కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు | Karnataka BJP worker says cops assaulted her during arrest Hubballi police denies | Sakshi
Sakshi News home page

కర్ణాటక పోలీసులపై బీజేపీ మహిళ సంచలన ఆరోపణలు

Jan 7 2026 6:14 PM | Updated on Jan 7 2026 7:19 PM

Karnataka BJP worker says cops assaulted her during arrest Hubballi police denies

బెంగళూరు :  ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ‍ కార్యక్రమంలో కర్ణాటకలోని  బీజేపీ మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.  తన ప్రాంతంలో ఓటర్ల జాబితా  నిర్వహించడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు తన పట్ల  దారుణంగా ప్రవర్తించారని వివస్త్రను చేశారని  మహిళా కార్యకర్త ఆరోపించారు.  సోమవారం తనను అరెస్టు చేసిన పోలీసు సిబ్బంది తనను కొట్టి, బలవంతంగా బట్టలు విప్పించారని ఆమె ఆరోపించారు. అయితే దీనిపై పోలీసల వాదన మరో ఉంది. కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఈ వివాదం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...బీజేపీ కార్యకర్త సుజాత హండి, చాలుక్య నగర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఎస్‌ఐఆర్‌ సర్వే సందర్బంగా తలెత్తిన ఘర్షణ కారణంగా ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు, మగ పోలీసులు తనపైదాడిచేసి అసభ్య పదజాలంతో దూషిస్తూ, అభ్యంతర కరంగా ప్రవర్తించారని బాధితురాలి ఆరోపణ. ఈ సంఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ అయ్యాయి.వాటిలో ఒకదానిలో హండిని పోలీసు వ్యాన్‌లోకి తీసుకెళ్తున్న దృశ్యాలకు సంబంధించింది.

 మరోవైపు  సుజాత ఆరోపణలు పోలీసులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం అన్నారు. అయితే, సుజాత అరెస్టును ప్రతిఘటించి, అధికారులతో దురుసుగా ప్రవర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 307 తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

ఆమే చింపేసుకుంది
అధికారులు నిర్వహిస్తున్న సర్వే సమయంలో స్థానికుల మధ్య విభేదాలు తలెత్తి, అది ఘర్షణకు దారితీసింది. పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, వాగ్వాదాలు జరిగాయి, భౌతిక దాడులకుదిగారని పోలీసులుత ఎలిపారు.దీనిపై స్థానికుడు  ప్రశాంత్ బొమ్మాజీ ఫిర్యాదు  ఆధారంగా ఆమెను అరెస్టు జరిగినట్లు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, సోమవారం ఎనిమిది నుండి పది మంది మహిళా అధికారులతో కలిసి హండిని అరెస్టు చేయడానికి వెళ్లారని, ఈ క్రమంలో నిందితురాలు  పోలీసు వ్యాన్‌లోకి తీసుకెళ్తున్నప్పుడు ఆమే తన బట్టలు తీసేసిందని శశికుమార్ చెప్పారు. అక్కడున్న మహిళా అధికారులు ఆమెకు మరో జత బట్టలు అందించడానికి స్థానికుల సహాయం కోరారని, ఆమెను బట్టలు వేసుకోమని పదేపదే కోరామని చెప్పారు. అలాగే నిందితురాలు సుజాతపై గత ఐదేళ్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయన్నారు. ఐదు గత ఐదేళ్లవి కాగా, నాలుగు ఈ సంవత్సరానికి చెందినవి. ఈ నాలుగింటిలో మూడు ప్రజలు దాఖలు చేసినవి, ఒకటి పోలీసు  దాఖలు చేసినట్టు వివరించారు.

సుజాత  అరెస్ట్‌పై కమిషనర్  స్పందిస్తూ, అరెస్టు సమయంలో, ఆమె తన అనుచరులతో కలిసి పోలీసులను తీవ్రంగా ప్రతిఘటించి ఘర్షణకు దిగిందనీ, సబ్-ఇన్‌స్పెక్టర్‌, ముగ్గురు నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారనీ, విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారని ఆయన చెప్పారు.

బాధితురాలి సోదరి
"మా ఇంటి బయట కూర్చుని ఉండగా, సుమారు 30 మంది పోలీసులు  వచ్చి సుజాతతో పాటు అందర్నీ లోపలికి తీసుకెళ్లారు. సుజాతపై దారుణంగా దాడి చేశారు, ఆమె బట్టలు చింపేశారు. మహిళా, పురుష పోలీసు అధికారుతొద్దరూ ఉన్నారు, మమ్మల్ని వదిలేయమని వేడుకున్నాం అయినా పోలీసులు సుజాతను ఈడ్చుకెళ్లారు." అని బాధితురాలి సోదరి విజయలక్ష్మి తెలిపింది. ఈ ఘటనపై బీజేపీ  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా లోకానికే  తీరని అవమానమని,  సంబంధిత లీసులను వెంటనే సస్పెండ్  చేయాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : 16 అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి పడి టెకీ దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement