తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
గురువారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారు దర్శించుకున్నారు.
నటుడు బ్రహ్మానందం, నటుడు శ్రీరామ్, గాయని మంగ్లీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార ప్రవేశం చేశారు.
దర్శన తర్వాతీ రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.


