బెంగళూరులో భవనం 16వ అంతస్తు నుంచి పడి టెకీ (26) దుర్మరణం పాలయ్యాడు. విదేశాల్లో విద్య పూర్తి చేసుకొని వచ్చి, ఉద్యోగాన్వేషణలో ఉండగా ఈ విషాదం చోటు చేసకుంది.
ఐరోపాలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో తన విద్యను పూర్తిచేసిన నిక్షప్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు. బెంగళూరులోని శెట్టిహళ్లిలోని ప్రిన్స్ టౌన్ అపార్ట్‌మెంట్స్ భవనం 16వ అంతస్తు నుండి పడి మరణించాడు. కొన్ని రోజులుగా హసరఘట్టలోని గౌడియ మఠంలో ఉంటున్నట్టు సమాచారం.బుధవారమే తన తల్లిదండ్రులు కిషోర్, జయశ్రీల వద్దకు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గలగుంటె పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడు గత కొన్నేళ్లుగా గా స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని తండ్రి పోలీసులకు తెలిపారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై తాము దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు


