
కోల్‌కతా: రెక్కీ చేసి దొంగతనం చేసేందుకేందుకు ప్రయత్నించే క్రమంలో పట్టుబడి పోతామేనన్న భయంతో అగంతకులు గోడ దూకేందుకు ప్రయత్నించే సందర్భాల్ని నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.
అయితే, ఇక్కడ దొంగకు బదులు.. ఎమ్మెల్యే గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇలా పారిపోవడానికి ముందే తన ఫోన్‌ను స్థానికంగా ఉన్న చెరువులో పడేశారు. ఆపై తప్పించుకునేందుకు గోడ దూకారు. కానీ .. వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్న చందంగా..
ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ వీడియోల్ని చూసిన నెటిజన్లు గోడదూకి పారిపోయిన ఎమ్మెల్యే ఎవరా? అని ఆరా తీస్తున్నారు.
ఈడీ అధికారులు దాడులు చేసేందుకు వస్తే ఎమ్మెల్యే గోడదూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పశ్చిమబెంగాల్‌ను కుదిపేసిన టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ కేసులో తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసంలో జరిగింది. టీచర్ కుంబకోణంలో తాజాగా సోమవారం ఈడీ అధికారులు ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా నివాసంతో పాటు ఆయన కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. అయితే, ఈడీ సోదాలు గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే తన ఇంటి గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఎలాంటి ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశ్యంతో తన ఫోన్‌ను స్థానిక చెరువులో విసిరేశారు.
అనంతరం ఇంటి నుంచి పారిపోయేందుకు గోడదూకగా.. గోడకి అటువైపు ఉన్న పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. పారిపోయే సమయంలో ఎమ్మెల్యే తన మొబైల్‌ను ఇంటి సమీపంలోని చెరువులో విసిరేసినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కాగా, ఉపాధ్యాయ నియమాకం కుంబకోణం కేసులో 2023 ఏప్రిల్‌లో కృష్ణ సాహాను సీబీఐ అరెస్ట్ చేసింది. 2025మేలో ఆయనకు బెయిల్ మంజూరైంది. తాజాగా, ఈడీ అరెస్ట్ చేసింది.
#Breaking: #TMC MLA from Burwan, Murshidabad district, Jiban Krishna Saha arrested by ED in connection with SSC scam.
Sources in ED say, Jiban Krishna Saha tried to jump the boundary wall of the house & flee when ED officials reached his residence this morning. This apart, he… pic.twitter.com/ff5MBD21Yq— Pooja Mehta (@pooja_news) August 25, 2025