రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ హత్య కేసు.. వీడిన మిస్టరీ | Police Solve The Case Of Writer Boggula Srinivas | Sakshi
Sakshi News home page

రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ హత్య కేసు.. వీడిన మిస్టరీ

Feb 22 2026 1:39 PM | Updated on Feb 22 2026 3:16 PM

Police Solve The Case Of Writer Boggula Srinivas

సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్‌లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.

హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం.. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన బొగ్గుల శ్రీనివాస్‌ మృతి చెందారు. రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.

శ్రీనివాస్‌ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్‌ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని గుర్తించారు. దర్యాప్తులో శ్రీనివాస్‌ది హత్యగా తేల్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement