటు మరో 38 మందిని నిందితులుగా పేర్కొంది. 2023 సెపె్టంబరు 9న సిట్ చంద్రబాబును అరెస్టు చేసింది. ఆయన అవినీతికి ఆధారాలున్నాయన్న సిట్ వాదనతో ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది. అందుకే చంద్రబాబును రిమాండ్‌కు పంపింది. ఈ కేసులో చంద్రబాబు 52 రోజులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. ఆ ముగ్గురే కీలకం..» 2014–19లో రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయ పన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసింది. ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. » చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి అయిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది. వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారవ్వడం గమనార్హం. 2024లో బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బాబు అవినీతిపై ఈడీ కొరడా» ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన ముడుపులు.. ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయి.. అక్కడి నుంచి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది. » డిజైన్ టెక్కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెర్డ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది. బాబు అవినీతిని కడిగిపారేసిన కాగ్» రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. » అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి, ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. -
హైదరాబాద్‌లో ఈడీ అధికారుల సోదాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ దర్యాప్తు సంస్థల వరుస సోదాలు, తనిఖీలతో నగరం మరొకసారి ఉలిక్కిపడింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నగరంలోని ప్రముఖ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో గురువారం ఉదయం ఈడీ అధికారుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బూరుగు రమేష్‌తో పాటు ఆయన తనయుడు విక్రాంత్ ఇంట్లోనూ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయిన ఈడీ అధికారులు ఆల్వాల్, మారేడుపల్లిలో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందాల్సి ఉంది. -
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. తాజాగా భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet సోషల్ మీడియా ప్రమోషన్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ మాజీ క్రికెటర్లను ఈడీ విచారించనుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఈ నెల 22న ఉతప్ప, 23న యువరాజ్ సింగ్‌లు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. వీరిద్దరితో పాటు బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ దావన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. -
ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు
బాలీవుడ్ హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి చిక్కుల్లో పడ్డారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వారిపై కొద్దిరోజులుగా ఈడీ దూకుడు చూపుతుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లోని స్టార్స్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. -
అనిల్ అంబానీపై కేసుల మీద కేసులు..
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు మరికొందరు అధికారులపై రూ.2,929 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈడీ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు నష్టం కలిగించాయని, దాంతో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని సీబీఐ ఇప్పటికే తెలిపింది.ముంబైలో అనిల్ అంబానీ, ఆర్‌కామ్‌కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అప్పుగా తీసుకున్న బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో, రుణాలు ఎందులోకి మళ్లించబడ్డాయో నిర్ధారించడానికి ఆధారాలను సేకరించే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించారు. జూన్ 13న ఆర్‌కామ్, అంబానీలను ఫ్రాడ్ గుర్తించిన ఎస్బీఐ జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపింది.ఇటీవల అనిల్ అంబానీని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది. దాదాపు దశాబ్దం క్రితం ఆర్‌కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. ఆర్‌కామ్‌కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్‌కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది.ఇదీ చదవండి: భారత వృద్ధి అంచనాలు అప్!ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అంబానీని ఈడీ ప్రశ్నించింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో రూ.3,000 కోట్లు నిధులు మళ్లించినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు ప్రమోటర్లు కూడా రుణాలు మంజూరు కావడానికి ముందు చెల్లింపులు పొందినట్లు కనుగొంది. ఇది క్విడ్ ప్రో కోకు దారితీసినట్లు సూచిస్తుంది. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. ఈడీ కోర్టులో మంత్రి లొంగుబాటు
కోల్‌కతా: ప్రాథమిక పాఠశాలల్లో నియామకాల అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రకాంత్ సిన్హా శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న సిన్హా ఈడీ కోర్టులో హాజరై లొంగుపోతున్నట్లు ప్రకటించారని ఈడీ అధికారులు తెలిపారు.కాగా, కేసు విచారణకు గాను ఆయన్ను ఈడీ కస్టడీ కోరగా కోర్టు తోసిపుచ్చింది. షరతులకు లోబడి రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోల్‌కతా లేదా సొంత నియోజకవర్గం వీడి వెళ్లరాదని సిన్హాను కోర్టు ఆదేశించింది అని అన్నారు. కాగా, బిర్హుమ్ జిల్లాలోని బోల్పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. -
శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గురువారం (సెప్టెంబర్ 4, 2025) నోటీసులు జారీ చేసింది. ఈ కేసు నిమిత్తం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు ధవన్ ప్రమోషనల్ ఎండార్స్మెంట్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈడీ అధికారులు ధవన్‌ను Prevention of Money Laundering Act (PMLA) కింద విచారించనున్నారు. ఇదే కేసులో మరో టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇదివరకే విచారణకు హాజరయ్యాడు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ కేసులో విచారణకు ఎదుర్కొన్నారు.ఇదే కేసులో గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. వీరి ప్లాట్‌ఫాంలలో బెట్టింగ్ యాప్స్‌కి ప్రాధాన్యత ఇచ్చారని ఈడీ అభిప్రాయడుతుంది.కాగా, ఆన్లైన్ గేమింగ్ యాప్‌లు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతూ, పన్నుల ఎగ్గొడుతూ, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయనన్న కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం విధించింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా నల్లధనం, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సెలబ్రిటీలు యాప్‌లను ప్రచారం చేయడం ద్వారా సామాన్య ప్రజలు ప్రభావితం అవుతున్నారని, కొందరు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర భావిస్తుంది. -
ఆప్ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు మరో 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నాయి. ఆస్పత్రుల నిర్మాణ అవకతవకలకు సంబంధించిన నేపథ్యంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.ఆప్ పాలనలో సౌరభ్ భరద్వాజ్ ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆస్పత్రుల నిర్మాణాల్లో అవకతకవలు జరిగినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదే కేసులో మరో మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ని సైతం దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. అభియోగాలేంటంటే.. 2018-19లో ఆప్ ప్రభుత్వం రూ. 5,590 కోట్ల విలువైన 24 ఆసుపత్రుల ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల్లో అనేక ఆలస్యాలు, ఖర్చుల పెరుగుదల, మరియు నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ICUలతో కూడిన ఆసుపత్రులు 6 నెలల్లో పూర్తవ్వాల్సి ఉండగా, 3 సంవత్సరాలు గడిచినా 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక ఎల్ఎన్జీపీ ఆసుపత్రి ఖర్చు రూ. 488 కోట్ల నుంచి రూ. 1,135 కోట్లకు పెరిగింది, కానీ దాని నిర్మాణంలోనూ ఎలాంటి పురోగతి కనిపించలేదు. పైగా అనుమతి లేకుండా కొన్ని ప్రదేశాల్లో నిర్మాణాలు చేపట్టడం, అదే సమయంలో కాంట్రాక్టర్ల పాత్రపై అనుమానాలు నెలకొన్నాయి. అలాగే Hospital Information Management System (HIMS) 2016 నుంచి పెండింగ్‌లో ఉంది, దీన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణల నేపథ్యంతో.. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ 2025 జూన్‌లో సత్యేందర్ జైన్ , సౌరభ్ భరద్వాజ్‌లపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కేసును ఈడీకి బదలాయించగా.. విచారణ జరుగుతోంది. -
గోడ దూకి పారిపోయిన ఎమ్మెల్యే
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహాను ఈడీ అధికారులు అనూహ్యరీతిలో అరెస్ట్‌చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తన ఇంట్లో, తనకు సంబంధించిన స్థలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అప్పటికప్పుడు ఎమ్మెల్యే తన ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి, తర్వాత ఎత్తయిన గోడ ఎక్కి బయటకు ఎలాగోలా దూకి పారిపోయారు. రెప్పపాటులో ఈ విషయం కనిపెట్టిన ఈడీ అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాలు వెంటనే ఆయన వెంటబడిమరీ సమీప పొలంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలోపే ఎమ్మెల్యే తన స్మార్ట్ఫోన్లను సమీపంలోని బురదకుంటలో పడేశారు. అయినాసరే పోలీసులు వాటిని వెలికితీసి స్వాధీనంచేసుకున్నారు. మొబైల్లో కీలక సమాచారం ఉందని భావిస్తున్నారు. బురదకొట్టుకుపోయిన ఎమ్మెల్యేను పొలం గట్టు వెంట పోలీసులు అరెస్ట్‌చేసి తీసుకొస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ముర్షీదాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఈ నాటకీయ పరిణామం జరిగింది. అరెస్ట్ తర్వాత సాహాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్ట ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆగస్ట్ 30వ తేదీదాకా ఈడీ రిమాండ్‌కు తరలిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యే సాహా సంబంధ స్థలాలతోపాట రఘునాథ్‌గంజ్‌లోని సాహా కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల నివాసాల్లోనూ ఈడీ సోదాలుచేసి కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనంచేసుకుంది. ఇదే టీచర్లు, స్టాఫ్ నియామక కేసులో 2023 ఏప్రిల్‌లో సాహాను సీబీఐ అధికారులు అరెస్ట్‌చేశారు. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఇదే కేసు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నించగా ఏమాత్రం సహకరించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అరెస్ట్చేయాల్సి వచ్చిందని న్యాయస్థానంలో హాజరుపర్చిన సందర్భంగా ఈడీ వాదించింది. పశ్చిమబెంగాల్లో ప్రైమరీ టీచర్లతోపాటు 9, 10వ తరగతులు బోధించే అసిస్టెంట్ టీచర్లు, గ్రూప్–సి, డి సిబ్బంది నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని సీబీఐ తొలుత కేసు నమోదుచేసింది. ఇందులోని వివరాలతో తర్వాత ఈడీ ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తును మనీలాండరింగ్ కోణంలో విస్తృతస్థాయిలో దర్యాప్తుచేసింది. ఈ కుంభకోణంలో కీలకసూత్రధారిగా భావిస్తున్న నాటి విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ, మాజీ టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే అరెస్ట్‌చేశాయి. #Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam. Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025 -
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్స్.. నోట్ల కట్టలు.. నగల గుట్టలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) శనివారం అరెస్ట్ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై గ్యాంగ్‌టక్‌లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. వీరేంద్ర పలు అక్రమ బెట్టింగ్ వెబ్సైట్లు నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఆయన సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్‌లో మూడు సంస్థలు ద్వారా గేమింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. గ్యాంగ్టాక్లో కాసినో స్థలాన్ని లీజుకు తీసుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో వీరేంద్రను అరెస్ట్ చేశారు.ఈ బెట్టింగ్ రాకెట్ కార్యకలాపాలు దుబాయ్ కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ అరెస్టు క్రమంలో ముందుగా దేశవ్యాప్తంగా వీరేంద్రకు సంబంధించిన 30 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో దాడులు జరిపింది. 22, 23(శుక్ర, శని) తేదీల్లో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాతో సహా పలు రాష్ట్రాల్లో ఈ దాడులు జరిగాయి. గోవాలోని ఐదు ప్రముఖ కాసినోలపై కూడా దాడులు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని భారీ మొత్తంలో నగదు, బంగారం బయటపడ్డాయి. ఈడీ సోదాల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.తనిఖీల్లో సుమారు రూ. 12 కోట్ల నగదు, రూ. 6 కోట్ల విలువైన గోల్డ్ ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదులో దాదాపు కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. నాలుగు ఖరీదైన వాహనాలను సీజ్ చేయడంతో పాటు వీరేంద్రకు చెందిన 17 బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు స్తంభింపజేశారు. రెండు బ్యాంక్ లాకర్లను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తున్నారు
పాట్నా: ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థల ప్రయోగాలు పనిచేయడం లేదని తేలాక బీజేపీ ఇప్పుడు ఈసీని ప్రయోగిస్తోందని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టడానికే ఈసీ ఈ ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో తేజస్వి యాదవ్ బీజేపీపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం ఇలాగే ద్రోహం చేయాలని నిర్ణయించుకుంటే తాము ఎన్నికలను బహిష్కరించడానికి కూడా వెనుకాడబోమని మరోమారు స్పష్టం చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఈసీ నిస్సంకోచంగా ప్రయత్నిస్తోంది. ప్రత్యర్థులను బెదిరించడానికి సీబీఐ, ఈడీ, ఆదాయపు ప్ను శాఖ వంటి ఏజెన్సీలన్నింటిని ప్రయోగించిన బీజేపీ.. ఇప్పుడు రాజ్యాంగ బద్ధమైన ఈసీని తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. ఈ ఆటలో భాగంగా ఈసీ చాలామంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులను అందిస్తోంది. గతేడాది నేను విజయ్ కుమార్ సిన్హా కేసును బయటపెట్టాను. ఈ రోజు ముజఫర్‌పూర్ మేయర్ నిర్మలా దేవీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు’ అని తేజస్వి అన్నారు. ఇంత వివాదం నడస్తున్నా ఈసీ ఎప్పుడూ మీడియా ముందుకు రాకపోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, బీహార్ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడరు, చివరకు ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా వారినే అనుసరిస్తున్నట్లు అనిపిస్తోందని తేజస్వి వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందన్నారు. ఆగస్టు 17న రోహ్తాస్ జిల్లాలో ప్రారంభమయ్యే ఓటర్ల హక్కు యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి వచ్చిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిఖూభాయ్ దల్సానియా బీహార్‌లో ఓటరుగా నమోదు చేసుకోవడంపై తేజస్వి అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటి మంచు లక్ష్మి బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈడీ అధికారుల బృందం ఆమెను ప్రశ్నించింది. ‘యో 247’ అనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వివరాలు సేకరించింది. గత మూడు సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ప్రశ్నించింది. లక్ష్మి చెప్పిన వివరాలతో దాదాపు మూడు గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన యాప్‌కు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. ప్రమోట్ చేసినందుకు ఎలాంటి అగ్రిమెంట్లు చేసుకున్నారనే వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ నుంచి మంచు లక్ష్మి బ్యాంక్ అకౌంట్లలోకి జరిగిన లావాదేవీల గురించి ఆరా తీసినట్లు తెలిసింది. పారితోషికం, కమీషన్లకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. కొన్ని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించాలని ఆమెకు ఈడీ బృందం సూచించినట్లు తెలిసింది. -
Betting App Case: ముగిసిన మంచు లక్ష్మి ఈడీ విచారణ
టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లిన మంచు లక్ష్మీని ఈడీ బృందం దాదాపు మూడున్నర గంటల పాటు విచారించింది. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఐదేళ్ల లావాదేవీలను ఈడీ అధికారులకు లక్ష్మీ అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే మంచు లక్ష్మీ వెళ్లిపోయారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు జులై 21న ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జులై 30న ప్రకాశ్ రాజ్, ఈ నెల 6న విజయదేవరకొండ, 11న హీరో రానా ఈడీ ముందు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మంచు లక్ష్మీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ కేసులో నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది. -
చిక్కుల్లో సురేశ్ రైనా.. ఈడీ నోటీసులు
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చిక్కుల్లో చిక్కుకున్నాడు. అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు పంపింది. ఇవాళ అతను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌కు ప్రమోషన్ చేశాడని రైనాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్ గాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం PMLA కింద రైనాపై విచారణ జరుగనుంది. అక్రమ యాప్ ప్రకటనల్లో రైనా కనిపించినట్లు ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి.ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే గూగుల్, మెటా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసింది. 1xBet తరహాలోనే గ్యాంబ్లింగ్‌కు పాల్పడే పలు యాప్స్‌పై కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా 27,000 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా. ఇలాంటి కేసుల్లోనే సినీ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, రానా దగ్గుబాటి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.ఇదిలా ఉంటే, సురేశ్ రైనా టీమిండియా, ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు. త్వరలో అతను సీఎస్కేకు బ్యాటింగ్ కోచ్‌గా వెళ్లనున్నాడని సమాచారం. రైనాకు టీమిండియా తరఫున ఆడిన దానికంటే ఐపీఎల్ ద్వారా విశేషమైన గుర్తింపు దక్కింది. ఐపీఎల్లో విశేషంగా రాణించడం ద్వారా అతన్ని మిస్టర్ ఐపీఎల్‌గా కీర్తిస్తారు. ఐపీఎల్లో రైనా 2008 నుంచి 2021 వరకు సీఎస్కే తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. సీఎస్కే సాధించిన 4 ఐపీఎల్ టైటిళ్లలో రైనా కీలకపాత్ర పోషించాడు. -
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు మంచు లక్ష్మీ
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ సాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేశారు. అలా ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా.. ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. గంటల పాటు సాగిన విచారణకు సహకరించారు. ఇప్పుడు బుధవారం(ఆగస్టు 13) నాడు మంచు లక్ష్మీ.. ఈడీ అధికారుల ముందు హాజరుకానుంది.(ఇదీ చదవండి: 'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?)ఈ రోజు 11 గంటలకు వ్యక్తిగతంగా మంచు లక్ష్మీ.. ఈడీ కార్యాలయానికి రానుంది. ఇప్పటికే సంబంధిత వివరాలు తీసుకురావాలని ఈమెకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అక్రమ మార్గంలో అనధికారికంగా వచ్చిన డబ్బు ఎంత తీసుకున్నారు? ప్రమోషన్‌తో ఎంత లాభం చేకూరింది? తదితర అంశాల గురించి ప్రశ్నించనున్నారు. మనీ లాండరింగ్ అంశాలపైన కూడా దర్యాప్తు కొనసాగించనున్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు కోసం ముగ్గురు హీరోయిన్లు?) -
ముగిసిన దగ్గుబాటి రానా ఈడీ విచారణ
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఈడీ విచారణ ముగిసింది. ఆయనను దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు.కాగా.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే గతంలోనే హాజరు కావాల్సి ఉండగా.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీని కాస్త సమయం కోరడంతో ఆగస్టు 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. దీంతో సోమవారం విచారణకు హాజరై ఈడీ అధికారులకు వివరణ ఇచ్చారు. అలాగే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది.ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. -
Betting App Case: ED విచారణకు హాజరైన నటుడు రానా
-
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరుకానున్న రానా
-
బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హీరో రానా
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా.. నేడు (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇతడికి గతంలోనే ఓసారి నోటిసులు ఇస్తే.. తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు చెప్పాడు. ఈడీని కాస్త సమయం కోరాడు. దీంతో రానాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. 11వ తేదీన ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.(ఇదీ చదవండి: ఆయన దీవెనలు ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: ఎన్టీఆర్)ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాశ్ రాజ్‌ని 6 గంటలు విచారించగా, విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. మరి రానా ఈరోజు విచారణకు హాజరవుతాడా లేదా అనేది చూడాలి? అలానే ఈ బుధవారం అంటే 13వ తేదీన మంచు లక్ష్మి హాజరు కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
నేడు ఈడీ ముందుకు రానా దగ్గుబాటి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో నటుడు రానా దగ్గుబాటి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 23న ఆయన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, షూటింగ్స్ కారణంగా సమయం కావాలని కోరారు. దీంతో ఆగ స్టు 11న హాజరు కావాలని ఈడీ అధికారులు సూచించారు. ఈ కేసులో ఇప్పటికే జూలై 30న ప్రకాశ్‌రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండ ఈడీ ముందు హాజరయ్యారు. కాగా, షెడ్యూ ల్ ప్రకారం ఈనెల 13న మంచు లక్ష్మి విచార ణకు హాజరు కావాల్సి ఉంది. మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చారు. మంచు లక్ష్మి విచా రణ అనంతరం మరికొంత మంది సెలబ్రి టీలను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘సృష్టి’ కేసులో మరో కీలక మలుపు.. రంగంలోకి ఈడీ
సాక్షి, హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమ్రత కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చైల్ట్ ట్రాఫికింగ్ ద్వారా రూ.కోట్లు సంపాదించి నమ్రత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 30 మంది అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. రూ.25 కోట్లు వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. 80 మంది పిల్లలను ఈ ముఠా విక్రయించింది. విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనీలాండరింగ్‌పై ఈడీ విచారణ చేయనుంది. సరోగసి పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత గతంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసిందా..? ఔననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.2020లో విశాఖపట్నంలో ఈమెపై క్రిమినల్ కేసులు నమోదైన తర్వాత హైదరాబాద్‌లోనూ కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. వీటి విషయంలో ఆమె అప్పట్లో పోలీసులను మేనేజ్ చేయడంతో బయటపడ్డారని తెలుస్తోంది. ఆపై కరోన విజృంభణ, లాక్డౌన్ తదనంతర పరిణామాలతో మరికొందరు బాధితులు వెనక్కు తగ్గారు. ఇవన్నీ కలిసి రావడంతోనే నమ్రత యథేచ్ఛగా తన దందా కొనసాగించగలిగారని సమాచారం. సృష్టి సెంటర్‌కు అనుకూలంగా 2019, 2020ల్లో ఇంటర్నెట్లో జరిగిన ప్రచారం అనేక మంది దృష్టికి ఆకర్షించింది.దీంతో వివాహమై కొన్నేళ్లు అయినా సంతాన లేమితో బాధపడుతున్న భార్య భర్తలు సికింద్రాబాద్‌లోని ఈ సెంటర్‌ను సంప్రదించారు. వీరికి పరీక్షలు చేసే నమ్రత వారిలో ఉన్న లోపాలను గుర్తించేది. ఆ విషయాలను మాత్రం వారికి చెప్పకుండా దాచి పెట్టేది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో సంతానం కలిగే అవకాశం ఉందంటూ చెప్పి భారీ మొత్తం వసూలు చేసేది.ఐవీఎఫ్ విధానంలో భార్య నుంచి అండం, భర్త నుంచి వీర్యం తీసుకుని ల్యాబ్‌లో పిండాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ పిండాన్ని తిరిగి భార్య గర్భంలో ఉంచి సంతానం కలిగేలా చేయడం ఈ విధానం ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి విరుద్ధంగా వ్యవహరించిన నమ్రత వేరే వారికి చెందిన అండం, వీర్యాలను సేకరించి (ఏది అవసరమైతే అది) పిండాన్ని అభివృద్ధి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.అప్పట్లో ఈ విషయం గుర్తించిన ఒకరిద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వీటిని స్వీకరించే సమయంలో అధికారులు సైతం బాధితుల తరఫునే నిలిచేవారు. ప్రాథమిక విచారణ పేరు నమ్రత లేదా ఆమె తరఫు వారిని పోలీసుస్టేషన్‌కు పిలిచే వారు. ఆ సమయాన్ని సది్వనియోగం చేసుకునే నమ్రత ఆయా అధికారులను మేనేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ కారణంగానే మరోసారి ఠాణాకు వచ్చే బాధితులతో ఆయా అధికారుల ప్రవర్తన పూర్తిగా మారిపోయేది. తాజాగా నమ్రతపై వరుస కేసులు నమోదు అవుతుండటంతో అప్రమత్తమైన అధికారులు గతాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కొన్ని అంశాలు వెలుగులోకి వచి్చనట్లు తెలిసింది. డాక్టర్ నమ్రత నెట్‌వర్క్‌లో ఆమెతో కలిసి విద్యనభ్యసించిన వైద్యులు కూడా ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ కోణంలో దర్యాప్తు చేస్తూ వివరాలు ఆరా తీస్తున్నారు. గాంధీ ఆస్పత్రి వైద్యుడు సదానందం మాదిరిగానే వైజాగ్‌కు చెందిన ప్రభుత్వ వైద్యులు నమ్రతకు సహకరించారని తెలుస్తోంది. నమ్రతపై నమోదైన కేసుల్లో గోపాలపురం పోలీసులు ఇప్పటి వరకు 25 మంది నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తుల్లో వెలుగులోకి వస్తున్న వివరాల ఆధారంగా మరికొందరు వైద్యులు, టెక్నషియన్లు, సహాయకులతో పాటు ఏజెంట్లు, శిశువుల్ని విక్రయించిన, ఖరీదు చేసిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
రూ.23వేల కోట్ల హవాలా సొమ్మును బాధితులకు ఈడీ అందజేసింది
న్యూఢిల్లీ: అక్రమంగా సంపాదించిన రూ.23 వేల కోట్ల డబ్బును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుని ఆయా నేరాల బాధితులకు అందజేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్(బీపీఎస్ఎల్) ఆస్తుల విక్రయానికి అనుమతిస్తూ మేలో జారీ చేసిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ న్యాయవాది బీపీఎస్‌ఎల్‌పై ఈడీ కేసు గురించి ప్రస్తావించగా సీజేఐ గవాయ్..ఇక్కడ కూడా ఈడీ ఉందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ..‘ఇక్కడో వాస్తవ చెప్పాలి. ఇప్పటి వరకు ఈడీ మనీలాండరింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23 వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. దీని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించింది’అని అన్నారు. -
నేను వాటిని మాత్రమే ప్రమోట్ చేశా.. విజయ్ దేవరకొండ
సాక్షి, హైదరాబాద్: 'నేను కేవలం గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోట్ చేయలేదు' అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). గేమింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన కాంట్రాక్ట్, తీసుకున్న డబ్బు.. సహా అన్ని వివరాలను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారులకు ఇచ్చానని తెలిపాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదుబెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే! ఈ కేసులో విచారణకు రమ్మంటూ విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఈడీ ఎదుట హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు హీరోను విచారించారు. విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడాడు. బెట్టింగ్ యాప్ కేసులో నా పేరు రావడంతో విచారణకు పిలిచారు. కానీ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. గేమింగ్ యాప్స్ మాత్రమే ప్రమోట్ చేశాను.విచారణకు సహకరించా..A23 అనేది గేమింగ్ యాప్. చాలా రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్ లీగల్. వీటికి జీఎస్టీ, ట్యాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్.. ఇలా అన్నీ ఉంటాయి. ఈ గేమింగ్ యాప్స్.. ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్స్‌కు కూడా స్పాన్సర్ చేస్తున్నారు. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ అనేది తెలంగాణలో ఓపెన్ అవ్వదు. నా బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఈడీకి ఇచ్చాను. అధికారుల విచారణకు సహకరించాను అని పేర్కొన్నాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
-
నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న విజయ్ దేవరకొండ
-
నేడు ఈడీ విచారణకు హీరో విజయ్ దేవరకొండ
బెట్టింగ్ యాప్ కేసులో.. నేడు (ఆగస్టు 06) ఈడీ విచారణ జరగనుంది. నటుడు విజయ్ దేవరకొండ అధికారుల ముందు హాజరు కానున్నాడు. ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌ని ఈడీ అధికారులు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈయన.. మరోసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పాడు. మరి ఈ రోజు విజయ్ దేవరకొండ ఏం చెబుతాడో చూడాలి?(ఇదీ చదవండి: నా సొంతిల్లు తాకట్టు పెట్టి సినిమా తీశా: 'మహావతార్ నరసింహా' డైరెక్టర్)విజయ్ దేవరకొండతో పాటు 'బాహుబలి' నటుడు రానా.. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని నోటీసులు పంపించారు. ఇవాళ విజయ్ దేవరకొండ విచారణకు హాజరైతే మనీ లాండరింగ్ కోణాల్లో విచారణ జరపనున్నారు. బెట్టింగ్ యాప్స్ నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్స్ గురించి ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్స్, ఎందుకు ప్రమోషన్ చెయ్యాల్సి వచ్చింది? అలానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రష్మీతో మనస్పర్థలు.. నిజం బయటపెట్టిన అనసూయ) -
తీవ్ర చిక్కుల్లో అనిల్ అంబానీ.. బ్యాంక్‌లకు ఈడీ నోటీసులు
రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీని కష్టాలు వెంటాడుతున్నాయి. మనీలాండరింగ్ కేసులో ఆయనపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. తాజాగా ఈ కేసులో పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. లోన్ ఫ్రాడ్ కేసుకు సంబధించి పలు వివరాలు కోరింది. వీటిల్లో ఆయన కంపెనీలకు చెందిన రుణ మంజూరు పత్రాలు వంటివి ఉన్నాయి. మొత్తం 12-13 బ్యాంకులకు దర్యాప్తు సంస్థ నుంచి నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటిలో వీటిల్లో పబ్లిక్ సెక్టార్‌తోపాటు ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఇవి రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ వంటి సంస్థలకు భారీగా అప్పులు ఇచ్చాయి. తాజాగా ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సింద్ బ్యాంక్ ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. అనిల్ అంబానీ కంపెనీలకు ఇచ్చిన అప్పుల్లో మొండి బకాయిలుగా మారిన కేసుల్లో కొందరు బ్యాంక్ అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. వీరిని లోన్ క్లియరెన్స్‌లకు సంబంధించి అనుసరించిన ప్రాసెస్, రికవరీ చర్యలను అడగనున్నట్లు తెలుస్తోంది. కాగా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇటీవల అనిల్ అంబానీుకి నోటీసులు ఇవ్వగా తాజాగా మరో ఆరుగురికి కూడా నోటీసులు కూడా ఇచ్చింది. గత వారం రూ.3,000 కోట్ల మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. -
గొర్రెల స్కామ్ రూ.1,000 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకంలో రూ.వెయ్యి కోట్లకుపైనే గోల్మాల్ జరిగినట్టు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. మొత్తం 200లకు పైగా మ్యూల్, డమ్మీ బ్యాంక్ అకౌంట్లతో ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, బ్రోకర్లు కలిసి సర్కార్ ఖజానాకు గండి కొట్టినట్టు ఈడీ వెల్లడించింది. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం ఎనిమిది ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పలు కీలక ఆధారాలు లభించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. నాటి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్, కొందరు వినియోగదా రులు, మరో మధ్యవర్తి ఇంట్లో ఈ సోదాలు చేసినట్టు పేర్కొన్నారు. సోదాల్లో భాగంగా 200 డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్ బుక్స్, డెబిట్ కార్డులు, 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను స్వాధీనంచేసు కున్నట్టు తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌కు జరి గిన లావాదేవీల లింకులను కూడా ఈడీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీ పథ కంలో కొల్లగొట్టిన కోట్ల రూపాయలను దారి మళ్లించేందుకు బెట్టింగ్ యాప్స్‌ను ఉప యోగించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. రూ.2.1 కోట్లతో మొదలై.. రూ.వందల కోట్లకుగొర్రెల పెంపకం, అభివృద్ధి పథకం (షీప్ రియరింగ్ డెవలప్మెంట్ స్కీం–ఎస్ఆర్డీఎస్) కేసు ఆది నుంచి కీలక మలుపులు తిరుగుతోంది. తమ వద్ద కొనుగోలు చేసిన గొర్రెల యూనిట్లకు సంబంధించి రూ.2.1 కోట్ల డబ్బు తమకు ఇవ్వకుండా పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు అక్రమంగా ఇతర అకౌంట్లకు మళ్లించారని కొందరు గొర్రెల విక్రేతలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న జి.కల్యాణ్‌కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోని కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. ఈ రెండు కేసుల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు. కల్యాణ్‌కుమార్ సహా ఫిష్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రాంచందర్‌నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, బ్రోకర్లు సహా మొత్తం17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్–2002) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో తొలుత రూ.2.1 కోట్ల మేర అవినీతి బహిర్గతమైంది. ఆ తర్వాత కాగ్ ఇచ్చిన నివేదికతో రూ.253.93 కోట్లకు ఈ కుంభకోణం చేరింది. తాజాగా ఈడీ అధికారుల సోదాల్లో లభించిన ఆధారాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో కలిపి మొత్తం రూ.వెయ్యికోట్లకుపైనే అవినీతి జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. గొర్రెల పంపిణీ చేయకుండానే..నిధులు పంచుకుతిన్నారు గొర్రెల పంపిణీ పథకంలో ‘నీకిది నాకది’(కిక్‌బ్యాక్) తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగ్లు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలను గుర్తించింది. గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారుల్లో చాలామంది ఈ పథకం ప్రారంభానికి ముందు గొర్రెల వ్యాపారంలో లేరని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఎటువంటి కొనుగోలు, అమ్మకాలు జరగలేదని గుర్తించారు. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు, నకిలీ వాహనాలు, లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధులను నకిలీ సరఫరాదారుల ఖాతాల్లోకి మళ్లించారని తేల్చారు. నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు, గొర్రెలను మళ్లీమళ్లీ చూపించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టి భారీ అక్రమాలకు తెర తీసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా వాహనాల బిల్లు, చెల్లింపుల రికార్డులు, ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. తాజా సోదాల్లో కీలక ఆధారాలు కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని జి.కల్యాణ్‌కుమార్ ఇంటితోపాటు రాంచందర్‌నాయక్, రవికుమార్, కేశవసాయి, శ్రీనివాస్‌రావు, లోలోనా ది లైవ్ కాంట్రాక్ట్ సంస్థ యజమానులు మొయిద్దీన్, ఇక్రముద్దీన్ ఇళ్లు, ఆఫీసులు సహా మొత్తం 8 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన కల్యాణ్‌కుమార్ ఇంట్లో పలు కీలక ఆధారాలు ఈడీ అధికారులు గుర్తించారు. డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధ, గురువారాల్లో కల్యాణ్కుమార్తోపాటు మరో ఇద్దరిని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు.. వారిని వేర్వేరుగా విచారించారు. కల్యాణ్‌కుమార్ అరెస్టుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించినట్టు తెలిసింది. బెట్టింగ్‌యాప్ వ్యవహారంతో కొత్త మలుపు ఇప్పటి వరకు గొర్రెల కొనుగోళ్లలో అక్రమాలు..గొర్రెల పంపిణీ పేరిట లబ్ధిదారులకు చేరకుండానే నిధుల మళ్లింపునకు పరిమితమైన ఈ కుంభకోణంలో ఈడీ తాజా తనిఖీలతో బెట్టింగ్‌యాప్‌ల లింక్ బయటపడింది. గొర్రెల కొనుగోలు కుంభకోణం నిధుల మళ్లింపునకు వాడిన డమ్మీ, మ్యూల్ అకౌంట్లకు చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్, పాస్‌బుక్స్, డెబిట్ కార్డులు ఓ ఆన్లైన్ బెట్టింగ్‌యాప్‌తో లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలు డబ్బును విదేశాలకు చేర్చేందుకు లేదంటే దారి మళ్లించేందుకు ఈ బెట్టింగ్ యాప్స్‌ను వాడుకున్నారా? అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
‘దేశం నుంచి పారిపోకుండా’.. అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు
సాక్షి,న్యూఢిల్లీ: బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రూ.3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం (ఆగస్ట్1న) సర్క్యులర్ జారీ చేసింది.లుకౌట్ నోటీసులు కంటే ముందు బ్యాంకు రుణాల ఎగవేత కేసులో అనిల్ అంబానీకి ఈడీ సమన్లు పంపింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. విమానాశ్రయాలు, ఓడరేవులు సహా అన్ని ఎంట్రీ,ఎగ్జిట్ పాయింట్లకు దీనిని పంపిస్తుంది. దేశం విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అలాంటి నోటీసులు జారీ చేయబడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఈడీ అధికారులు అప్రమత్తం చేస్తారు. రూ.3,000 కోట్ల రుణాలను 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. ఎస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది. -
Sheep Scam: గొర్రెల కుంభకోణంపై ఈడీ సంచలన ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది. ‘గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. మాజీ ఓఎస్డీ కల్యాణ్ ఇంట్లో సోదాలు చేశాం.200లకుపైగా బ్యాంక్ పాస్‌బుక్‌లు సీజ్ చేశాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌లోనూ ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించారు. 31సెల్ఫోన్లు, 20 సిమ్‌కార్డులు సీజ్ చేశాం. ఏడు జిల్లాల్లో రూ.253.93కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదికలో ఉంది. 33 జిల్లాల్లో రూ.వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగాయి. లబ్ధిదారులకు వెళ్లాల్సిన నిధులను ప్రైవేట్ వ్యక్తులు తమ సొంతఖాతాల్లోకి మళ్లించారు’అని తెలిపింది. -
అనిల్ అంబానీకి ఈడీ షాక్
-
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రిలయన్స్ కమ్యునికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్‌ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్ గ్రూప్ కంపెనీలపై దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీ, ముంబైల్లో మూడు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు సహా 50 ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మరో 25 మంది కీలక హోదాల్లో ఉన్నవారిని ప్రశ్నించారు. అంతకుముందు అనిల్ అంబానీ కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!‘ఫ్రాడ్’గా వర్గీకరణరిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు కంపెనీలు జులై 26న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈమేరకు దాడులకు సంబంధించిన విషయాలను ధ్రువీకరించాయి. ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు, ఉద్యోగులు లేదా మరే ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని తెలిపాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) సహా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను ఈడీతో పంచుకున్నాయి. అనిల్ అంబానీ, అంబానీల గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)ను ‘ఫ్రాడ్’గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించింది. -
తెలియక చేశా.. నేను డబ్బు తీసుకోలేదు: ప్రకాశ్ రాజ్
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విచారణ ముగిసింది. దాదాపు ఐదు గంటల పాటు ఈయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగానూ ప్రకాశ్ రాజ్‌తో పాటు మొత్తం 29 మందికి ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన ఇతడు.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ కి ప్రకాశ్ రాజ్ కౌంటర్)'చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈడీ విచారణకు హాజరయ్యాను. దయచేసి బెట్టింగ్ యాప్‌లలో ఆడకండి. కష్టపడి సంపాదించుకోండి. ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ తెలియక ప్రమోట్ చేశాను. అందులో నేను డబ్బులు తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను' అని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. ఇదే కేసులో రానా, మంచు లక్ష్మీ సహా చాలామంది యూట్యూబర్స్ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: నాగార్జున నన్ను 14 సార్లు కొట్టారు: స్టార్ హీరోయిన్) -
ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్
-
ఈడీ విచారణకు హాజరైన సినీ నటుడు ప్రకాష్‌రాజ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేస్‌లో ఈడీ అధికారుల విచారణకు సినీ నటుడు ప్రకాష్‌రాజ్ హజరయ్యారు. ఈ యాప్స్ ప్రమోషన్స్‌లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానించారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు నటుడు ప్రకాష్‌రాజ్ వెళ్లారు. -
ఈడీ దూకుడు.. గొర్రెల స్కాంలో పలు చోట్ల సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గొర్రెల పంపిణీ, పెంపకం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పని చేసిన జి కళ్యాణ్‌ను ఈడీ ఆఫీస్‌కు తీసుకొచ్చి అధికారులు విచారిస్తున్నారు. సోమవారం ఉదయం నగరంలో ఈడీ సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. పశుసంవర్థకశాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ నివాసంతో పాటు మరో తొమ్మిది చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఈక్రముద్దీన్ నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. గొర్రెల పెంపకం, పంపిణీ పేరుతో తెలంగాణలో భారీ స్కాం జరిగినట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గుర్తించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరు మీద సుమారు రూ.750 కోట్ల గోల్మాల్ జరిగినట్లు నిర్ధారించుకుంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్) నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. -
అనిల్ అంబానీ ఇంట్లో ఈడీ సోదాలు
-
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన కొద్ది రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ముంబైలోని కంపెనీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అంబానీ వ్యక్తిగత నివాసం లేనప్పటికీ ఢిల్లీ, ముంబైలోని ఈడీ బృందాలు ఆయన గ్రూప్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ నిర్వహించాయి. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఇప్పటికే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి అందిన సమాచారం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది. విస్తృత దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను కూడా విచారిస్తున్నారు. ప్రజాధనాన్ని దారి మళ్లించారనేలా ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలతో సహా అనేక సంస్థలను తప్పుదారి పట్టించి ఉండవచ్చని ఈడీ అభిప్రాయపడింది.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సుఫ్రాడ్గా వర్గీకరణరిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్ అనిల్ అంబానీని ‘మోసపూరితం(ఫ్రాడ్)’గా ఎస్బీఐ జూన్ 13న గుర్తించినట్టు ఇటీవల లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పకంజ్ చౌదరి తెలిపారు. జూన్ 24న ఆర్బీఐకి ఫ్రాడ్ వర్గీకరణ గురించి ఎస్బీఐ నివేదించిందని.. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్రాడ్‌గా గుర్తించిన విషయాన్ని ఆర్‌కామ్ బీఎస్ఈకి జూలై 1న వెల్లడించడం గమనార్హం. ఆర్‌కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఈ నిధులను వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ ఆర్‌కామ్‌కు తెలియజేయడం గమనార్హం. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు ఎస్బీఐ భారీగానే అప్పులు ఇచ్చింది. ఇందులో ఆగస్టు 26, 2016 నుంచి చెల్లించాల్సిన వడ్డీ, ఖర్చులతో కలిపి రూ.2,227.64 కోట్ల అసలు ఉంది. రూ.786.52 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీల ద్వారా నాన్ ఫండ్ బేస్డ్ రుణాలు కూడా ఉన్నాయి. -
హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు
-
నటుడు 'విజయ్ దేవరకొండ'కు మరోసారి ఈడీ నోటీసులు
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ఇప్పటికే ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండకు విచారణకు హాజరుకావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ముందుగా ఆగష్టు 6న రావాలని పేర్కొంది. అయితే, ఇప్పుడు జారీ చేసిన నోటీసులలో ఆగష్టు 11న హాజరుకావాలని సూచించింది. విజయ్ దేవరకొండ సూచన మేరకే తేదీని మార్చినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్‌ను జులై 30న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. -
మింత్రాపై ఈడీ ఫెమా కేసు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–కామర్స్ సంస్థ మింత్రాపై విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదైంది. రూ. 1,654 కోట్ల పెట్టుబడుల విషయంలో మింత్రాతో పాటు, దానితో సంబంధమున్న కంపెనీలు, డైరెక్టర్లపై తమ బెంగళూరు జోనల్ ఆఫీసు ఫిర్యాదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ పేరిట విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరించిన మింత్రా, దాని అనుబంధ కంపెనీలు మలీ్ట–బ్రాండ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. కంపెనీ సింహ భాగం ఉత్పత్తులను వెక్టార్ ఈ–కామర్స్ సంస్థకు విక్రయిస్తోండగా, సదరు కంపెనీ అంతిమంగా కస్టమర్లకు రిటైల్‌గా విక్రయిస్తోందని ఈడీ వివరించింది. ఈ రెండు సంస్థలూ ఒకే గ్రూప్‌లో భాగమని తెలిపింది. మరోవైపు, చట్టాలను తాము గౌరవిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని మింత్రా ప్రతినిధి తెలిపారు. డిజిటల్ కామర్స్ ద్వారా దుస్తుల పరిశ్రమకు సాధికారత కలి్పంచడం ద్వారా దేశ నిర్మాణానికి కంపెనీ తన వంతు తోడ్పాటు అందిస్తోందన్నారు. ప్రస్తు నిబంధనల ప్రకారం మార్కెట్‌ప్లేస్ విధానంలో కార్యకలాపాలు సాగించే కంపెనీల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులున్నాయి. 2007లో ఏర్పాటైన మింత్రా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో భాగంగా ఉంది. -
సినీ నటుడు రానాకు ఈడీ మళ్లీ సమన్లు
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో రానా(Rana Daggubati)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 11న విచారణకు హాజరు కావాలని మసన్లలో పేర్కొంది. వాస్తవానికి నేడు(జులై 23) రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. కానీ ఆయన గడువు పొడిగించాలని ఈడీకి విజ్ఞప్తి చేశాడు. దీంతో తాజాగా మరో తేదిని ఖరారు చేస్తూ సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 11న కచ్చితంగా హాజరు కావాలంటూ సమన్లలో పేర్కొంది.సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది. -
సినీ తారలకు ఈడీ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తేదీల వారీగా సినీతారలకు విచారణకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మిలకు వేర్వేరుగా సోమవారం సమన్లు జారీ చేసింది. బుధవారం రానా దగ్గుబాటి, ఈ నెల 30న ప్రకాశ్‌రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, 13న మంచు లక్ష్మిలను విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేయడంలో వారి పాత్ర..ఇందుకు సంబంధించి ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు..తీసుకున్న పారితోషకాల వివరాలు, అందుకు సంబంధించి బ్యాంకు లావాదేవీలు, ఇతర డాక్యుమెంట్లను తీసుకుని హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరుకావాలని సూచించారు. సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్‌లో చేర్చింది. -
రాజకీయ యుద్ధాల్లో.. మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు?
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ భూకేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఇలాంటి విపరీత పోకడ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయకండి. ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశ మంతటా అమలు చేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. – సుప్రీంకోర్టుసాక్షి బెంగళూరు: కర్ణాటకలో మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూకేటాయింపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ని దురుద్దేశపూర్వకంగా రంగంలోకి దించారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థి పార్టీలపై కక్ష సాధింపు కోసం ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్నవేసింది. ముడా భూకేటాయింపుల కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి వ్యతిరేకంగా ఈడీ గతంలో జారీచేసిన సమన్లు కొట్టేస్తూ కర్ణాటక హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సమర్థించింది.హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ ఈడీ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘ఈ విషయంలో మేం నోరువిప్పితే బాగోదు. అచ్చం ఇలాగే మహారాష్ట్రలో జరిగిన ఉదంతం మొత్తం మాకు తెలుసు. రాజకీయ యుద్ధాల్లో ఈడీని ఎందుకు ఉపయోగిస్తున్నారు?. ఇలాంటి విపరీత పోకడ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తిచేయకండి.ఈడీని ఉసిగొల్పే వికృత క్రీడను దేశమంతటా అమలుచేయకండి. ఎన్నికల వేదికలపై మాత్రమే రాజకీయ యుద్ధాలు చేసుకోండి. ఈ యుద్ధాల్లోకి ఈడీని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? మీరు ఇదే ధోరణి కొనసాగిస్తే మేం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేసుల విషయంలో ఈడీ అధికారులు అన్ని పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.స్వాగతించిన కాంగ్రెస్.. విమర్శించిన బీజేపీఈడీ వైఖరిని ఎండగడుతూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఈడీ–బీజేపీ సమష్టిగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సుప్రీంకోర్టు బట్టబయలుచేసిందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. కోర్టు తీర్పు కేంద్రప్రభుత్వానికి చెంపదెబ్బలా తగిలిందని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.ఈడీని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు ఈ తీర్పు మేలుకొలుపు అని ఆయన అన్నారు. ముడా కేసులో తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టంచేసింది. ‘‘ భూమికి బదులు ప్లాట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరగకపోతే వాటిని సీఎం కుటుంబం ఎందుకు మళ్లీ వెనక్కి ఇచ్చేసింది?. వాటిని వాళ్ల వద్దే ఉంచుకోవచ్చుగదా. ఈ అంశంలో మా పోరాటం కొనసాగుతుంది’’అని కర్ణాటక అసెంబ్లీలో విపక్షనేత, బీజేపీ నాయకుడు ఆర్.అశోక్ సోమవారం బెంగళూరులో అన్నారు.ఏమిటీ ముడా కేసు?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది.అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
బెట్టింగ్ యాప్ కేసు: సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)ని జూలై 23న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ప్రకాశ్ రాజ్‌ను జూలై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలంటూ నోటీసులు పంపించింది.సెలబ్రిటీలపై కేసుకాగా ఈ బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటివరకు దాదాపు 25 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. వీరిలో ప్రకాశ్ రాజా, రానా, మంచు లక్ష్మితో పాటు ప్రణీత, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, అనన్య నాగళ్ల తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌కు వీరు భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణలో.. ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది.చదవండి: యాక్సిడెంట్.. పక్షవాతం రావొచ్చన్నారు, అప్పుడు తమన్..: సింగర్ -
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్ జస్టిస్ గవాయ్ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర జనరల్ ఎస్వీ రాజు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్‌ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ తోపాటు మరికొన్ని లీగల్ బాడీస్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్‌గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్‌ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్‌ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు. -
బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాకు ఈడీ సమన్లు
బెట్టింగ్ యాప్‌ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తోంది. మొన్నీమధ్యే 29 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టెక్ దిగ్గజ కంపెనీలు గూగుల్, మెటాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గూగుల్, మెటా కంపెనీలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేస్తున్నాయన్నది ఈడీ అభియోగం. సదరు యాప్‌లు మనీలాండరింగ్, హవాలా లావాదేవీలలాంటి తీవ్రమైన ఆర్థిక నేరాలపై దర్యాప్తు ఎదుర్కొంటున్నాయి. అయితే అలాంటి యాప్‌లకు తమ పేజీల్లో స్లాట్లు కేటాయిస్తూ విపరీతంగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నాయని ఈడీ అంటోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన విచారణకు రావాంటూ గూగుల్, మెటాలకు ఈడీ స్పష్టం చేసింది. ఈ పరిణామంపై ఆయా సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కాంగ్రెస్‌కు షాక్.. లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కుమారుడు అరెస్ట్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ సీఎం కుమారుడు చైతన్య బఘేల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో, ఆయన అరెస్ట్ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ.. రూ.2,160 కోట్లు మద్యం కుంభకోణం నుండి వచ్చిన ఆదాయాన్ని చైతన్య బాఘేల్ గ్రహీతగా ఉన్నారని ఆరోపించింది. 2019-2023 మధ్య భూపేశ్ బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ.. శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ ఉదయం దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు.కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు లభించడంతో మాజీ సీఎం నివాసంలో సోదాలు చేపట్టారు. అయితే, ఈ సమయంలో చైతన్య బఘేల్ అధికారులకు సహకరించకపోవడంతో ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం నుంచి బఘేల్ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బంది మోహరించారు. పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకుని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | Bhilai, Chhattisgarh: Congress workers clash with police personnel and try to stop ED vehicles after Chaitanya Baghel, son of former CM Bhupesh Baghel, was taken into custody by the Enforcement Directorate.The Enforcement Directorate (ED) conducted fresh searches at the… pic.twitter.com/beb7Eq7Pnq— Press Trust of India (@PTI_News) July 18, 2025అయితే, ఈరోజు చైతన్య బఘేట్ పుట్టినరోజు కావడం విశేషం. పుట్టినరోజే ఆయనను ఇలా అరెస్ట్ చేయడం కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో తన కుమారుడి అరెస్ట్ఫై మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్పందిస్తూ.. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదని వ్యాఖ్యలు చేశారు. తాము ఏ తప్పు చేయలేదని వెల్లడించారు. మరోవైపు.. చైతన్య బఘేల్ అరెస్ట్ సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈడీ అధికారులను.. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. #WATCH | Former Chhattisgarh Chief Minister Bhupesh Baghel's son, Chaitnya Baghel (in yellow t-shirt), arrested by Enforcement Directorate, in connection with the ongoing investigation into alleged multi-crore liquor scam in the state, say officials.Visuals from Durg,… pic.twitter.com/bRPTxqfu0b— ANI (@ANI) July 18, 2025 -
ఆప్‌పై ఈడీ ఉక్కుపాదం.. వెలుగులోకి మరో మూడు భారీ కుంభకోణాలు
ఢిల్లీ: అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన ఆమ్ ఆద్మీని, ఆ పార్టీ నేతల్ని ఇప్పుడే అదే అవినీతి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆప్ నేతలపై మూడు మనీ లాండరింగ్ కేసుల్ని నమోదు చేశారు. అధికారంలో ఉండగా మూడు కుంభకోణాల్లో సదరు నేతలు పాలు పంచుకున్నారని ఈడీ తెలిపింది. ఆప్ నేతలపై ఈడీ నమోదు చేసిన మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్)కు జత చేసిన ఎఫ్ఐఆర్లు కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో సీసీటీవీ ఫుటేజీల ఏర్పాటు,ఆస్పత్రుల నిర్మాణాలు,అభాగ్యులు ఉండేందు ఆసరా కల్పించే ప్రత్యేక షెల్టర్ హోమ్ పేరుతో సుమారు రూ.6,368 కోట్ల విలువ చేసే కుంబకోణం జరిగింది.ఈ స్కామ్‌లో ఆప్ సీనియర్ నేతలతో పాటు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ బరద్వాజ్,సత్యేంద్ర జైన్ వంటి నేతల ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తుంది. విచారణకు హాజరు కావాలంటూ త్వరలోనే వీరికి ఈడీ సమన్లు జారీ చేయనుంది.ఈడీ లెక్కల ప్రకారం.. 2018-19 అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో ఆరు నెలల్లో 24 ఐసీయూ కూడిన ఆస్పత్రులు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికీ యాభైశాతం పనులు పూర్తయినప్పటికీ ఇందుకోసం సుమారు రూ.800 కోట్లు నిధుల్ని విడుదల చేసింది. అయితే, వీటిల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న లోక్ నాయక్ ఆస్పత్రితో పాటు ఇతర పలు ఆస్పత్రుల నిర్మాణానికి అయ్యే ఖర్చు రూ.488 కోట్ల నుంచి రూ.1135 కోట్లకు పెరిగింది. వీటి నిర్మాణానికి కేటాయించే నిధుల విషయంలో సరైన అనుమతులు లేవని ఈడీ ఆరోపిస్తోంది.సీసీటీవీ స్కామ్(రూ.571కోట్లు) 2019లోనే కేజ్రీవాల్ ప్రభుత్వం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.4లక్షల సీసీటీవీ కెమెరాలను అమర్చే ప్రాజెక్ట్‌ను ప్రతీష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్)కు అప్పగించింది. ఈ ప్రాజెక్ట్ విలువ సుమారు రూ.571 కోట్లు. ఒప్పందం ప్రకారం అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో ఆప్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్కు రూ.17కోట్లు ఫైన్ వేసింది. కొంతకాలానికి ఎలాంటి వివరణ లేకుండా ఫైన్‌ను రద్దు చేసింది. ఇందుకోసం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ కార్యకాలాపాలు నిర్వహించిన సత్యేంద్ర జైన్ రూ.7కోట్లు లంచతీసుకున్నారని ఏసీబీ ఆరోపించింది. సత్యంద్ర జైన్ మీద కేసు కూడా నమోదు చేసింది.ఢిల్లీ అర్బన్ షెల్టర్ బోర్డు 'స్కామ్' (రూ.207 కోట్లు)ఆప్ హయాంలో ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ (DUSIB)లో కూడా అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. నకిలీ ఎఫ్‌డీఆర్‌లు (ఫిక్స్డ్ డిపాజిట్ రసీదులు) ఉపయోగించి రూ.207 కోట్లు దుర్వినియోగం చేశారని, పటేల్ నగర్లో రూ. 15 లక్షల రోడ్డు కుంభకోణం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి లాక్డౌన్ సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించి రూ. 250 కోట్ల విలువైన పనిని చేసినట్లు చూపించినట్లు ఈడీ గుర్తించింది. నకిలీ కార్మికులకు జీతాలు చెల్లించారని, రాజకీయ నాయకులకు కమీషన్లు ఇచ్చారని కూడా ఆరోపించబడింది.ఈ విషయాలపై సీబీఐ,ఏసీబీలు దర్యాప్తు చేస్తున్నాయి. -
వాద్రాపై ఈడీ చార్జిషీట్
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగ పత్రాన్ని కోర్టులో సమరి్పంచింది. 2008లో గుర్గావ్లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్‌లో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ చార్జ్‌షీటులో ఈడీ పేర్కొంది. ఆ భూమిని స్కై లైట్ హాస్పిటాలిటీ అనే కంపెనీ ఓంకారేశ్వర్ ప్రాపరీ్టస్ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. చెల్లింపు చెక్కులను మరో కంపెనీకి స్కై లైట్ రియాలిటీ జారీ చేసింది. ఈ రెండు సంస్థలకు వాద్రా యజమానిగా ఉన్నాయి. ఇక సేల్ డీడ్సమయంలో ఈ కంపెనీ వద్ద కేవలం రూ.1 లక్ష నగదు ఉంటే రూ.7.5 కోట్ల పెట్టి భూమిని కొనుగోలు చేయగల్గిందని ఈడీ చార్జ్‌షీటులో ప్రస్తావించింది.మరుసటి రోజే ఆ భూమిని స్కైలైట్ హాస్పిటాలిటీ పేరిట మార్చేశారు. 24 గంటల్లోపే భూమి టైటిల్‌ను వాద్రా కంపెనీకి మార్చారు. ఈ ప్రక్రియకు సాధారణంగా కనీసం మూడు నెలలు పడుతుంది. ఒక నెల తర్వాత హరియాణాలో హుడా ప్రభుత్వం స్కైలైట్ హాస్పిటాలిటీకి దాదాపు 2.71 ఎరాల భూమిలో గృహనిర్మాణ ప్రాజెక్టు అభివృద్ధికి అనుమతులు వచ్చాయి. ఫలితంగా భూమి విలువ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. 2008లో రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆ ప్లాట్‌ను రూ.58 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఆ భూమి విలువ ఒకేసారి 700 శాతం పెరిగింది. డీఎల్ఎఫ్ రెండు మూడు దఫాలుగా వాద్రాకు నగుదు చెల్లింపులు జరిపింది. 2012లో ఈ భూమి వ్యవహారాన్ని బయటకు తెచ్చిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అశోక్ ఖేమ్కాను అప్పటి ముఖ్యమంత్రి హుడా ఆదేశాల మేరకు వెంటనే బదిలీ చేయడానికి ప్రయత్నించి తరువాత రద్దు చేశారు. భూమి వ్యవహారంపై సమగ్రస్థాయిలో విచారణ జరిపిన ఖేమా ఆ భూమి మ్యూటేషన్‌ను రద్దు చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లతో ప్యానెల్ ఏర్పాటైంది. 2013లో హుడా ప్రభుత్వం వాద్రాకు, డీఎల్ఎఫ్కు క్లీన్ చిట్ ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవహారంపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. భూ ఒప్పందాల్లో హుడా, వాద్రాలు అక్రమాలకు పాల్పడినట్లు 2018లో ఆరోపణలు వచ్చాయి. అందులో ఈ 3.5 ఎకరాల భూమి కూడా ఉంది. తప్పుడు డిక్లరేషన్ ఆధారంగా భూమిని కొనుగోలు చేశారని ఆరోపిస్తూ గుర్గావ్ పోలీసులు 2018 సెపె్టంబర్ 2న ఎఫ్ఐఆర్ నేమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. -
బెట్టింగ్ యాప్ వివాదంలో 29 మంది టాలీవుడ్ సెలెబ్రెటీలకు బిగ్ షాక్
-
పోంజీ స్కామ్.. ఫాల్కాన్ గ్రూఫ్ సీఈవో అరెస్ట్
బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి వేల కోట్ల పోంజీ స్కామ్‌కు పాల్పడిన సంస్థ సీఈవోని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఫాల్కన్ గ్రూప్ సీఈవో ఫాల్కన్ గ్రూప్ సీవోఓ ఆర్యన్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా పోలీసులు తెలంగాణకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఫాల్కన్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని సీఐడీ చీఫ్ చారు సిన్హా తెలిపారు. ఫాల్కన్ గ్రూప్ అసలు పేరు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం పేరిట దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించింది. తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని చెప్పి వేలకోట్లు వసూలు చేశారు. ఈ సంస్థ మోసం వెలుగులోకి రావడంతో ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్దీప్ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసి దుబాయ్ పారిపోయినట్లు సమాచారం. ఆపరేషనల్ హెడ్ సందీప్ కుమార్‌ను ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.2.5 కోట్ల విలువైన కార్లు, 14 స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.ఇతర నిందితులు పవన్, కావ్య, రవికుమార్ తదితరులు పరారీలో ఉన్నారు.పోలీసుల వివరాల మేరకు ఫాల్కన్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ .. ఎంఎన్సీ కంపెనీలలో పెట్టుబడుల పేరుతో డిపాజిట్లు స్వీకరించారు. మొత్తం 7,000 మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. వసూలు చేసిన డబ్బును 14 కంపెనీల్లో పెట్టుబడులుగా మార్చారు. కొంతమందికి రూ.850 కోట్లు తిరిగి చెల్లించినా, ఇంకా అంతే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. కేసును తెలంగాణ సీఐడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు చేస్తున్నాయి. -
ఈడీ విచారణపై అల్లు అరవింద్ క్లారిటీ
-
అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravnid)ను ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ప్రశ్నించింది. ఓ బ్యాంక్ స్కామ్ గురించి ఆయన్ను విచారించింది. 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ నుంచి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయి. అలా తీసుకున్న రుణాలను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. పైగా తీసుకున్న లోన్ కూడా కట్టలేదట! ఈ రెండు సంస్థలు కొన్న ఆస్తుల్లో, చేసిన లావాదేవీల్లో అల్లు అర్జున్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అరవింద్‌ను శుక్రవారం (జూలై 4న) విచారణకు పిలిచారు. రామకృష్ణ కంపెనీలు చేసిన బ్యాంక్ స్కామ్‌లో నిర్మాతకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో అధికారులు విచారణ జరిపారు. 2018- 19 మధ్యకాలంలో నిర్మాత జరిపిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తి కొనుగోళ్ల గురించి ఆరా తీశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ విచారణ కొనసాగింది. మళ్లీ వచ్చే వారం విచారణకు హాజరవ్వాలని ఈడీ అధికారులు.. అల్లు అరవింద్‌ను కోరారు.చదవండి: తమ్ముడు మూవీ రివ్యూ -
రూ.2,000 కోట్లు దోచేసే కుట్ర
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులు దోచుకొనే కుట్ర జరిగిందని ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలియజేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చట్టవిరుద్ధంగా సొంతం చేసుకొనేందుకు ప్రయ త్నించారని వెల్లడించింది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో బుధవారం ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా, రాహల్‌కు 76 శాతం వాటాలున్నట్టు ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ‘‘ఆ సంస్థ ద్వారా ఏజేఎల్‌కు కేవలం రూ.90 కోట్ల రుణమిచ్చి దాన్ని తీర్చడం లేదన్న సాకుతో ఏజేఎల్‌కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేయడానికి కుట్ర చేశారు. యంగ్ ఇండియా స్థాపనే దురుద్దేశపూరితం’’ అన్నారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. -
‘భూదాన్’ స్వాహాకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూదాన్ భూముల స్వాహాకు అక్రమార్కులు కుట్రపన్నారు.. ఫోర్జరీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు.. తద్వారా డీ నోటీఫై చేసిన భూదాన్, గైరాన్ (ప్రభుత్వ) భూములను విక్రయించారు.. దీనికి సబ్ రిజిస్ట్రార్ నుంచి కలెక్టర్ వరకు అంతా సహకరించారు.. డాక్యుమెంట్లు, కోర్టు ఉత్తర్వులను కనీస పరిశీలన చేయకుండానే డీనోటీఫైకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.. ఆ వెంటనే అక్రమార్కులు భూములను విక్రయించేశారు.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182లోని సర్కార్ భూముల స్వాహాపై విచారణ సందర్భంగా ఈమేరకు బహిర్గతమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.న్యాయస్థానం ఆదేశిస్తే పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని చెప్పింది. సర్వే నం. 181, 194, 195లో భారీ భూ కబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫున అసిస్టెంట్ డైరెక్టర్ గజ్రాజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఈడీ కౌంటర్లోని ముఖ్యాంశాలివీ...ఖదీరుసా సహా పలువురిపై కేసు‘సర్వే నం. 181, 194, 195లోని భూమికి సంబంధించి మోసపూరిత కార్యకలాపాలపై పిటిషనర్ మహేశ్ పేర్కొన్నారు. ఇప్పటికే సర్వే నంబర్ 181, 182లోని భూముల అక్రమ విక్రయంపై కేసు నమోదైంది. ఖదీరున్సిసా, మునావర్, బొబ్బిలి విశ్వనాథ్, సంతోష్‌కుమార్, దామోదర్‌రెడ్డితో పాటు ఈఐపీఎల్ నిర్మాణ సంస్థపై దర్యాప్తు కొనసాగుతోంది. పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్ఐఆర్ నమోదు నిమిత్తం డీజీపీ కార్యాలయానికి పంపించాం. అక్కడి నుంచి మాకు ఎలాంటి బదులురాలేదు. నవాబ్ హాజీఖాన్కు 779.77 ఎకరాల భూమి ఉంది. ఇందులో 103 ఎకరాలను కుమారులకు బహుమతి (హిబ్బా)గా, ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డుకు విరాళంగా ఇచ్చారు.దీనికి అంగీకరిస్తూ నాటి తహసీల్దార్ 1995, నవంబర్ 26న ఉత్తర్వులిచ్చారు. సర్వే నం. 181లోని మిగిలిన భూమిని ప్రభుత్వం గైరాన్ భూమిగా ప్రకటించింది. కుమారులు తమ భూమిని 2005లో దస్తగిర్ షరీఫ్, ముజాఫర్ హుస్సేన్‌కు విక్రయించారు. అయితే, 2006లో సర్వే నం. 181లోని మొత్తం భూమి సర్కార్‌దిగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై దస్తగిరి హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. చట్టప్రకారం 181లోని 95 ఎకరాల్లో 50 ఎకరాలు భూదాన్‌గా, 45 ఎకరాలు గైరాన్ భూమిగా పేర్కొంటూ ఎంఆర్వో 2012లో నిషేధిత జాబితాలో చేర్చి నోటిఫై చేశారు’తప్పుడు పత్రాలతో సేల్ డీడ్లు‘తప్పుడు పత్రాలతో తన భూమిని కబ్జా చేశారంటూ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మహేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో 2023, మార్చిలో ఖదీరునిసా, మునావర్ ఖాన్, బొబ్బిలి దామోదర్‌రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్‌రెడ్డి, ఎన్.సంతోష్, కొండపల్లి శ్రీధరర్‌రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2004లో తన తండ్రి 51 ఎకరాలను హిబ్బాగా ఇచ్చారంటూ ఖదీరునిసా, ఆమె కుమారుడు మునావర్ 2014లో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు ఈడీ విచారణలో తేలింది.అక్రమంగా పొందిన పట్టా పాస్‌పుస్తకాలు, భూ విక్రయాలు కోర్టు ఆదేశాలతో రద్దయ్యాయి. మళ్లీ 2021లో ఖదీరున్నీసా.. విశ్వనాథ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌కు 40 ఎకరాలు విక్రయించారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా నాటి సబ్ రిజిస్ట్రార్ జ్యోతి, నిందితులతో కలసి కుట్రకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిగా నోటిఫై చేసిన భూములను మోసపూరితంగా బదిలీ చేసుకోవడంతోపాటు సేల్ డీడ్లు సృష్టించారు.’డీనోటిఫైలో అధికారుల పాత్ర‘హజీ అలీకి తాను ఏకైక కుమార్తెనని ఖదీరునిసా పేర్కొంది. కానీ, అప్పటికే రెవెన్యూ రికార్డుల్లో అలీఖాన్ ఇద్దరు కుమారుల పేర్లున్నాయి. తప్పు డు పత్రాలు సృష్టించేందుకు రెహమాన్, అక్తర్, షుకూర్, చంద్రయ్య, మరికొందరు సహకరించారు. నకిలీ లేఖతో నిషేధిత జాబితాలోని భూ మిని డీ–నోటిఫై చేయించారు. డీనోటిఫైకి భూదాన్ యజ్ఞ బోర్డుతోపాటు కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్‌కు భాగస్వామ్యం ఉంది. అబ్దుల్ షుకూర్ బంధువులు 1992లో నవాబ్ హాజీ అలీఖాన్ నుంచి సర్వే నం. 194లోని భూమిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.నకిలీ పత్రాలతో భూ కబ్జా చేసినందుకు షుకూర్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. 1992లో కొనుగోలు చేసినట్లు చూపిస్తున్న డాక్యు మెంట్లపైనా అనుమానాలున్నాయి. ఎందుకంటే.. 1992 కంటే ముందే హాజీఖాన్ భూ మంతా విక్రయించారు. నకిలీ పత్రాల వాడకం, రెవెన్యూ రికార్డులను తారు మారు చేయడం లాంటి వాటితో విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అధికారుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు మా దృష్టికి వచ్చిన వ్యక్తులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై మరికొన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.’ -
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట
హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లను తిరిగి చెల్లిస్తోంది ఈడీ. కర్నాటక, తెలంగాణ, ఏపీ, ఒడిశాలలో అగ్రిగోల్డ్ బాదితులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది మోసపోయినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్ లో ఇప్పటికే 33 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ.. వారి ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు డిపాజిట్లు చెల్లిస్తోందిగత ఏడాది నవంంబర్‌లో ఈడీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్ చేసినట్లు కోర్టు గుర్తించింది. దీనిలో భాగంగా రూ. 4,141 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో ఉన్న ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేశారు. -
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: కర్ణాటకలో సంచలనం రేకెత్తించిన మహర్షి కర్ణాటక వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి (కేఎం వీఎస్టీడీసీ)లో కోట్ల రూపాయల కుంభకోణంలో కేంద్ర ఈడీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే ఉమ్మడి బళ్లారి జిల్లాలో, బెంగళూరులో పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపారు. బళ్లారి జిల్లా ఎంపీ తుకారాం, కంప్లి ఎమ్మెల్యే గణేశ్, కూడ్లిగి ఎమ్మెల్యే ఎన్టీ శ్రీనివాస్, బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర పీఏ గోవర్ధన్ ఇళ్లు, బెంగళూరులోని ఆఫీసుల్లో సోదాలు చేశారు. వారి సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అక్రమ నగదు బదిలీ నియంత్రణ చట్టం కింద చేపట్టిన ఈ తనిఖీలు కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపాయి. వాల్మీకి అభివృద్ధి మండలి స్కాం గతేడాది ఫిబ్రవరిలో బయటకు వచ్చింది. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడాలని ఒత్తిళ్లు వస్తున్నాయని లేఖ రాసి మండలి ఉద్యోగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలి ఖాతాల నుంచి ఓ మంత్రి రూ.94 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేసి తెలంగాణ శాసన సభ ఎన్నికలు, బళ్లారి లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు. తరువాత ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. మండలి మేనేజింగ్ డైరెక్టర్‌ను, కొందరు ఉన్నతాధికారులను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఈడీ తాజాగా దాడులు ప్రారంభించింది. మళ్లించిన నిధుల నుంచి కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌కు రూ.3 కోట్లు, ఎంపీ తుకారాంకు రూ.10 కోట్లు, ఎన్టీ శ్రీనివాస్‌కు కూడా కొంత నగదు చేరినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. -
మీ బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగింది
సాక్షి, హైదరాబాద్: బెంగళూరుకు చెందిన వృద్ధ దంపతులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పేరుతో ‘డిజిటల్ అరెస్టు’చేసిన సైబర్ నేరగాళ్లు రూ.4.79 కోట్లు స్వాహా చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన అక్కడి సైబర్ ఎకనమిక్ అండ్ నార్కోటిక్స్ (సీఈఎన్) పోలీసులు, ఈ నేరంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడకు వచ్చిన ప్రత్యేక బృందం బుధవారం వారిని అరెస్టు చేసి తీసుకువెళ్లింది. బెంగళూరుకు చెందిన మంజునాథ్‌కు గత మార్చిలో బ్యాంకు ప్రతినిధుల పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మంజునాథ్ పేరు, ఆధార్ నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాతో మనీ లాండరింగ్ జరిగినట్లు అవతలి వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేసినట్లు చెప్పాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఈడీ అధికారి అవతారం ఎత్తిన మరో సైబర్ నేరగాడు మంజునాథ్‌ను ఫోన్ చేశాడు. సదరు మనీలాండరింగ్ వ్యవçహారాన్ని తమతో పాటు సీబీఐ అధికారులూ దర్యాప్తు చేస్తు న్నట్లు చెప్పాడు. ఆ బ్యాంకు ఖాతా, నేరంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంజునాథ్ లబోదిబోమన్నాడు. ఆ కేసులో నిందితు లను ఇప్పటికే అరెస్టు చేశామని.. మీరు అనుమాని తులు కావడంతో మీతో పాటు మీ భార్యను డిజి టల్ అరెస్టు చేస్తున్నామని నేరగాడు చెప్పా డు. నిర్దోషిత్వం నిరూపించుకోవడం కోసం తమ అధికా రిక ఖాతాల్లోకి నిర్ణీత మొత్తం బదిలీ చేయా ల్సి ఉంటుందని చెప్పాడు. వెరిఫికేషన్ పక్రియ పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తా మని నమ్మించారు. ఇలా మంజునాథ్, ఆయన భార్య నుంచి రెండున్నర నెలల్లో రూ.4.97 కోట్లు స్వాహా చేశారు. కొన్ని రోజులు ఎదురు చూసినా తన నగదు తిరిగి రాకపోవడంతో పాటు నేర గాళ్లు వాడిన ఫోన్లు పని చేయకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి, బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ సీఈఎన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఆ నగదులో కొంత హైదరాబాద్‌కు చెందిన నారాయణ్ సింగ్ చౌదరి, ఈశ్వర్ సింగ్ పేర్లతో ఉన్న ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. వీరు తరచూ శ్రీలంక వెళ్లి కొలంబోలోని క్యాసినోల్లో జల్సాలు చేస్తున్నట్లు తేల్చారు. కిరాణా దుకాణాలు నిర్వహిస్తున్న వీరు.. తమ పేర్లతో తెరిచిన కరెంట్ ఖాతాలను సూత్రధారులకు ఇచ్చి సహకరిస్తున్నట్లు దర్యాప్తు అ«ధికారులు చెప్తున్నారు. -
సీబీఐ వలలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ
ఒడిశా: లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ సీబీఐ వలకు చిక్కారు. రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసుకు సంబంధించి.. భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.ఏడాదిన్నరగా రఘువంశీ భువనేశ్వర్ జోనల్ కార్యాలయంలో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రఘువంశీని అరెస్ట్ చేసిన అధికారులు.. భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నారు. ధెంకనల్‌కు చెందిన స్టోన్ మైనింగ్ ఆపరేటర్ రతికంత రౌత్‌పై గతంలో ఒక ఈడీ కేసు నమోదైంది.ఈ కేసులో అతని వద్ద నుంచి రఘువంశీ రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.5 కోట్ల లంచంలో భాగంగా మొదటి వాయిదా కింద రూ.20 లక్షలు.. రఘువంశీకి రౌత్ ఇస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు.. వల వేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. -
ఈడీ, మోదీలకు బెదరం: ఉదయనిధి స్టాలిన్
పుదుక్కొట్టై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను చూసి డీఎంకే భయపడదని ఆ పార్టీకి చెందిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. తమపై పెట్టే కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు.ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజల హక్కుల కోసం డీఎంకే పోరాటం కొనసాగిస్తుందని, ఎలాంటి బెదిరింపులకైనా భయపడబోదని చెప్పారు. తాత, మాజీ సీఎం కరుణా నిధి పెంచి పోషించిన డీఎంకే, హేతువాది పెరియార్ బోధించిన ఆత్మ గౌరవ నినాదానికి కట్టుబడిన పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. నిధి హక్కులు అడిగేందుకే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షనేత ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎవరో బెదిరిస్తే భయపడిపోయే పాలన తమది కాదన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా చట్టపూర్వకంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఇండోర్ స్టేడియం పూర్తి చేయడానికి రూ.3.5 కోట్ల నిధులు కేటాయించారన్నారు. టాస్మాక్‌పై ఈడీ దాడుల నేపథ్యంలో ఢిల్లీలో జరిగే నీతిఆయోగ్ సమావేశానికి వెళ్లేందుకు సీఎం స్టాలిన్ తొందరపడుతున్నారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే చేసిన వ్యాఖ్యలపై పైవిధంగా స్పందించారు. -
ఈడీ కేసులో రేవంత్.. పొంగులేటి రూటేనా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది అని ఎద్దేవా చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది.వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ?. ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా?. లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా?.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి… pic.twitter.com/fsb8uT8Sc9— KTR (@KTRBRS) May 23, 2025రాష్ట్ర కాంగ్రెస్‌లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే.సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి.30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈడీపై సుప్రీం ఆగ్రహం
-
నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్‌రెడ్డి
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్‌తోపాటు దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లు తెరపైకి వచ్చాయి. గత నెలలో కోర్టుకు సమర్పించిన చార్జిషిట్‌లో వీరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. కానీ, వీరిని నిందితులుగా చేర్చలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాందీ, రాహుల్ గాంధీతోపాటు మరో ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కొట్టేయడానికి కుట్ర జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఆస్తులను కాజేయాలన్న ఉద్దేశంతోనే యంగ్ ఇండియా సంస్థను స్థాపించినట్లు చెబుతోంది. ఈ సంస్థ ఏర్పాటుకు పలువురు కాంగ్రెస్ నాయకులతోపాటు ఇతరులు 2019–22 మధ్య విరాళాల రూపంలో డబ్బులు సమకూర్చారు. అందుకు ప్రతిఫలంగా పదవులు, ప్రయోజనాలు కట్టబెడతామని ప్రస్తుత తెలంగాణ సీఎం (అప్పటి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు) రేవంత్‌రెడ్డి, పవన్ బన్సల్, అహ్మద్ పటేల్ ప్రలోభ పెట్టారని ఈడీ చార్జిషిట్‌లో పేర్కొంది. సాక్షులను విచారించిన తర్వాతే ఈ విషయం నిర్ధారించుకున్నట్లు స్పష్టంచేసింది. ఈడీ ఆరోపణలపై రేవంత్‌రెడ్డి, పవన్ బన్సల్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా,యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటు కోసం రూ.30 లక్షలు విరాళంగా ఇచ్చానని కాంగ్రెస్ నేత అరవింద్ విశ్వనాథ్ సింగ్ చౌహాన్ ఈడీ విచారణలో అంగీకరించారు. అహ్మద్ పటేల్ సూచన మేరకే ఈ డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. కాగా, ఈడీ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్‌కుమార్‌కు కూడా నోటీసులిచ్చి విచారించిన విషయం తెలిసిందే. -
హద్దులన్నీ దాటుతోంది
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో సమాఖ్య పాలన భావనను తీవ్రంగా ఉల్లంఘిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బరితెగించి ఇష్టారీతిగా ప్రవర్తిస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తనకు ఇష్టమొచ్చినట్లు దర్యాప్తు చేయడం కోసం హద్దులను మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ సంస్థ అయిన ‘‘తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్)’’పై నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహ అక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి, భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం, టాస్మాక్ వేసిన పిటిషన్‌ను గురువారం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. తిట్లతో తలంటు డీఎంకే సర్కార్, టాస్మాక్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీలు వాదించారు. ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజుకు సుప్రీంకోర్టు తిట్లతో తలంటు పోసింది. ‘‘ఒక ప్రభుత్వ కార్పొరేషన్ అనేది నేరం ఎలా చేయగలదు?. ఈడీ అన్ని చట్టబద్ధ హద్దులను దాటేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సమాఖ్య విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడుతోంది’’అని సీజేఐ జస్టిస్ గవాయ్ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ దర్యాప్తు చట్టవిరుద్ధంగా సాగుతోందని, అందుకే వెంటనే దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వెంటనే అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కల్పించుకుని ‘‘దర్యాప్తును ఆపకండి. దాదాపు రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. కనీసం ఈ ఒక్క కేసులోనైనా ఈడీ హద్దులు దాటలేదని భావించండి’’అని వేడుకున్నారు. రాజు వాదనలను కపిల్ సిబల్ తప్పుబట్టారు. ‘‘మద్యం దుకాణాల లైసెన్సుల జారీ అంతా సక్రమంగా ఉన్నాసరే అక్రమాలు జరిగాయని అనవసరంగా నేర విచారణను ఈడీ మొదలెట్టింది. 2014 ఏడాది నుంచి ఇప్పటిదాకా అక్రమంగా డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక విభాగాలతో తప్పుడు ఫిర్యాదులు ఇప్పించి 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేయించారు. ఇప్పుడు కొత్తగా ఈడీ రంగంలోకి దిగి అన్యాయంగా టాస్మాక్ కార్యాలయాలపై చట్టవ్యతిరేకంగా దాడులు చేస్తోంది. మహిళా అధికారులను గంటల తరబడి టాస్మాక్ ఆఫీసుల్లోనే నిర్బంధించి ఈడీ అధికారులు వేధించారు. వ్యక్తిగత వస్తువులను లాక్కుని గోప్యతకు, ప్రాథమిక హక్కులకు భంగం కల్గించారు’’అని సిబల్ వాదించారు. ఈడీ దర్యాప్తును సమర్థిస్తూ ఏప్రిల్ 23వ తేదీన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, టాస్మాక్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. రాష్ట్రాల హక్కులను కూలదోస్తోంది సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ‘‘ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణ రాష్ట్రాలకు సంబంధించిన విషయంకాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా, బలవంతంగా లాక్కుంటోంది’’అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈఏడాది మార్చి ఆరో తేదీ నుంచి మార్చి 8వ తేదీదాకా ఏకధాటిగా 60 గంటలపాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా? అని తమిళనాడు సర్కార్ ఈడీని సుప్రీంకోర్టులో నిలదీసింది. ‘‘మార్చి ఆరో తేదీన టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం సోదాలు, జప్తులు చేశామని ఈడీ చెబుతోంది. కానీ టాస్మాక్ అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని సంస్థ. ఇప్పటిదాకా అక్రమంగా నమోదైన ఎఫ్ఐఆర్లలో ఏ ఒక్క దాంట్లోనూ టాస్మాక్ పేరును ‘నిందితుల జాబితా’లో పేర్కొనలేదు. ఎలాంటి ఆరోపణలు లేని, నిందితుల జాబితాలో లేని సంస్థ పరిధిలో, ప్రాంగణాల్లో ఈడీకి విచారణ, దర్యాప్తు చేసే హక్కు లేదు. పీఎంఎల్ఏ చట్టం సైతం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోంది’’అని తమిళనాడు సర్కార్ కోర్టులో వాదించింది. ‘‘2021లో చివరిసారిగా ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంత ఆలస్యంగా సోదాలు చేయడమేంటి?. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం నమ్మశక్యమైన కారణాలు ఉంటేనే దర్యాప్తు/సోదాలు జరపాలి. కానీ ఈడీ ఈ నిబంధనను గాలికొదిలేసింది. సరైన లక్ష్యంలేకుండా రంగంలోకి దూకి అడ్డదిడ్డంగా దర్యాప్తు చేస్తోంది’’అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఈడీని సుప్రీంకోర్టు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ చాలా కేసుల్లో పలు సుప్రీంకోర్టు ధర్మాసనాలు ఈడీ వైఖరిని తప్పుబట్టాయి. మనీ లాండరింగ్ చట్ట నిబంధనలను దుర్వినియోగం చేస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. బీజేపీకి చెంపదెబ్బ: సుప్రీంకోర్టు నిర్ణయంపై డీఎంకే వ్యాఖ్య టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు స్టే నిర్ణయం కేంద్రంలోని బీజేపీకి చెంపదెబ్బలా తగిలిందని తమిళనాడులోని పాలక డీఎంకే పార్టీ వ్యాఖ్యానించింది. ఈ మేరకు డీఎంకే సీనియర్ నాయకుడు, పార్టీ కార్యదర్శి(వ్యవస్థాగతం) ఆర్ఎస్ భారతి గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ‘‘టాస్మాక్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను మేం స్వాగతిస్తున్నాం. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలపై ఈడీని ఉసిగొల్పుతున్నారు. 2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలో డీఎంకే సర్కార్ కొలువుతీరాక ఈ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈడీని రంగంలోకి దింపారు. తాజాగా కోర్టు ఉత్తర్వులు చూశాకైనా బీజేపీ ఈడీని దుర్వినియోగం చేయడం మానుకుంటే మంచిది. తమిళనాడులో మరో 7–8 నెలల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకునే ఈడీ సోదాలు చేసింది’’అని ఆర్ఎస్ భారతి అన్నారు. కోర్టు నిర్ణయాన్ని విపక్ష పారీ్టలు సైతం స్వాగతించాయి. -
‘రన్యారావుకు హోంమంత్రి పెళ్లి గిప్ట్ ఇచ్చారు’.. ఈడీ రైడ్స్‌పై డిప్యూటీ సీఎం డీకే
సాక్షి,బెంగళూరు: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ.పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విద్యాసంస్థలపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో డీకే శివకుమార్.. జీ పరమేశ్వరను పరామర్శించారు. అనంతరం, డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. పరమేశ్వర.. రన్యారావుకు పెళ్లికి గిప్ట్ ఇచ్చారట. ఇందులో తప్పేముంది. నటికి గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.రన్యారావుది పెళ్లి కార్యక్రమం. ప్రజాజీవితంలో ఉన్నం. విద్యా సంస్థల్ని నడుపుతాం. తెలిసిన వారికి గిప్టులు ఇస్తుంటాం. వాటి ఖరీదు. ఒక్క రూపాయి, పది రూపాయలు, పది లక్షలు, ఐదు లక్షలు ఉండొచ్చు. అలాగే ఆయన (పరమేశ్వర)కూడా రన్యారావు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో తప్పేముంది’ అని అన్నారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వంటి చర్యల్ని తాము సమర్ధించబోమన్నారు.డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయననే అడగండి’అని వ్యాఖ్యానించారు. -
హద్దు దాటారు.. తమిళనాడులో ఈడీ సోదాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఢిల్లీ: తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.ఇటీవల తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సిబల్ వాదనలు వినిపిస్తూ.. 2014-21 వరకు రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. కానీ, ఈడీ 2025లో టాస్మాక్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం స్పందిస్తూ.. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయవచ్చు కానీ.. మొత్తం కార్పొరేషన్‌ను దీనికి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించింది. ఈడీ హద్దులు దాడి వ్యవహరించింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, తమిళనాడు లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.CJI: We have granted stay; Sibal: they are investigating-why are ED coming here?ASG Raju: We have done nothing wrong CJI: If they have registered FIR, why ED should come? Raju: 1000 crore fraudCJI: Where is the predicate offence? ED passing all limits— Live Law (@LiveLawIndia) May 22, 2025ఇదిలా ఉండగా.. తమిళనాడులో లిక్కర్ స్కాం కేసులో 1,000 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు తమిళనాడులో రాజకీయ గందరగోళాన్ని సృష్టించింది. తమిళనాడులో మద్యం విక్రయాలపై పూర్తి గుత్తాధిపత్యం కలిగిన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ TASMAC, రాష్ట్ర ఆదాయంలో గణనీయమైన భాగం (సంవత్సరానికి దాదాపు రూ. 45,000 కోట్లు) సమకూరుస్తుంది. ఇది రాష్ట్రంలో 4,700కు పైగా రిటైల్ షాపుల ద్వారా మద్యం పంపిణీ చేస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం.. TASMAC కార్యకలాపాలలో బహుళ అవకతవకలు జరిగాయి. ఇందులో టెండర్ మానిప్యులేషన్, అక్రమ నగదు లావాదేవీలు, రూ. 1,000 కోట్లకు పైగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. కాగా ఇటీవల ఈ కేసులో భాగంగా టాస్మార్క్ అధికారుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీంతో ఈడీ అధికారుల తీరుకు వ్యతిరేకంగా TASMAC అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రి పర్వమేశ్వరకు సంబంధం ఉన్నట్లు దర్యాప్తు సంస్థ ఈడీ గుర్తించింది.హోమంత్రి పరమేశ్వర సిద్ధార్ధ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. పరమేశ్వర విద్యాసంస్థలకు రన్యారావులకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ క్రమంలో బుధవారం పరమేశ్వర విద్యా సంస్థలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. తన సోదాల్లో సిద్ధార్ధ కాలేజీ నగదు లావాదేవీల్ని ఈడీ పరిశీలించింది. ఈడీ అధికారులు దాడుల సమయంలో పరమేశ్వర ఇంట్లో లేరని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనుల్లో నిమిగ్నమైనట్లు సమాచారం.Watch: The Enforcement Directorate (ED) is conducting raids and inspections at Siddhartha Institute of Technology and Siddhartha Medical College in Tumakuru, owned by Karnataka's Home Minister G. Parameshwara. The operation began around 9:30 AM today, with five teams involved in… https://t.co/xggph2I2Dh pic.twitter.com/QJ3AMuEcWc— IANS (@ians_india) May 21, 2025రన్యారావు పెళ్లికి సీఎం,హోమంత్రిమార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యా రావు అరెస్టు తర్వాత,కర్ణాటక మంత్రులు,మాజీ మంత్రులు సహా రాజకీయ నాయకులతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆనుమానించేలా పలు ఆధారాలు బయటపడ్డాయి.రన్యారావు వివాహానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,హోమంత్రి పరమేశ్వరలు పెళ్లికి హాజరైన ఫొటోలో వెలుగులోకి వచ్చాయి. దీంతో రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాజకీయ రంగుపులుముకుంది. స్మగ్లింగ్ కేసులో కాంగ్రెస్ నేతలకు సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ ఆరోపించింది.రన్యారావుతో సంబంధాలు.. ఖండించిన డిప్యూటీ సీఎం డీకేఆ ఆరోపణల్ని కాంగ్రెస్ ఖండించింది.కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తిరస్కరించారు. బీజేపీ తమ మంత్రులపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, కేవలం అవి అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. రన్యారావుకు బెయిల్బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావు బెయిల్‌పై విడుదలయ్యారు. బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ విశ్వనాథ్ చన్నబసప్ప గౌడర్ బెయిల్ మంజూరు చేశారు. ఇద్దరు ష్యూరిటీలతో పాటు, ఒక్కొక్కరికి రూ.2 లక్షల పూచీకత్తుతో విడుదల చేశారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. -
ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ
మహదేవ్ బెట్టింగ్‌యాప్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టిని విచారిస్తున్నట్లు తెలిపింది. అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో పిట్టి ప్రమేయం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈ వ్యవహారంతో స్టాక్ మానిప్యులేషన్, మనీలాండరింగ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.నిషాంత్ పిట్టిపై ఆరోపణలు..అసోసియేట్ ల్యాప్‌టాప్ నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు ద్వారా పిట్టిని అక్రమ బెట్టింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్కై ఎక్స్ఛేంజ్కు ఏజెంట్‌గా గుర్తించినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా మహదేవ్ బెట్టింగ్‌యాప్ ఆపరేటర్లతో సంబంధం ఉన్న డొల్ల కంపెనీలకు ఈజ్ మై ట్రిప్ చెల్లింపులు చేసిందని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ పిట్టి నివాసంలో సోదాలు నిర్వహించి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకుంది. స్టాక్ ధరలను తారుమారు చేయడం, చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేయడం లక్ష్యంగా ఉన్న బిగ్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ లావాదేవీలు జరిగాయని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవరపిట్టి ప్రతిస్పందననిషాంత్ పిట్టి ఈ ఆరోపణలను ఖండిస్తూ ఈడీ సూచించిన వ్యక్తులు, కంపెనీల గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. 2017 నుంచి ఈజ్ మై ట్రిప్ ఏ సంస్థలకు చెల్లింపులు చేయలేదని, పారదర్శకత, చట్టబద్ధమైన కార్యకలాపాలకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నానని, అన్ని ఆర్థిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. -
యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అరెస్ట్: కారణం ఇదే..
యూకో బ్యాంక్ మాజీ సీఎండీ 'సుబోధ్ కుమార్ గోయెల్'ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. బ్యాంకు రుణ మోసం కేసులో.. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు రుణాల మంజూరులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సుబోధ్ కుమార్ గోయెల్‌ను అరెస్ట్ చేసి కోల్‌కతాలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కోర్టు ముందు ఏదీ హాజరుపరచింది. కాగా యూకో బ్యాంక్ మాజీ సీఎండీని మే 21 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపినట్లు ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.యూకో బ్యాంక్ సీఎండీగా గోయెల్ పనిచేసిన సమయంలో కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL)కు భారీ మొత్తంలో నిధులను మంజూరు చేశారు. ఇలా మంజూరైన రూ. 6,210.72 కోట్ల నిధులను ఆ సంస్థ దుర్వినియోగం చేసిందని.. సీబీఐ దర్యాప్తులో తెలిసింది. అంతే కాకూండా ఋణ మంజూరు విషయంలో.. సుబోధ్ కుమార్ గోయెల్‌ను ముడుపులు అందినట్లు కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది.ఇదీ చదవండి: సంపన్న నటుడు.. టామ్ క్రూజ్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా? -
రూ. 9 కోట్ల నగదు.. రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం!
హైదరాబాద్: నగరానికి చెందిన వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేసింది. గురువారం హైదరాబాద్ లోని వైఎస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న వైఎస్ రెడ్డి.. అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. దీనిలో భాగంగా ఈరోజు ఆయనకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్ ఇలా 12 చోట్ల ఈడీ సోదాలు చేసింది. దీనిలో భాగంగా రూ. 9 కోట్ల నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే నగలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆరోపణలకు కేసు నమోదు కాగా, దీనికి సంబంధించి సోదాలు చేశారు ఈడీ అధికారులు. బిల్డర్స్ తో కుమ్మక్కై అనధికారంగా అనుమతులు ఇచ్చినట్లు గుర్తించిన తర్వాత ఈడీ సోదాలు చేసింది. -
నేడు ఈడీ విచారణకు సినీ నటుడు మహేష్ బాబు
-
అన్నీ తప్పుడు కేసులే.. ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఈడీ అధికారులు.. అరెస్ట్ చేస్తున్నారని వ్యాఖ్యలు చేసింది. తప్పుడు కేసులు పెడుతోందని ఘాటుగా స్పందించింది.దేశంలో ఈడీ కేసుల్లో అరెస్టులపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ధర్మాసనం స్పందిస్తూ..‘ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టులు చేస్తోంది. ఈడీకి ఇదొక అలవాటుగా మారింది. ఇలా అనేక కేసులు మేము చూస్తున్నాం. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కాంలో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ ఆధారాలు చూపలేదు. గతంలోనూ అనేక కేసుల్లో ఆధారాలు చూపించలేదు. తప్పులు కేసులు పెడుతుంది. ప్రతీ స్కాంలో ఈడీ తీరు ఇలాగే ఉంది. అరెస్టులు చేయడం అలవాటుగా మారింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ED making allegations without evidence: Supreme Court observes #SupremeCourt while hearing a bail application in an ED arrest:Justice Abhay S Oka: this is what we’re seeing in umpteen number of cases filed by the ED. This is the pattern, you just make allegations without any… pic.twitter.com/THRaLZg9R5— Bar and Bench (@barandbench) May 5, 2025 -
థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు. -
భూదాన్ ల్యాండ్ ఇష్యూ.. సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మహేశ్వరం నాగారంలో భుదాన్ భూములు అమ్మకాలు జరిగాయని.. నిన్న ఐదు చోట్ల సోదాలు చేపట్టామని ఈడీ ప్రకటించింది. మునావర్ ఖాన్ ఫామ్ హౌస్‌లో పార్కు చేసిన 25 కార్లు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మునావర్ ఖాన్, లతీఫ్, అక్తర్ సుకుర్ ఇళ్లలో జరిపిన సోదాల్లో 45 వింటేజ్ కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. విదేశీ కరెన్సీతో పాటు 23 లక్షల నగదు సీజ్ చేశాం’’ అని అధికారులు తెలిపారుకుదురున్నీసా, మునావర్‌ఖాన్ ఇళ్లలో సోదాలు చేశాం. మునావర్‌ఖాన్ ఫామ్ హౌస్‌లోని పత్రాలను సీజ్ చేశాం. ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి అమ్మకాలు సాగించారు. తమ వారసత్వ ఆస్తిగా పేర్కొంటూ అమ్మకాలు జరిపారు. ప్రముఖులు, రియల్టర్లు భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించాం. రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి విక్రయాలు జరిపారు’’అని ఈడీ అధికారులు వెల్లడించారు. -
విచారణకు రానన్న మహేశ్.. ఈడీ స్పందనపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఆ సంస్థ ప్రచారకర్త మహేశ్‌బాబు (Mahesh Babu)ను ఈడీ (Enforcement Directorate) విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే! అయితే షూటింగ్స్‌తో బిజీగా ఉన్న కారణంగా నేడు (ఏప్రిల్ 28) విచారణకు రాలేనని, మరో తేదీ ఇవ్వాలని మహేశ్ అధికారులకు లేఖ రాశాడు. దీనిపై ఈడీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు. మరి నేటి విచారణకు ఈడీ మినహాయింపు ఇస్తుందా? విచారణ కోసం మరో తేదీ కేటాయిస్తుందా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.ఏం జరిగింది?సాయిసూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఈ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేశ్‌బాబుకు రూ.3.5 కోట్లు చెక్ ద్వారా, రూ.2.4 కోట్లు క్యాష్ రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. మహేశ్‌బాబుకు అందిన డబ్బుపై ఆరా తీసేందుకు ఈడీ అతడిని విచారణకు రమ్మని ఆదేశించింది. కానీ రాజమౌళి సినిమా (SSMB29) షూటింగ్‌తో బిజీగా ఉన్నందున నేడు విచారణకు రాలేనని మహేశ్ ఈడీకి లేఖ రాశాడు. మరి దీనిపై ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: హిట్ 3 నచ్చకపోతే SSMB29 సినిమా చూడొద్దు.. నాని -
ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ
-
ఇప్పుడు రాలేను.. సమయం ఇవ్వండి: మహేష్ బాబు
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం ఇవ్వాలని నటుడు మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను కోరారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌లకు హాజరుకావాల్సి ఉన్నందున మరికొంత సమయం ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినట్టు తెలిసింది. ఈ నెల 22న ఈడీ ఇచ్చిన సమన్ల ప్రకారం సోమవారం బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది. కాగా, సాయి సూర్య డెవలపర్స్ వెంచర్స్ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం మహేశ్‌బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్టు అధికారులు ఆధారాలు సేకరించారు. దీనిపై మరింత లోతుగా విచారించేందుకు మహేశ్‌బాబుకు సమన్లు జారీ చేశారు. సురానా గ్రూప్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో మహేశ్‌బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు లభించాయి. -
విచారణకు రాలేను.. ఈడీకి మహేశ్‌బాబు లేఖ
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో విచారణకు రాలేనంటూ మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు (ఏప్రిల్ 28) ఈడీ ఎదుట హాజరు కాలేనని తెలిపాడు. విచారణ కోసం మరో తారీఖును ఫిక్స్ చేయాలని కోరాడు.ఎందుకీ విచారణ?సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు.. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్‌లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు11 కేసులు నమోదు చేసిన పోలీసులు సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఏప్రిల్ 16న ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. ప్రచారకర్తగా మహేశ్ ఉన్నందువల్లే..సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు పంపింది. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించింది. కానీ రాజమౌళి సినిమాతో (#SSMB29) బిజీగా ఉండటంతో మహేశ్ విచారణకు రాలేనని తాజాగా లేఖ రాశాడు.చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు -
ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) కార్యాలయం ఖైసర్ ఏ హిందు భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆదివారం తెల్లవారు జామన ఈడీ ఆఫీస్‌లో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. #WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai's ED office in Ballard Pier.The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8— ANI (@ANI) April 27, 2025పీటీఐ కథనం ప్రకారం.. కారింభోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని కైసర్ ఐ హింద్ అనే భవనంలో ఆదివారం ఉదయం 2:31 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందింది.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మొదట మామూలు మంటగా కనిపించినా, ఉదయం 3:30 గంటల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవల్-2 (భారీ అగ్ని ప్రమాదం) గుర్తించారు. ఇక ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. ఘటన స్థలానికి 12 ఫైరింజన్లు, ఆరు జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఎరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రెతింగ్ అపారాటస్ వాన్, రెస్క్యూ వాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు. -
ఈడీ అదుపులో జెన్సోల్ ప్రమోటర్!
న్యూఢిల్లీ: జెన్సోల్ కంపెనీ ప్రమోటర్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్‌లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని నిబంధనల కింద ఈ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ఓ హోటల్లో ఉన్న కంపెనీ సహ ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరో ప్రమోటర్ అన్మోల్ సింగ్ జగ్గీ దుబాయ్‌ల్లో ఉన్నట్టు సమాచారం. ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ కంపెనీ ఖాతాల నుంచి నిధులు మళ్లించారంటూ సెబీ దర్యాప్తులో తేలడం తెలిసిందే. ఇరెడా, పీఎఫ్సీ నుంచి ఈవీలు, ఈపీసీ కాంట్రాక్టుల కోసం తీసుకున్న రుణాలను ప్రమోటర్లు మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు సెబీ గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. -
మహేశ్‌బాబుకు ఈడీ సమన్లు
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంస్థలకు ప్రచారకర్తగా పనిచేసిన ప్రముఖ సినీ నటుడు మహేశ్‌బాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. సాయిసూర్య డెవలపర్స్ కంపెనీ నుంచి మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఈ నెల 28న బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో హాజరుకావాలని సోమవారం సమన్లు జారీచేశారు. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఈ నెల 16న ఈడీ సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. మహేశ్‌బాబుకు చెక్కుల రూపంలో రూ.3.4 కోట్లు, నగదు రూపంలో రూ.2.5 కోట్లు చెల్లించినట్లు ఈ సోదాల్లో ఆధారాలు లభించాయి. దీంతో ఆయనకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించారు. ఇదీ కేసు నేపథ్యం సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్‌లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు నవంబర్‌లో ఈ సంస్థలపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 11 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. గ్రీన్ మెడోస్ ప్రాజెక్ట్ పేరుతో మోసాలకు పాల్పడినట్లు సతీష్‌చంద్ర గుప్తాపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లోనూ గతేడాది కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కోణంలో ఈసీఐఆర్ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. అయితే, ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా సంపాదించిన డబ్బును ఇతర సంస్థలకు మళ్లించింది. ఈ క్రమంలోనే నటుడు మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు సాయిసూర్య డెవలపర్స్ నుంచి చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఆయనకు సమన్లు జారీచేశారు. -
మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. గతవారంలో రెండు రోజులపాటు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూపులపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థల ప్రాజెక్టులకు మహేష్ ప్రచార కర్తగా వ్యవహరించారు. వీటి ప్రచారానికి గానూ ఆయన భారీగా పారితోషకం అందుకున్నట్లు సమాచారం. ఇక సాయి సూర్య డెవలపర్స్‌కు చేసిన ప్రచారానికిగానూ రూ.5.9 కోట్లు మహేష్ అందుకున్నారు. ఈ ప్రమోషన్ కింద రూ.2.5 కోట్ల నగదు, రూ.3.4 కోట్లు చెక్ రూపంలో ఆయన అందుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత 27వ తేదీన ఆయన్ని విచారణకు ఈడీ నోటీసులు పంపింది. అయితే.. ఆరోజు ఆదివారం ఉన్న నేపథ్యంలో ఆ మరుసటిరోజు (28వ తేదీన) ఉదయం 11గం. విచారణకు రావాలని కోరింది. సంబంధిత గ్రూపులతో జరిగిన లావాదేవీలపై ఈడీ ఆయన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. -
రూ.50 కోట్ల కుక్క..ఈడీ సోదాల ఎపిసోడ్లో అదిరిపోయే ట్విస్ట్!
బనశంకరి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదుచేసే కుక్కను రూ.50 కోట్లకు కొనుగోలు చేశానని ప్రకటించిన బెంగళూరుకు చెందిన ఎస్.సతీశ్ ఇంటికి ఈడీ అధికారులు సోదాకొచ్చి షాకిచ్చారు. తోడేలు– కాకేసియన్ షెపర్డ్ జాతి కుక్క సంకరంతో పుట్టిన ఊల్ఫ్ డాగ్ అనే శునకాన్ని తాను భారీ ధర పెట్టి కొన్నానని, ప్రపంచంలో ఇలాంటి కుక్క ఇదొక్కటేనని కొన్నిరోజులుగా ప్రచారం చేస్తున్నారు.సోసల్ మీడియాలో ప్రచారంతో ఈడీ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఈడీ అధికారులు సతీశ్ ఇంటికి వచ్చి సోదాలు చేశారు. ఫెమా చట్టం ఉల్లంఘన కింద దర్యాప్తు చేశారు. దర్యాప్తులో రూ.50 కోట్ల డబ్బు ఎక్కడిది, విదేశాలకు డబ్బు లావాదేవీలు ఎలా జరిగాయి అనేది ప్రశ్నలు కురిపించారు. కుక్క కొనుగోలుకు సంబంధిత ఆధారాల్ని ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఈడీ అధికారుల ప్రశ్నలకు కంగుతిన్న ఎస్.సతీష్.. సోషల్ మీడియాలో తాను చూపించిన కుక్కకు అంత సీను లేదని, రూ.50 కోట్లకు కొనలేదని, ప్రచారం కోసం జిమ్మిక్కులు చేస్తున్నాడని తెలిసి నివ్వెరపోయారు.సోదాలపై ఈడీ పీటీఐ అధికారుల్ని సంపద్రించింది. ఈడీ అధికారులు సైతం ఇదే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఫేమ్ కోసమే యజమాని సతీష్ రూ.50 కోట్ల కుక్క అంటూ ప్రచారం చేసుకున్నాడని, ఆ కుక్కను భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేయలేదని తాము గుర్తించినట్లు చెప్పారు. అంతేకాదు రూ.50 కోట్లు అంటూ కుక్కపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ కుక్క ఖరీదు రూ.లక్షలోపే ఉంటుందని సమాచారం. -
మూడో రోజూ ఈడీ విచారణకు వాద్రా
న్యూఢిల్లీ: భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా వరుసగా మూడో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయనను ఆరు గంటలపాటు ప్రశ్నించి, స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొత్తం మూడు రోజుల్లో 16 గంటలపాటు వాద్రాను ప్రశ్నించడం గమనార్హం. మూడో రోజు తన భార్య ప్రియాంకతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై రాజకీయ క్షుద్ర వేట జరుగుతోందని ఆరోపించారు. రాబర్ట్ వాద్రాపై ఈడీ త్వరలో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. -
రూ. 50 కోట్ల కుక్క.. ఈడీ దాడులు!
ఏదైనా గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. గొప్పగా బ్రతకొచ్చు.. నీ గొప్పను అవతలి వాడు చెప్పుకోవాలి.. అంతేకానీ మనకు అవకాశం దొరికింది కదాని లేనిపోని గొప్పలకు పోతే ఇలానే ఉంటుంది. ఓ వ్యక్తి గొప్పలకు పోయాడు. తాను ఓ కుక్కును పెంచుకుంటున్నాడు. అది సహజమే. కాకపోతే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు అంటూ గొప్పలకు పోయాడు. నిజంగానే ఆ కుక్క విలువ రూ. 50 కోట్లు ఉంటుందో లేదో తెలీదు కానీ, ఇక్కడ ఆ మనిషి నోరు జారిన ‘గొప్ప’ ఈడీ రైడ్స్ వరకూ వెళ్లింది.విషయంలోకి వెళితే.. తాను అత్యంత ఖరీదు అని చెప్పుకునే కుక్కను తీసుకుని గత ఫిబ్రవరిలో ఓ షోకు వెళ్లాడు సతీష్ అనే వ్యక్తి. అక్కడ తన కుక్క విలువ రూ. 50 కోట్లంటూ ఏవో గొప్పలు చెప్పుకున్నాడు. ఇదొక అరుదైన జాతి కుక్క అని, దీని విలువ లక్షరాల రూ. 50 కోట్లని బహిరంగంగా ప్రకటించాడు. ఇది ఆనోట ఈనోట మారి ఈడీ వరకూ వెళ్లింది. ఫిబ్రవరిలో ఏదో చెప్పుకున్నాడు.. కానీ ఈడీ ఓ కన్నేసి ఉంచింది. అతనికి రెండు నెలల తర్వాత సోదాల పేరుతో వెళ్లింది. కుక్కనే అంత పెట్టి కొన్నాడంటే ఇంక ఎంత ఉంటుందో అని ఈడీ లెక్కలు వేసుకుంది. అంతే అతనికి ఇంటికి గురువారం వెళ్లి సోదాలు చేపట్టింది.ఈ క్రమంలోనే అతనికి సంబంధించి అన్నీ ఆరాలు తీసింది. అతని బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే పెద్ద మొత్తంలో ఏమీ లావాదేవీలను జరగలేదని విషయాన్ని గుర్తించింది. కుక్కను రూ. 50 కోట్లను పెట్టి కొనుగోలు చేసినట్లు అతను చెప్పిన కోణంలో సమగ్రంగా దర్యాప్తు చేసింది. అయితే అతను లావాదేవీల్లో అంత పెద్ద మొత్తాన్ని ఈడీ గుర్తించలేదు. హవాలా రూట్ లో ఏమైనా చేశాడా.. అనే కోణాన్ని ఈడీ దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. -
ఆర్థిక నేరాలకు ఈడీ విచారణ అవసరం లేదు
భువనేశ్వర్: ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ అవసరం లేదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చెప్పారు. విచారణ కోసం ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మిగతా రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఈడీని ఏర్పాటు చేశారని అన్నారు. ఈడీ ఇప్పుడు ఎన్నో రకాలుగా వివాదాల్లో చిక్కుకుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను పక్కనపెట్టడమే మంచిదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరాలపై విచారణకు ఆదాయపు పన్ను శాఖ వంటి విభాగాలు ఉండగా ఈడీ ఎందుకని ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ బుధవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈడీ అవసరం ఇప్పుడు లేదని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. భుశనేశ్వర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ జెనా నివాసానికి అఖిలేష్ వెళ్లారు. దీంతో శ్రీకాంత్ జెనా సమాజ్‌వాదీ పార్టీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, అందులో వాస్తవం లేదని వారిద్దరూ స్పష్టతనిచ్చారు. -
హైదరాబాద్‌లో రెండు సంస్థలపై ఈడీ సోదాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీస్‌తో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సురానాకి అనుబంధంగా సాయి సూర్య డెవలపర్స్ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ.. అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. సురానా గ్రూప్ చైర్మన్, ఎండీ నివాసాలు, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ చైర్మన్, ఎండీల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని నాలుగు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. చెన్నై చెందిన ఈడీ బృందాలు సోదాల్లో పాల్గొంది. సూరానా గ్రూప్స్.. చెన్నైలోని ప్రముఖ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టిన నేపథ్యంలో ఇప్పటికే సురానా గ్రూప్‌పై సీబీఐ కేసు నమోదైంది. ఇక, తాజాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఈడీ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. ఈడీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా.. కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్
ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బిగ్ షాక్ తగిలింది. హర్యానాలోని శిఖోపూర్ భూ ఒప్పందానికి సంబంధించిన (Haryana land deal case) మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు వాద్రాకు మరోసారి సమన్లు జారీ చేశారు. దీంతో, ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈడీ నోటీసులపై..‘నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని చెప్పగానే మళ్లీ ఈడీ నోటీసులు పంపించారు. ఇది కేవలం రాజకీయ ప్రతీకారం మాత్రమే. నేను ప్రజల తరపున మాట్లాడి, వారి వాదనలు వినిపించినప్పుడల్లా, వారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ కేసులో ఏమీ లేదు. ఇప్పటికే నాకు 15 సార్లు సమన్లు పంపారు. ప్రతీసారీ 10 గంటలకు పైగా విచారించారు. నేను 23,000 పత్రాలను సమర్పించాను. ఈ కేసులో అన్ని వివరాలు అందించాను. అలాగే, ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తాను’ అని చెప్పుకొచ్చారు. #WATCH | Delhi: Businessman Robert Vadra marches from his residence to the ED office after being summoned in connection with a Gurugram land case, alleges 'political vendetta'.He says, "Whenever I will speak up for people and make them heard, they will try to suppress me... I… pic.twitter.com/mRrRZedq6l— ANI (@ANI) April 15, 2025ఇదిలా ఉండగా.. రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అనంతరం ఈ భూమిని సదరు వాద్రా కంపెనీ.. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్కి రూ.58 కోట్లకు విక్రయించింది. దీంతో, వాద్రా కంపెనీ ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ఏప్రిల్ ఎనిమిదో తేదీన మొదటిసారి జారీ చేసిన సమన్లకు వాద్రా స్పందించలేదు. విచారణకు కూడా వెళ్లలేదు. దీంతో, తాజాగా రెండోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. -
National Herald Case: రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌కు చెందిన ఈ ఆస్తులలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని పలు ప్రాంగణాలు, లక్నోలోని ఒక భవనం ఉన్నాయి.ఏజెఎల్, యంగ్ ఇండియన్పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఏజెఎల్ నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫారం (వార్తాపత్రిక, వెబ్ పోర్టల్)నకు ప్రచురణకర్తగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్‌లో 38 శాతం వాటాలతో అధిక వాటాదారులుగా ఉన్నారు. ఈడీ తన దర్యాప్తులో.. ఉద్దేశపూర్వకంగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ప్రయోజనం చేకూర్చేదిగా పనిచేసిందని ఈడీ ఆరోపించింది. సంస్థ విలువను గణనీయంగా తక్కువగా అంచనా వేసి , రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను ఏజెఎల్ సేకరించిందని ఈడీ గుర్తించింది. రూ. 18 కోట్ల వరకు బోగస్ దానాలు, రూ. 38 కోట్ల వరకు బోగస్ అడ్వాన్స్ అద్దె, రూ. 29 కోట్ల వరకు బోగస్ ప్రకటనల రూపంలో అక్రమంగా రాబడిని సంపాదించుకునేందుకు యంగ్ ఇండియన్ ప్రయత్నించిందని ఈడీ ఆరోపించింది. ఈ నేపధ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏజెఎల్ కేసులో రూ. 661 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఏజేఎల్‌కు నోటీసులు జారీ చేసింది.ఇది కూడా చదవండి: సియాచిన్ డే: అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో భారత్ విజయం -
నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.661 కోట్ల ఆస్తుల స్వాదీనం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో గతంలో అటాచ్ చేసిన స్థిరాస్తులను స్వా«దీనం చేసుకునేందుకు నోటీసులు జారీచేశామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే తాము జప్తుచేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులున్న చోట్ల ఈడీ అధికారులు ‘స్వా«దీన నోటీసులు’అంటించారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఐటీఓ ప్రాంతంలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని సర్వే నంబర్ 341లో ఉన్న బాంద్రా(ఇ) రెండో ప్లాట్, లక్నోలోని విశ్వేశ్వర్నాథ్ రోడ్డులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ భవంతికి ఈడీ అధికారులు నోటీసులు అంటించారు. వెంటనే ఖాళీచేయాలని ఈ స్థిరాస్తుల్లో నడుస్తున్న కార్యాలయాలు, ఆఫీస్‌లు, దుకాణాలను ఆదేశిస్తూ నోటీసులిచ్చారు. ముంబైలోని హెరాల్డ్ హౌస్‌లో 7, 8, 9వ అంతస్తుల్లో నడుస్తున్న జిందాల్ సౌత్‌వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆఫీస్ వెంటనే ఖాళీచేయాలని, స్థిరాస్తిని తమకు అప్పగించాలని, లేదంటే నెలవారీ అద్దెను ఇకపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్‌కు బదిలీచేయాలని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు తమకు మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్ఏ)లోని సెక్షన్(8), రూల్5(1)ద్వారా దఖలుపడ్డాయని ఆ నోటీస్‌లో ఈడీ పేర్కొంది. 2023 నవంబర్‌లో రూ.661 కోట్ల స్థిరాస్తులతోపాటు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.90.20 కోట్ల విలువైన షేర్లనూ ఈడీ అటాచ్ చేయడం తెల్సిందే. ఈ కేసులో రూ.998 కోట్ల నేరం జరిగిందని ఈడీ గతంలో ఆరోపించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, మోతాలాల్ ఓరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శ్యామ్ పిట్రోడా, యంగ్ ఇండియా ప్రైవేట్ సంస్థలు అక్రమంగా రూ.2,000 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ స్థిరాస్తులను కాజేసేందుకు కుట్ర పన్నారని ఈడీ గతంలో పేర్కొనడం తెల్సిందే. -
తమిళనాట ట్విస్ట్ .. మంత్రి నెహ్రు ఇంట్లో ఈడీ సోదాలు
చెన్నై: తమిళనాడులో రాజకీయం హీటెక్కింది. మంత్రి కేఎన్ నెహ్రు, ఆయన కుమారుడు, లోక్‌సభ సభ్యుడు అరుణ్ నెహ్రూకు సంబంధించిన నివాసాల్లో తాజాగా ఈడీ సోదాలు నిర్వహించింది. దీంతో, ఇరు నేతల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో వారి ఇళ్ల వద్దకు చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తమిళనాడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేఎన్ నెహ్రూ ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామునే ఈడీ అధికారులు.. నెహ్రుకు సంబంధించిన నివాసాలకు చేరుకున్నారు. అయితే, మంత్రి నెహ్రూ సోదరుడు ఎన్. రవిచంద్రన్ చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ట్రూ వాల్యూ హోమ్స్(టీవీహెచ్)లో ఆర్థిక అవకతవకలకు జరిగినట్టు ఈడీ అధికారులు తెలిపారు. దానికి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి. టీవీహెచ్ 1997లో స్థాపించబడింది. రాష్ట్రంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు ఉంది.#WATCH | Tamil Nadu | ED (Enforcement Directorate) searches underway in Chennai on True Value Homes (TVH) Builders. TVH has alleged connection with state minister KN Nehru. Searches at multiple locations started early this morning: Sources(Visuals from the residence of… pic.twitter.com/tpXXEJpgGP— ANI (@ANI) April 7, 2025 -
'లూసిఫర్2' నిర్మాత ఆఫీస్లపై ఈడీ దాడులు.. రూ. 1000 కోట్ల కేసులో
మోహన్‌లాల్ (Mohanlal) ప్రధాన పాత్రలో నటించిన ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) చుట్టూ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 2002లో గుజరాత్లో చోటుచేసుకున్న అల్లర్లను తప్పుగా ఇందులో కీలక సన్నివేశాలుగా చూపించారని విమర్శలు వచ్చాయి. ఆపై విలన్ పేరును భజరంగిగా పెట్టడం కూడా తప్పుబట్టారు. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ కూడా రాజ్యసభలో ఈ మూవీపై మాట్లాడారు. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇలాంటి సమయంలో నిర్మాతపై ఈడీ దాడులు చేయడం చర్చనియాంశంగా మారింది.లూసిఫర్2 సినిమాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలలో ఒకరైన గోకులం గోపాలన్ చిట్ ఫండ్ కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఆయనకు సంబంధించిన తమిళనాడు, కేరళ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. సుమారు రూ.1,000 కోట్ల విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కోడంబాక్కంలోని గోకుల్ చిట్ ఫండ్స్ కార్యాలయంతో సహా అనేక ప్రదేశాలలో ఈడీ దాడులు ప్రారంభమయ్యాయి.పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ (L2:Empuraan) బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు సుమారు రూ. 240 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాపై వివాదం రావడంతో సుమారు 17 సెన్సార్ కట్స్ చేశారు. దీంతో సినిమా నిడివి సుమారు 5నిమిషాలు తగ్గింది. -
ఆయుష్మాన్ భారత్ పథకంలో అవకతవకలు.. ఈడీ దాడులు
ఢిల్లీ: కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ (pmjay) పథకంలో అవకతవకులు జరిగాయి. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చర్యలకు ఉపక్రమించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడీ ఏక కాలంలో దాడులకు దిగింది. 2023లో పార్లమెంటులో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. జార్ఖండ్‌లో ఆయుష్మాన్ పథకం పేరుతో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగిందనేది ఆ నివేదిక సారాశం. రోగులను చేర్చుకోకుండా, బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్ చేస్తున్నారని అందులో పేర్కొంది. కాగ్ తన రిపోర్ట్‌లో దేశంలోని 212 ఆస్పత్రులలో పీఎంజేఏవైలో ఈ అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. చికిత్స అందించకుండాఈ నేపథ్యంలో శుక్రవారం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మోసపూరిత కార్యకలాపాలు, ఆర్థిక దుర్వినియోగానికి సంబంధించి జార్ఖండ్‌లోని రాంచీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. పీఎంజేఏవైలోని నెట్ వర్క్ ఆస్పత్రులలో ఎటువంటి వైద్య చికిత్స లేకుండా, ఏ రోగిని చేర్చకుండా చెల్లింపులు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ దాడులకు దిగింది. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. పీఎంజేఏవై పథకం కిందపీఎంజేఏవై పథకం కింద కేంద్రం నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిస్తుంది. ఈ పథకంలో రూ.5లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. ప్రస్తుతం దాదాపు 12.3 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉంది. తాజాగా కేంద్రం ఈ పథకాన్ని 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వర్తించేలా మార్పులకు శ్రీకారం చుట్టింది. -
సెలబ్రిటీల చుట్టూ... బెట్టింగ్ యాప్స్ ఉచ్చు
సాక్షి, హైదరాబాద్/మియాపూర్: ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’పేరుతో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేస్తున్న అవగాహన కార్యక్రమం ప్రకంపనలు పుట్టిస్తోంది. దీంతో స్ఫూర్తి పొందిన అనేక మంది సామాజిక కార్యకర్తలు బెట్టింగ్, గేమింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజగుట్ట ఠాణాలో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు కాగా... తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మందిపై రిజిస్టరైంది. ఇందులో సినీనటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ తదితరులు నిందితులుగా ఉన్నారు. మియాపూర్‌కు చెందిన పీఎం ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాలక్రమంలో బానిసలుగా...: బెట్టింగ్, గేమింగ్, క్యాసినో యాప్స్‌కు వ్యతిరేకంగా ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫణీంద్ర గత ఆదివారం తమ కాలనీకి చెందిన యువకులతో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే వారిలో అత్యధికులు ఈ యాప్స్‌పై ఆసక్తి చూపడాన్ని గమనించారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు సెలబ్రిటీలు, యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న ప్రచారమే దీనికి కారణమని ఫణీంద్ర గుర్తించారు. ఈ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం యువతను ప్రధానంగా డబ్బు అవసరం ఉన్న వారిని బెట్టింగ్ యాప్స్ ఉచ్చులోకి లాగుతోందని, అనేకమంది వాటిలో డబ్బు పెట్టి నిండా మునిగిపోతున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరెవరు ఏ యాప్స్‌లో.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వాటిలో అత్యధికం సోషల్‌మీడియాలో పాప్అప్ యాడ్స్ రూపంలో వస్తున్నట్లు ఫణీంద్ర గుర్తించారు. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌లు జంగిల్‌రమ్మీ.కామ్, విజయ్ దేవరకొండ ఏ23, మంచు లక్ష్మి యోలో247.కామ్, ప్రణీత ఫేర్‌ప్లే.లైవ్, నిధి అగర్వాల్ జీత్‌విన్ సైట్లు, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లుగా ఉన్న అనన్య నాగెళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నియాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బీఎస్ సుప్రీత వివిధ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పూర్తి వివరాలు సమరి్పస్తూ బుధవారం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి.. పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై బీఎన్ఎస్లోని 318 (4), 112 రెడ్ విత్ 49, గేమింగ్ యాక్ట్‌లోని 3, 3 (ఎ), 4, ఐటీ యాక్ట్‌లోని 66 డీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నిందితుల్లో కొందరు పంజగుట్టలో నమోదైన కేసులోనూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల వివరాలను సేకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. మరోపక్క పంజగుట్ట కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు మంగళ, బుధవారాల్లో టేస్టీ తేజ, హబీబ్‌నగర్ కానిస్టేబుల్ కిరణ్ గౌడ్‌ను ప్రశ్నించారు. గురువారం విష్ణు ప్రియ, రీతు చౌదరి విచారణకు హాజరయ్యారు. ఒక్కొక్కరిని 3 నుంచి 8 గంటలపాటు ప్రశి్నస్తున్న అధికారులు కొందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాము కేవలం స్కిల్డ్ గేమ్ అని చెప్పడంతోనో, తెలియకో ఆ యాప్స్‌ను ప్రమోట్ చేశామని కొందరు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్యాంపెయిన్‌కు సంబంధించిన లావాదేవీలన్నీ యాప్స్ నిర్వాహకులతో బ్యాంకు ఖాతా ద్వారానే జరిగినట్లు వాళ్లు పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో తదుపరి విచారణకు బ్యాంకు స్టేట్మెంట్స్తో హాజరుకావాలని పోలీసులు వారికి స్పష్టం చేశారు. మిగిలిన ఇన్ఫ్లూయన్సర్లు ఒకటిరెండు రోజుల్లో విచారణకు రానున్నారు. -
HCA: నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గత అపెక్స్ కౌన్సిల్ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్‌పై పలు అభియోగాలు నమోదయ్యాయి.క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్‌సీఏ చేపట్టిన సబ్ కాంట్రాక్టుల విషయంలో.. సురేందర్ అగర్వాల్‌కు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు 90 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అగర్వాల్‌తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఖాతాలకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా అగర్వాల్ భార్య, కొడుకు , కోడలు అకౌంట్లకు నగదు బదిలీ జరిగిందని.. సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ మేర చెల్లింపులు జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 90 లక్షల రూపాయలలో 51.29 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో ఈడీ విచారణకు లాలూ
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్(RJD chief Lalu Yadav) మరోమారు చిక్కుల్లో పడ్డారు. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు ఆయన తన కుమార్తె మిసా భారతితో కలిసి బుధవారం పట్నా(బీహార్)లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.మరోవైపు లాలూ యాదవ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించడాన్ని నిరసిస్తూ ఈడీ కార్యాలయం వెలుపల ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ల్యాండ్ ఫర్ జాబ్ కేసును లాలూ గతంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు. 2024 నుండి 2009 వరకు రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో లాలూ పలువురికి ఉద్యోగాలు ఇప్పించి, అందుకు ప్రతిగా వారి భూములను తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మనీలాండరింగ్ కేసులో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)లు మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు.దాదాపు 14 నెలల తర్వాత ఈ కేసులో లాలూ యాదవ్ విచారణకు ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ 2024, జనవరి 20 న లాలూ యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేయగా, గత ఏడాది జనవరి 30న తేజస్వి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది. అప్పుడు కూడా ఆర్జేడీ నేతలు ఈడీ విచారణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. మరోవైపు దర్యాప్తులో తమ కుటుంబం పూర్తిగా ఈడీకి సహకరిస్తోందని లాలూ కుమార్తె, పాటలీపుత్ర ఎంపీ మిసా భారతి తెలిపారు.‘ల్యాండ్ ఫర జాబ్’ కేసును ఈడీతోపాటు సీబీఐ కూడా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ 2022 మే 18న ఈ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ గత ఏడాది చార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులో లాలూ, రబ్రీ, వారి ఇద్దరు కుమార్తెలు సహా మొత్తం 11 మంది నిందితులుగా ఉండగా, సీబీఐ మొత్తం 78 మందిని నిందితులుగా చేర్చింది. రెండు కేసుల్లో లాలూ కుటుంబానికి కోర్టు నుండి బెయిల్ లభించింది.ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా -
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం!
హైదరాబాద్: యూట్యూబర్లు, పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిసున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వాళ్ల సంపాదన, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఆరా తీసిన ఈడీ.. వాళ్లకు జరిగిన చెల్లింపుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా 11 మంది వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీలాండరింగ్, హవాలా రూపంలో నగదు చెల్లింపులు జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు వాళ్లు కొంత గడువు కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి -
లాలూ, రబ్రీ, తేజ్ ప్రతాప్‌లకు ఈడీ సమన్లు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)కు ఇప్పట్లో కష్టాలు తీరేలా కనిపించడంలేదు. లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసి, విచారణకు పిలిచింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భూమికి ప్రతిగా ఉద్యోగం కుంభకోణానికి సంబంధించిన కేసులో వారిని విచారించేందుకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిని పట్నాలో విచారించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు అతని భార్య రబ్రీ దేవి(Rabri Devi), పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ లకు ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 19న లాలూ యాదవ్‌ను విచారణకు పిలిచారు. ఈ విచారణ పట్నా జోనల్ కార్యాలయంలో జరగనుంది. ‘భూమికి ప్రతిగా ఉద్యోగం’ కుంభకోణంపై లాలూను విచారించనున్నారు. ఈ ఉదంతంలో మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో లాలూ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై గత ఏడాది ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఆయన కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లతో పాటు మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు.ఇది కూడా చదవండి: దర్గాలోకి బూట్లతో వచ్చిన విదేశీ విద్యార్థులపై దాడి -
లీలావతి ఎవరు? ఆమె పేరుతో ఉన్న ఆస్పత్రి ఎందుకు చిక్కుల్లో పడింది?
ముంబై: మహానగరం ముంబైలోని సుప్రసిద్ధ లీలావతి హాస్పిటల్(Lilavati Hospital) గురించి ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటారు. ముంబైలోని ప్రముఖులైవరైనా అనారోగ్యానికి గురైనప్పుడు లీలావతి ఆస్పత్రిలో చేరారనే వార్తలను మనం అప్పుడప్పుడూ వినేవుంటాం. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురైనప్పుడు, ఆయనను చికిత్స కోసం లీలావతి ఆస్పత్రిలోనే చేర్చారు. ఇప్పుడు ఈ ఆస్పత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. దీనిని నడుపుతున్న ఛారిటబుల్ ట్రస్ట్ అవినీతికి పాల్పడిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఈ ఛారిటబుల్ ట్రస్ట్ ఇటీవల.. ఇదే ట్రస్ట్‌కు చెందిన మాజీలు, సంబంధిత వ్యక్తులు రూ. 1,500 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ ఉదంతంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (ఎల్కేఎంఎంటీ)తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు వేర్వేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త కీర్తిలాల్ మెహతా(diamond businessman Kirtlal Mehta) తన భార్య లీలావతి మెహతా పేరు మీద ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఇందుకోసం ఆయన లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌ను నెలకొల్పారు. లీలావతి ఆస్పత్రికి 1997లో పునాది వేశారు. ముంబైలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా ఈ ఆస్పత్రి ఏర్పాటయ్యింది. దీనిలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారు. కీర్తిలాల్ మెహతా 2002లో అనారోగ్యానికి గురయ్యారు.దీంతో ఆయన సోదరుడు విజయ్ మెహతా ట్రస్ట్ పగ్గాలు చేపట్టారు.2006లో విజయ్ మెహతా తన కొడుకు, మేనల్లుళ్లను అక్రమంగా ట్రస్టీలుగా చేసి, కిషోర్ మెహతాను శాశ్వత ట్రస్టీ పదవి నుంచి తొలగించారనే ఆరోపణలు వినిపించాయి. అయితే 2016లో కిషోర్ మెహతా తిరిగి ట్రస్టీ అయ్యారు. ఆయన ఈ బాధ్యతలను ఎనిమిది సంవత్సరాలు పాటు నిర్వహించారు. 2024లో కిషోర్ మెహతా మరణానంతరం అతని కుమారుడు ప్రశాంత్ మెహతా శాశ్వత ట్రస్టీగా మారి, ఆసుపత్రి ఆర్థిక రికార్డులను ఆడిట్(Audit) చేయించారు. ఈ నేపధ్యంలో పలు అక్రమాలు వెలుగు చూశాయి. ఇప్పుడు దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఇది కూడా చదవండి: ఐస్ బాత్ థెరపీ అంటే ఏమిటి? వ్యాయామం తరువాత ఎందుకు చేస్తారు? -
రన్యా రావు ఇళ్లపై ఈడీ దాడులు
బనశంకరి: బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యా రావు, ఆమె సన్నిహితుల ఇళ్లలో గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేపట్టింది. బెంగళూరులోని ల్యావెల్లి రోడ్డులోని రన్యా రావు ఇల్లు, కోరమంగళ, జయనగర, బసవనగుడి తదితర ప్రాంతాల్లోని ఆమె బంధుమిత్రుల నివాసాల్లో అధికారులు సోదాలు జరిపారు. రన్యా రావు విదేశాలకు వెళ్లడానికి విమానం టికెట్లు బుక్ చేసింది ఎవరు, ఈ టూర్లకు సాయం చేసిందెవరు, ఆమె వ్యవహారాల్లో ఎవరెవరి పాత్ర ఎంత? అనే విషయాలను తేల్చడానికి ఈ సోదాలు జరిపిన అధికారులు కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. బంగారం దందా చాలా పెద్దస్థాయిలో, దేశవ్యాప్తంగా ఉండి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. రన్యా రావును కస్టడీలో విచారించిన డీఆర్ఐ అధికారులు ఆమె ఆప్తుడు, పారిశ్రామికవేత్త తరుణ్ రాజ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఆమెపై డీఆర్ఐ కేసు నమోదుచేసి విచారిస్తుండగా, సీబీఐ రంగంలోకి దిగడం తెలిసిందే. ఈ రెండింటి ఆధారంగా తాజాగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నెల 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచి్చన రన్యా రావు వద్ద డీఆర్ఐ అధికారులు రూ.12.56 కోట్ల విలువైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకోవడం తెల్సిందే. -
Lilavati Hospital రూ. 1,200 కోట్ల స్కామ్, చేతబడులు : సంచలన ఆరోపణలు
భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన, ప్రసిద్ధి చెందిన ఆసుపత్రులలో ఒకటి లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ . 1978లో నాలుగు దశాబ్దాల క్రితం ముంబైలో స్థాపించిన ఐకానిక్ హాస్పిటల్‌పై పెద్ద దుమారం రేగుతోంది. లీలావతి హాస్పిటల్ ట్రస్టీలు బ్లాక్ మ్యాజిక్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారంటూ జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.మనీకంట్రోల్ నివేదిక ప్రకారం ముంబైలోని ప్రతిష్టాత్మక లీలావతి హాస్పిటల్ (Lilavati Hospital)ను నిర్వహిస్తున్న లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్‌పై ట్రస్ట్‌లోని కొంతమంది . మాజీ ట్రస్టీలు దిగ్భ్రాంతికరమైన ఆర్థిక కుంభకోణం ఆరోపణలను గుప్పించారు అంతేకాదు రూ. 1,200 కోట్ల కుంభకోణం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఆరోపణలలో మోసపూరిత ఆర్డర్లు, నిధుల దుర్వినియోగం నకిలీ సేకరణ లాంటివి ఉన్నాయి. ఫోర్జరీ, మోసం , పన్ను ఎగవేత ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసుపత్రి కొనుగోళ్లకు సంబంధించి థర్డ్-పార్టీ డిస్ట్రిబ్యూటర్లతో అక్రమాలకు పాల్పడటం ద్వారా రూ.1,200 కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించింది ట్రస్ట్‌లో సుదీర్ఘ న్యాయ పోరాటంలో భాగంగా ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వ్యవస్థాపకుడి సోదరుడు విజయ్ మెహతా చేపట్టిన చర్యల్లో భాగంగా కిషోర్ మెహతా కుమారుడు ప్రశాంత్ మెహతా నేతృత్వంలో జరిగిన ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తృతమైన ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయని ఫిర్యాదు దారులు ఆరోపణ. ఈ విషయంలో లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కి , బాంద్రా పోలీస్ స్టేషన్లో విడివిడిగా ఫిర్యాదులు చేసింది. ఆసుపత్రి ప్రాంగణంలో పూర్వపు ట్రస్టీలు చేతబడులు (black magic) చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మానవ వెంట్రుకలు, బియ్యం, ఎముకలతో నిండిన ఎనిమిది కలశాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రశాంత్ మెహతా , అతని తల్లి చారు మెహతా కార్యాలయంలో బ్లాక్ మ్యాజిక్ చేసినట్టు ఆరోపణలొచ్చాయని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు."మేము ఆడిట్లు చేపట్టాము మరియు ఫోరెన్సిక్ ఆడిటర్లు ఐదు కంటే ఎక్కువ నివేదికలను సమర్పించారు, ఇది ఈ చట్టవిరుద్ధమైన ట్రస్టీల బృందం రూ. 1,500 కోట్లకు పైగా డబ్బును స్వాహా చేసి దుర్వినియోగం చేసిందని స్పష్టంగా పేర్కొంది. ఈ డబ్బును మాజీ ట్రస్టీలు స్వాహా చేశారు, వీరిలో ఎక్కువ మంది NRIలు మరియు దుబాయ్ మరియు బెల్జియం నివాసితులు," అని LKMMT శాశ్వత నివాసి ట్రస్టీ ప్రశాంత్ మెహతా విలేకరులకు తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లతో పాటు, గుజరాత్‌లోని లీలావతి ఆసుపత్రి నుండి విలువైన వస్తువుల దొంగతనం కేసులో మరో కేసు దర్యాప్తులో ఉందని మెహతా తెలిపారు .PMLA (మనీలాండరింగ్ నిరోధక చట్టం) నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగంగా స్పందించి, తగిన చర్య తీసుకోవాలని ఆయన కోరారు.ఇదిలా ఉండగా, ఆసుపత్రి మాజీ ట్రస్టీలు ముగ్గురుపై నమోదైన రూ.85 కోట్ల మోసం కేసుపై ముంబై పోలీసుల EOW దర్యాప్తు ప్రారంభించిందని అధికారులు మంగళవారం తెలిపారు .LKMMT ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబర్ 30న బాంద్రా పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు EOWకి బదిలీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.లీలావతి హాస్పిటల్లీలావతి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం. 1997లో లీలావతి హాస్పిటల్ కేవలం 10 పడకలు , 22 మంది వైద్యులతో ప్రారంభమైంది. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్లో 323 పడకలు, అతిపెద్ద ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో (ICUలు) ఒకటి, 300 కంటే ఎక్కువ మంది కన్సల్టెంట్లు, సుమారు 1,800 ఉద్యోగుల బృందంతోపాటు, ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతతో 12 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి.ఒకే రోజులో, లీలావతి హాస్పిటల్ దాదాపు 1,500 మంది అవుట్ పేషెంట్లు , 200 మంది ఇన్ పేషెంట్లకు హాజరవుతారు, "సర్వేత్ర సుఖినః: సంతు, సర్వే సంతు నిరామయా", అంటే "అందరూ ఆనందంగా ... ఆరోగ్యంగా ఉండాలి", అనే నినాదంతో సేవలందిస్తోంది.కీర్తిలాల్ మెహతా ,అతని భార్య లీలావతి మెహతా 1997లో ఈ ఆసుపత్రిని స్థాపించారు. 1978లో, కీర్తిలాల్ మెహతా లీలావతి కీర్తిలాల్ మెహతా మెడికల్ ట్రస్ట్ (LKMMT) అనే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించారు. కీర్తిలాల్ మెహతా కుమారుడు కిషోర్ మెహతా హాస్పిటల్ ప్రాజెక్ట్‌ను రూపొందించి,దీని రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కిషోర్ మెహతా మరణం తరువాత, అతని భార్య చారు మెహతా ఈ ఆసుపత్రి బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఈ ట్రస్టీల మధ్య గత కొన్నేళ్లు వివాదాలు, కేసులు నడుస్తున్నాయి. -
మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. కాంగ్రెస్ నేతల్లో టెన్షన్!
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భాఘేల్, ఆయన కుమారుడి చైతన్య భాఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తున్నారు. మనీ లాండరింగ్ కేసు విషయమై 14 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో, మాజీ సీఎం నివాసం వద్దకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు వచ్చి చేరుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా మాజీ సీఎం భూపేశ్ భాఘేల్, ఆయన కుమారుడి నివాసాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ సీఎం బంగ్లాలో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈడీ సోదాల నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుదారులు మాజీ సీఎం ఇంటికి వద్దకు భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా భద్రత కోసం హాజరైన సీఆర్పీఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.VIDEO | ED raids Congress leader Bhupesh Baghel's premises in Bhilai as part of a money laundering investigation against his son - Chaitanya Baghel - in an alleged liquor scam case.Chaitanya Baghel shares the Bhilai accommodation with his father and hence the premises are being… pic.twitter.com/AdUWic1y26— Press Trust of India (@PTI_News) March 10, 2025కేసు ఇదీ..ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది. రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్ స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (CSMCL) షాపుల నిర్వహణ, నగదు వసూలు, బాటిల్ తయారీ, హాలోగ్రామ్ తయారీ కోసం టెండర్లు పిలుస్తుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులు, సీఎస్‌ఎమ్‌సీఎల్ కమీషనర్, ఎండీల సహకారంతో తన సన్నిహితులైన వికాస్ అగర్వాల్, అర్వింద్ సింగ్‌లతో కలిసి బాటిల్ తయారీ నుంచి మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.తర్వాత మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. #WATCH | Chhattisgarh | Enforcement Directorate (ED) is conducting searches at the residence of former Chief Minister and Congress leader Bhupesh Baghel's son in an ongoing money laundering case. (Visuals from Durg) pic.twitter.com/k5Gmgew4K4— ANI (@ANI) March 10, 2025 -
ఫాల్కన్ స్కాం కేసులో కీలక పరిణామం
-
పేటీఎంకు ఈడీ నోటీస్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాతృ సంస్థ ‘వన్ 97 కమ్యూనికేషన్స్’కు (ఓసీఎల్) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసు జారీ చేసింది. వన్97 కమ్యూనికేషన్స్‌తోపాటు, సంస్థ చైర్మన్, ఎండీ విజయ్ శేఖర్ శర్మ, సబ్సిడరీ కంపెనీలైన లిటిల్ ఇంటర్నెట్, నియర్‌బై ఇండియాకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.611 కోట్ల విలువకు సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్టు దర్యాప్తులో తేలడంతో న్యాయపరమైన చర్యలకు ముందు ఈడీ స్పెషల్ డైరెక్టర్ ఈ నోటీసు జారీ చేశారు. నియంత్రణ ప్రక్రియలు, చట్టబద్ధమైన మార్గా ల్లో ఈ సమస్యను పరిష్కరించుకుంటామని పేటీఎం అధికార ప్రతినిధి ప్రకటించారు. ఓసీఎల్ సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టి, విదేశాల్లో సబ్సిడరీ ఏర్పాటు విషయాన్ని ఆర్బీఐకి వెల్లడించలేదని దర్యాప్తులో గుర్తించినట్టు ఈడీ ప్రకటించింది. ఆర్బీఐ నిర్దేశిత ధరల మార్గదర్శకాలను అనుసరించకుండా, ఓసీఎల్ సబ్సిడరీ అయిన లిటిల్ ఇంటర్నెట్ ప్రైవేటు లిమిటెడ్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అందుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ రెండు కంపెనీలను తాము 2017లో దక్కించుకున్నామని, వీటికి సంబంధించి నిబంధనల ఉల్లంఘన తమ సబ్సిడరీలు కాకముందు జరిగినవిగా పేటీఎం స్పష్టత ఇచి్చంది. పేటీఎం షేరు ఎన్ఎస్ఈలో 4% పడి, ఇంట్రాడే కనిష్టానికి (రూ.684) దిగజారింది. చివరికి 2 శాతం లాభంతో రూ.729 వద్ద ముగిసింది. -
ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ డ్రగ్స్ దందా కేసులో రూ.7.98 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) నిబంధనల మేరకు చేపట్టిన ఈ తాత్కాలిక జప్తులో 22 స్థిర, 8 చరాస్తులున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో నిందితుడు ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న రూ.6.52 కోట్ల విలువైన భూములు, రూ.1.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు సీజ్ చేసినట్లు ఈడీ బుధవారం పేర్కొంది. హైదరాబాద్ దోమలగూడలోని జేఆర్ ఇన్ఫినిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆశిష్ జైన్ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు 2022లో ఎన్సీబీ అధికారులు గుర్తించారు. ఆశిష్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించి, రూ.3.72 కోట్ల నగదుతో పాటు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఇతర ఎల్రక్టానిక్ గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2022, మే 4న ఎన్సీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. జేఆర్ ఇన్ఫినిటీ, ఆశిష్ జైన్, అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికా తదితర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించింది. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా రహస్యంగా కంపెనీ ఆన్లైన్లో ఫార్మా మందులతో పాటు జేఆర్ ఇన్ఫినిటీ పేరుతో అక్రమ దందా నడుపుతున్నట్లు తెలుసుకుంది. మెయిల్స్, వీఓఐపీ ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్స్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేసేవారని, క్రెడిట్ కార్డు, బిట్ కాయిన్స్ ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయని గ్రహించింది. అ్రల్ఫాజోలం, జోల్పిడెమ్, లోరాజెపామ్, క్లోనాజెపామ్, హైడ్రోకోడోన్, ఆక్సికోడోన్ తదితర సైకోట్రోపిక్ పదార్థాలను ట్యాబ్లెట్ల రూపంలో చట్టవిరుద్ధంగా ఎగుమతి చేస్తున్నారని విచారణలో తేలింది. జేఆర్ ఇన్ఫినిటీ ఏర్పాటుకు ముందే ఆశిష్‌జైన్, అతని కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.4.50 కోట్లు విదేశాల నుంచి వచి్చనట్లు తేల్చారు. ఇలా రూ.12.76 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లకు, స్థిరాస్తుల కొనుగోలుకు వె చ్చించినట్లు ఈడీ పేర్కొంది. -
రోబో సినిమా ఎఫెక్ట్.. దర్శకుడు శంకర్ రూ.10 కోట్ల ఆస్తులు జప్తు
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. తన దర్శకత్వం వహించిన రోబో సినిమా విషయంలో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ జప్తు చేసింది.మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన కేసులలో ఇలా స్థిరాస్తులను ఎటాచ్ చేయడం ఇదే తొలిసారని ఈడీ అధికారులు పేర్కొంటున్నారు.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ రోబో. శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సైంటిఫిక్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. అయితే, ఈ కథను ‘జిగుబా’ను కాపీ కొట్టిసినిమా తెరకెక్కించారంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాపీరైట్ చట్టాన్ని ఆయన ఉల్లంఘించారని పిటిషన్లో తెలిపారు. ఈ కేసు విషయంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) నివేదిక శంకర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఈ క్రమంలో జిగుబా కథకు, రోబో సినిమాకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.2010లో రోబో రిలీజైన విషయం తెలిసిందే. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సుమారు రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా కోసం డైరెక్టర్ శంకర్ రెమ్యునరేషన్‌గా రూ.11.5 కోట్లు తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
‘ఫాల్కన్’పై ఈడీ కన్ను
సాక్షి, హైదరాబాద్: అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి ఏకంగా రూ.850 కోట్లు దోచుకున్న ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (ఎఫ్ఐడీ) కేసుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేపట్టనుంది. మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో సుమారు 7 వేల మంది నుంచి డిపాజిట్లను సేకరించి.. ఆ సొమ్మును సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి దేశాల్లోని షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసుల దర్యాప్తులో తేలింది. మనీలాండరింగ్ ఉల్లంఘనల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఈడీకి లేఖ రాసినట్లు తెలిసింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి కొడుకే.. ప్రధాన నిందితుడు ఎఫ్ఐడీ చైర్మన్ అమర్దీప్ కుమార్ బిహార్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడని పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో స్థిరపడిన అమర్ కుటుంబం బహుళజాతి కంపెనీలకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అందించే సంస్థను స్థాపించడం ద్వారా అమర్దీప్ వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఈ ఏజెన్సీకి దేశవ్యాప్తంగా 20,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. 2020లో అమర్దీప్ ఎఫ్ఐడీ సంస్థను స్థాపించి, అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సామాన్యుల నుంచి డిపాజిట్లను సేకరించడం మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న అమర్, సీఈఓ యోగేందర్ సింగ్, సీఓఓ ఆర్యన్ సింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. లుక్ ఔట్ సర్క్యులర్‌ను సైతం జారీ చేశారు. సామాన్యుల నుంచి సేకరించిన డిపాజిట్లను మళ్లించేందుకు నిందితులు కాయిన్ ట్రేడ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యుకియో రిసార్ట్, ప్రెస్టిజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టిస్ వంటి 15 షెల్ కంపెనీలను స్థాపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. డిపాజిట్లను క్రిప్టోకరెన్సీతో సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి విదేశాల్లోని ఈ షెల్ కంపెనీలకు మళ్లించినట్లు తేల్చారు. అక్కడ్నుంచి నిందితుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు సొమ్ము చేరినట్లు గుర్తించారు. -
Supreme Court: నిందితుల్ని జైల్లోనే ఉంచడానికి పీఎంఎల్ఏ కేసులా?
న్యూఢిల్లీ: నిందితులను జైలులో ఉంచడానికి మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ)ను ఉపయోగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వరకట్న చట్టం మాదిరిగా పీఎంఎల్ఏ నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పతి త్రిపాఠీకి బుధవారం బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. త్రిపాఠీపై చేసిన ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా జైలులోనే ఉంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘ఓ వ్యక్తిని జైలులో ఉంచేందుకు పీఎంఎల్ఏను వాడుకోరాదు. ఆరోపణలను కోర్టు కొట్టివేసిన తర్వాత కూడా ఆయన్ను విడుదల చేయకుండా జైలులో ఉంచడాన్ని ఏమనాలి?. సెక్షన్ 498ఏ కింద పెళ్లయిన మహిళలు భర్త, అతడి కుటుంబీకులపై కట్నం వేధింపుల కేసులు ఎడాపెడా పెట్టినట్లే పీఎంఎల్ఏను కూడా దుర్వినియోగం చేయాలనుకుంటున్నారా?’అంటూ తలంటింది. ఇందుకు కారణమైన అధికారులకు సమన్లు జారీ చేస్తామంది. అయితే, సాంకేతికపరమైన కారణాలతో నేరగాళ్లకు బెయిలివ్వడం సరికాదని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈడీ తరఫున వాదించారు. -
ఈడీ విచారణ జరిపించాల్సిందే: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్‌రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్‌సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహంఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్‌సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు. -
ఈడీకి లక్ష జరిమానా- ప్రజలను వేధించొద్దని బాంబే హైకోర్టు హితవు
-
ఈడీకి రూ. లక్ష ఫైన్
ముంబై: బాంబే హైకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తిపై అనవసరంగా మనీలాండరింగ్ కేసును చేపట్టినందుకు ఈడీని మందలించింది. ఈ కేసులో హైకోర్టు ఈడీకి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.ఎటువంటి బలమైన కారణం లేకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్‌పై మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టిన నేపధ్యంలో బాంబే హైకోర్టు ఈడీకి జరిమానా విధించింది. ఈ సందర్భంగా కేంద్ర సంస్థలు చట్ట పరిధిలో పనిచేయాలని హైకోర్టు పేర్కొంది. పౌరులు అనవసరంగా వేధింపులకు గురికాకుండా ఉండేందుకు చట్ట అమలు సంస్థలకు సందేశం పంపాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.వివరాల్లోకి వెళితే రాకేష్ జైన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్(Real estate developer)పై నిబంధనల ఉల్లంఘన, మోసం ఆరోపణలపై ఒక ఆస్తి కొనుగోలుదారు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదు విలే పార్లే పోలీస్ స్టేషన్లో నమోదైంది. దీని ఆధారంగా రాకేష్ జైన్‌పై మనీలాండరింగ్ కేసును నమోదు చేసి, ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు ఆగస్టు 2014 నాటిది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక కోర్టు 2014 ఆగస్టులో నోటీసు జారీ చేసింది. తాజాగా మంగళవారం (జనవరి 21) ఈ కేసులో రాకేష్ జైన్‌పై ప్రత్యేక కోర్టు జారీ చేసిన నోటీసును హైకోర్టు రద్దు చేసింది.జస్టిస్ జాదవ్ మాట్లాడుతూ ఇప్పుడు తనముందున్న కేసు.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(Anti-Money Laundering Act) అమలు ముసుగులో వేధింపులకు సంబంధించిన కేసుగా కనిపిస్తోందన్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారునితో పాటు ఈడీ కూడా దురుద్దేశంతో చర్యలు చేపట్టిందని స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. ఇందుకు కఠినమైన శిక్ష విధించాలన్నారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలు చట్ట పరిధిలోనే వ్యవహరించాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇలా పౌరులను వేధించడం తగదని సూచించింది.ఇది కూడా చదవండి: Delhi Elections-2025: 12 ఎస్సీ సీట్లు.. విజయానికి కీలకం -
సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ముడా ఉచ్చు?
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ముడా (muda scam) స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో (cm siddaramaiah) పాటు ఇతరులకు చెందిన రూ.300 కోట్ల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) ప్రకటించింది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని ఈడీ అటాచ్ చేసుకుంది. అటాచ్ చేసిన ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లుగా పనిచేస్తున్న వివిధ వ్యక్తుల పేరిట రిజిస్టరయినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా.. ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి భారీ లబ్ధి కలిగిన విషయాన్ని కూడా ఈడీ స్పష్టం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతి నుంచి ముడా 3 ఎకరాల 16 గుంటల భూమిని మొదట రూ.3,24,700కు సేకరించిందని తెలిపింది. ఆ తర్వాత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను పరిహారంగా ఇచ్చిందని, వీటి విలువ రూ.56 కోట్లు ఉంటుందని వెల్లడించింది. బినామీల పేరుతో బీఎం పార్వతికి అక్రమంగా ముడా భూముల్ని కేటాయించడంలో నాటి ముడా మాజీ కమిషనర్ డిబి నటేష్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది.బీఎం పార్వతితో పాటు పలువురు రియల్ ఎస్టేట్వ్యాపారులకు స్థలాల్ని కేటాయించినట్లు తేల్చింది. ఫలితంగా ఆ స్థలాల్ని భారీ మొత్తానికి అమ్మేలా ఒప్పందం జరిగినట్లుగా ఆధారాల్ని స్వాధీనం చేసుకుంది. ముడా ప్లాట్ల కేటాయింపు ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల బినామీలతో పాటు డమ్మీ వ్యక్తుల పేరు మీద జరిగినట్లు ఈడీ ఆరోపించింది.సోదాల్లో తమకు ప్లాట్లు కేటాయించినందుకు ప్రతిఫలంగా పలువురు అప్పటి ముడా చైర్మన్, ముడా కమీషనర్‌కు భారీ మొత్తంలో స్థిరాస్తుల్ని కట్టబెట్టినట్లుగా తమకు పలు ఆధారాలు లభించినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.కాగా, గతంలో ముడా కమిషనర్‌గా పనిచేసిన జీటీ దినేష్‌కుమార్ బంధువుల పేరిట ఆస్తులు, లగ్జరీ వాహనాలు ఇతర కొనుగోళ్లకు సంబంధించి సహకార సంఘం ద్వారా డబ్బు మళ్లించినట్లు తేలిందని ఈడీ ఆరోపించింది.ఏమిటీ ముడా వివాదం? సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కేటాయింపు వివాదానిది మూడు దశాబ్దాల పై చిలుకు నేపథ్యం. మైసూరు జిల్లా కెసెరె గ్రామంలో సీఎం భార్య పార్వతికి 3 ఎకరాల 16 గంటల భూమి ఉంది. దేవనార్ 3ఫేజ్ లేఔట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. పరిహారంగా 50:50 నిష్పత్తి పథకం కింద 2021లో మైసూర్‌లోని ఖరీదైన విజయనగర ప్రాంతంలో ఏకంగా 14 ఖాళీ ప్లాట్లను కేటాయించింది.‘‘పార్వతి నుంచి తీసుకున్న భూమి కంటే వీటి విలువ ఏకంగా రూ.45 కోట్లు ఎక్కువ. 50: 50 పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను సొంతం చేసుకుంది’’ అంటూ అబ్రహాం అనే ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి బహుమతిగా ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పగా ఇతరుల భూమిని అక్రమంగా లాక్కున్నట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2014లో పార్వతి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు సిద్ధరామయ్యే సీఎం. ఆమెకు ప్లాట్లు కేటాయించాలని 2017లో ముడా నిర్ణయించింది.ఇది కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని విపక్షాలంటున్నాయి. సిద్ధరామయ్య మాత్రం, ‘‘నేను సీఎంగా ఉన్నంతకాలం పరిహారమివ్వడం కష్టమని అధికారులు చెప్పారు. 2021లో బీజేపీ హయాంలో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ప్లాట్లు కేటాయించారు’’ అని వాదిస్తున్నారు. -
హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?... ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
-
నిధులెందుకు మళ్లించారు?.. కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ) ఖాతాల్లోకి హెచ్ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?, రేస్ నిర్వహణ ఒప్పందాలను అతిక్రమించి ఎఫ్ఈఓకు డబ్బులు చెల్లించాలని మీరు ఎందుకు ఆదేశించారు?, ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతి లేకుండానే నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా?, విదేశీ కంపెనీకి నగదు చెల్లింపులో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఈసీ అనుమతి తీసుకోవాలని మీకు తెలియదా?, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చేకూరిన లబ్ధి ఏంటి?.. అంటూ మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు ఏడు గంటలపాటు విచారణ కొనసాగింది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ 10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ను అధికారులు సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయించారు. అనంతరం మూడో అంతస్తులో జేడీ రోహిత్ ఆనంద్ ముందు ఓ న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నించింది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం 5–30 గంటల వరకు విచారణ కొనసాగింది. రెండు డాక్యుమెంట్లు సమర్పించిన కేటీఆర్ఈ నెల 8, 9వ తేదీల్లో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అందజేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఆరా తీయగా, అన్నీ అందిస్తానని కేటీఆర్ తెలిపారు. అలాగే ఈడికి రెండు డాక్యుమెంట్లను (ఫార్ములా–ఈ పైన నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ –2020) ఇచ్చిన కేటీఆర్ అందుకు సంబంధించి వారి నుంచి రశీదు తీసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేసినట్లు వెల్లడివిశ్వసనీయ సమాచారం మేరకు.. కేటీఆర్ చాలా ప్రశ్నలకు విపులంగా సమాధానం ఇవ్వగా..నిధుల మళ్లింపు అంశం, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందన్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేశారు. మరికొన్నింటికి ముక్తసరిగా జవాబులిచ్చారు. మంత్రిగా తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఎఫ్ఈఓకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఎఫ్ఈవోకు చెల్లింపులు జరిపామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన రూ.45.71 కోట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలన్నీ అధికారులు రికార్డ్ చేసినట్టు సమాచారం. ఎఫ్ఈఓ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేక ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ కార్ రేస్ ఫార్ములాను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా? అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈవెంట్ నిర్వహణకు స్పాన్సర్‌గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం. పటిష్ట బందోబస్తు .. ఉద్రిక్తతకేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్దపెట్టున జై తెలంగాణ నినాదాలతో ఆయన వాహనం వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, మన్నె క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5–30 గంటలకు కేటీఆర్ తిరిగి వెళ్లే సమయంలోనూ కొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడే ఉండి జై తెలంగాణ నినాదాలు చేశారు. -
లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు(Formula E Car Race Case)లో కేటీఆర్(KTR) ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీపైనే కేటీఆర్‌ను ఈడీ(ED) ప్రశ్నించింది. విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అడిగిన ప్రశ్ననే పదేపదే అడిగారు. ఎన్ని సార్లు అయినా విచారణకు వస్తానని చెప్పా. రేవంత్‌పై ఏసీబీ కేసు ఉందని.. నాపై ఏసీబీ కేసు బనాయించారు. రేవంత్‌పై ఈడీ కేసు ఉందని.. నాపై ఈడీ కేసు బనాయించారు.’’ అని ఆయన మండిపడ్డారు‘‘న్యాయ స్థానాలపై మాకు విశ్వాసం ఉంది. లైడిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్ సిద్ధమా?. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎన్ని ప్రశ్నలు అడిగిన సమాధానం చెబుతా. నేను ఎలాంటి తప్పు చేయలేదు’’ అని కేటీఆర్ చెప్పారు.‘‘భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని, చట్టాలను గౌరవించే పౌరుడిని.. ఏ తప్పు చేయకపోయినా అవినీతికి పాల్పడకపోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి ఈ రోజు విచారణకు పిలిస్తే హాజరయ్యాను. రెండు సంస్థలు కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి.ఇదీ చదవండి: ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్..రెండు సంస్థలు ఎన్నిసార్లు పిలిచినా వస్తా. ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్తా. పూర్తిగా విస్తరణ సహకరిస్తాను అని చెప్పాను. తప్పకుండా నా నిజాయితీని రుజువు చేసుకుంటానని చెప్పాను. ఈ విచారణకు దాదాపు 5 నుంచి 10 కోట్లు ఖర్చు అవుతుంది. నేను నిజాయితీపరుడ్ని.. ధైర్యంగా ఎదుర్కొంటా. 10 కోట్ల రూపాయలతో రైతులకు రుణమాఫీ చేయొచ్చు. పెన్షన్ ఇయ్యొచ్చు. రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే జడ్జి ముందు కూర్చుందాం. మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి న్యాయమూర్తి ముందు కూర్చుంటాం.. ఇద్దరికీ లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. ఒక 50 లక్షల రూపాయలతో ఓడిసిపోతుంది విచారణ. అనవసరంగా 10 కోట్ల ఖర్చు ఎందుకు?’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
ఈడీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ.. కేటీఆర్ ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్స్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ‘‘జైలుకు వెళ్లడానికి కేటీఆర్ సిద్ధమవ్వాలి. 4 జతల డ్రెస్‌లు, టవల్, బ్లాంకెట్, హ్యాండ్ కర్చీఫ్. సోప్, అవకాయ, స్వెటర్ దగ్గర పెట్టుకోవాలి. అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే తిరిగి కర్మ రూపంలో మనం అనుభవించాల్సి వస్తుంది’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.జైలుకు వెళ్లే ముందు 4 జతల బట్టలు (కటకటాల వెనుక కూడా ఫ్యాషన్ కీలకం), ఒక హాయిగా ఉండే వెచ్చని దుప్పటి, టవల్ (జైలులో కూడా పరిశుభ్రత ముఖ్యం), కర్చీఫ్(భావోద్వేగాలు అదుపు తప్పినప్పుడు), సబ్బులు(ఆ "క్లీన్ ఇమేజ్"ని కొనసాగించడానికి), ఒక ప్యాకెట్ ఊరగాయ(ఎందుకంటే జైలు భోజనం ఫైవ్ స్టార్ కాదు) తీసుకెళ్లండి.. స్వెటర్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటూ కేటీఆర్‌కు రాజా సింగ్ చురకలు అంటించారు.ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్.. Karma doesn’t forgetI have been thrown in jail by both the Congress and BRS/TRS governments after they filed false cases against me. I know exactly how the game works.So, @KTRBRS ji, here’s a little checklist to pack before heading to jail:👉Four sets of clothes – fashion…— Raja Singh (@TigerRajaSingh) January 16, 2025 -
ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్
-
ఫార్ములా ఈ-రేస్ కేసులో కొనసాగుతున్న కేటీఆర్ ఈడీ విచారణ
-
Watch Live: ఈడీ ముందుకు కేటీఆర్
-
కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం..
ముగిసిన కేటీఆర్ ఈడీ విచారణదాదాపు 7 గంటల పాటు కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీఫార్ములా- ఈ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ ఫార్ములా ఈ–కార్ రేసు కేసులో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుటకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్. కొనసాగుతున్న విచారణ.. ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటుగా విచారణ కొనసాగుతోందిమరోవైపు.. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన నెలకొంది. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత..కేటీఆర్ విచారణ సందర్బంగా ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు.జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసు వాహనాలల్లో వారిని తరలించారు. కేటీఆర్ విచారణ ప్రారంభం..ఈడీ ఆఫీసులో కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. ఈడీ ఆఫీసులో విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ విచారణ కోసం ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈడీ ఆపీసు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మరోవైపు, ఈడీ ఆఫీసు వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈడీ ఆఫీసుకు బయలుదేరిన కేటీఆర్గచ్చిబౌలి నివాసం నుంచి బయల్దేరిన కేటీఆర్మరికాసేపట్లో ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం!ఏసీబీ విచారణ ముందు.. నందినగర్ నివాసంలో కీలక నేతలతో నేతలు చర్చలు జరిపిన కేటీఆర్ఇవాళ్టి విచారణకు మాత్రం గచ్చిబౌలి నివాసం నుంచే ఈడీ ఆఫీస్‌కు..ఈడీ విచారణ వేళ ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందిఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ- మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందిఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవుమంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాదును పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తానుఫార్ములా-ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది...ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్, నిబద్ధత, హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలిఅందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానురాష్ట్ర ప్రభుత్వం పంపిన 46 కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది.కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందిఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతినయా పైసాకు లెక్క ఉందిమరి అలాంటి అప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్ ఎక్కడ ఉంది?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందిఇలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతుందికచ్చితంగా ఈ అంశం లో నిజమే గెలుస్తుంది... ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయిఅప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఒంటరిగానే..ఈడీ విచారణకు కేటీఆర్(KTR) లాయర్లకు అనుమతి నిరాకరణ కేటీఆర్ ఒక్కరే విచారణకు హాజరుఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ రగడకోర్టు అనుమతితో చివరకు లాయర్‌ను ఏసీబీ విచారణకు వెంట తీసుకెళ్లిన కేటీఆర్గతంలో ఇచ్చినా..కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ ఆఫీసు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో.. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుల్లో ఫెమా(FEMA) ఉల్లంఘనలు జరిగాయనే కోణంలో ఈడీ దర్యాప్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు చెల్లించడంపై దర్యాప్తు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ ఎన్ రెడ్డిల విచారణ పూర్తిగత వారమే కేటీఆర్‌ను విచారించాల్సి ఉండగా.. హైకోర్టు తీర్పు నేపథ్యంతో గడువు కోరిన కేటీఆర్దీంతో ఇవాళ(జనవరి 16న) విచారణకు రమ్మని పిలిచిన ఈడీతప్పని పరిస్థితిఈడీ అధికారుల ముందు ఎలాంటి వాదన వినిపించాలన్నది కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడానికి ప్రత్నించడం తప్ప.. తాను ఇందులో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఆయన వాదిస్తున్నారు. మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా.. నియమ నిబంధనల మేరకు నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని ఈడీ ముందు చెబుతారా? అనే అసక్తి నెలకొంది.మరోసారి ఏసీబీ నోటీసులు..కేటీఆర్ గురువారం ఈడీ ముందు హాజరైన తరువాత.. పరిణామాలను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని ముందుగానే కేటీఆర్‌కు ఏసీబీ చెప్పిన నేపథ్యంలో.. విచారణకు రావాలని నోటీసులు జారీచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రెండోసారి విచారణకు వస్తే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.


