‘రేవంత్‌రెడ్డికి బీజేపీ భయం పట్టుకుంది’ | BJP Chief Ramchander Rao Slams Congress Govt | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌రెడ్డికి బీజేపీ భయం పట్టుకుంది’

Feb 22 2026 3:52 PM | Updated on Feb 22 2026 4:04 PM

BJP Chief Ramchander Rao Slams Congress Govt

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు. కామారెడ్డిలో బీజేపీకి చైర్మన్‌ పదవి రాకుండా చేశారని రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. ప్రజాహక్కులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. బొల్లారం పీఎస్‌ నుంచి రాంచందర్‌ రావును విడుదల చేశారు. 

కామారెడ్డికి వెళ్లకూడదన్న షరతులతో ఆయన్ను విడుదల చేశారు పోలీసులు. అనంతరం రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 

ఇదిలా ఉంచితే, నేడు చలో కామారెడ్డికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.  దాంతో రాంచందర్‌ సహా, ముఖ్య నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించి వారిని కామారెడ్డి వెళ్లకుండా అడ్డుకున్నారు. ముందస్తు అరెస్టులు చేశారు. ఈ క్రమంలోనే రాంచందర్‌ రావును బొల్లారం పీఎస్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement