boggula Srinivas
-
దృశ్యం సినిమా రేంజ్ లో ప్లాన్ చేసిన నిందితులు
-
బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే.. చంపింది వాళ్లే.. ACP సంచలన ప్రెస్ మీట్
-
రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్‌లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్‌ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం.. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందారు. రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని గుర్తించారు. దర్యాప్తులో శ్రీనివాస్‌ది హత్యగా తేల్చారు. -
బొగ్గుల శ్రీనివాస్ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
కూసుమంచి: ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లి ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ నిర్వహించారు.ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించడం, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా ఆరా తీసినట్లు సమాచారం. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని బయటపడినట్లు తెలుస్తోంది.శ్రీనివాస్ మిత్రుడైన ఆయన తన వ్యాపార లావాదేవీల కోసం శ్రీనివాస్ జీఎస్టీ నంబర్‌ను దుర్వినియోగం చేస్తుండటంతో నిలదీయగా కక్ష పెంచుకుని అతనిని హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శ్రీనివాస్ మృతి కేసు మిస్టరీ వీడనున్నట్లు తెలుస్తోంది. -
గొంతెత్తినందుకు గుండె ఆపేశారా?
-
బొగ్గుల శ్రీనివాస్ పోస్ట్‌మార్టం రిపోర్ట్.. సంచలన నిజాలు
-
రచయిత బొగ్గుల శ్రీనివాస్ కేసు.. ఒంటిపై గాయాలు!
కూసుమంచి: ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచగా, పురోగతి సాధించినట్లు తెలిసింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈనెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లో మునగగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఘటన జరిగాక కారు నడుపుతున్న వ్యక్తి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో కూసుమంచి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.సదరు వ్యక్తి హైదరాబాద్‌లో పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని, అదే జరిగితే కేసులో చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన నివేదిక వచ్చినట్లు సమాచారం. శ్రీనివాస్ నీట మునగడంతో చనిపోలేదని, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు ధ్రువీకరించారని తెలిసింది.ఏదేమైనా మిస్టరీగా మారిన శ్రీనివాస్ మృతి కేసు మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. మృతుడు శ్రీనివాస్ సెల్టవర్ల వ్యాపారంలో ఉండగా, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోగా.. త్వరలోనే కేసు ఛేదిస్తామని కూసుమంచి ఎస్సై నాగరాజు ‘సాక్షి’కి తెలిపారు. -
చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ
-
‘ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ను ఎవరో కొట్టి చంపారు’
కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (48) మృతిచెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా, సుధాకర్ ఆదివారం కూసుమంచి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్ తల, ముఖంతోపాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని.. గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వారు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకు తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకు వచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వస్తూ.. శ్రీనివాస్ ప్రయాణించిన ఏపీ 16 డీపీ 2345 కారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వచ్చినట్లు టోల్‌ప్లాజా సీసీ పుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కారు రిజిస్టేషన్ ప్రకారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన వేణుమాధవరెడ్డిదిగా గుర్తించారని తెలిసింది. కారు జాతీయ రహదారిపై వెళ్లకుండా నాయకన్‌గూడెం నుంచి పాలేరు రాష్ట్ర రహదారిపై రావడం, రిజర్వాయర్‌లో పడిపోయాక కారు నడిపిన వ్యక్తి అక్కడి నుంచి పరారవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ గతంలో హైదరాబాద్‌లో కండక్టర్‌గా ఉద్యోగం చేసేవాడని, ఆ తర్వాత ఉద్యోగం నచ్చక వదిలేసి పుస్తకాలు రాస్తున్నాడని సోదరులు పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా మారిన రచయిత శ్రీనివాస్ మరణం
-
పవన్ పుస్తకం రాసిన రచయిత మృతి పాలేరు ఘటనలో మిస్టరీ.. ప్రమాదమా? హత్యా?
-
పవన్ అభిమానుల నుంచి ముప్పు.. బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి
కూసుమంచి (ఖమ్మం): తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ (45) అనుమానాస్పద స్థితిలో దుర్మరణం పాలయ్యారు. శనివారం ఉదయం 7–30 సమయంలో కారు నీళ్లలో కొంతమేర మునగగా.. వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెందడం.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పరారవడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు శ్రీనివాస్ కర్నూలు జిల్లా అల్లూరు గ్రామానికి చెందినవారు. సాహిత్య పరిశోధకుడిగా, యూట్యూబర్‌గానూ గుర్తింపు పొందారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తిచేసిన ఆయన పలు పుస్తకాలు రచించగా.. 2014లో పవన్‌కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశంపై ‘పవన్‌కళ్యాణ్ హటావో.. పాలిటిక్స్ బచావో’ పేరిట పుస్తకం రాశారు. ఈ పుస్తకం 8 లక్షలకుపైగా కాపీలు అమ్ముడుపోయిందని సమాచారం. పవన్‌కళ్యాణ్ అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఆయనకు రక్షణ కూడా కల్పించింది. ఏం జరిగిందంటే.. పాలేరు రిజర్వాయర్‌లోకి శనివారం ఉదయం ఏపీ 16 డీపీ 2345 నంబరు కారు దూసుకెళ్లింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగారు. కారు నీళ్లలో కొంతమేర మునగగా, వెనుక సీటులో కూర్చున్న శ్రీనివాస్ మృతి చెంది ఉన్నాడు. అయితే, కారు నీటిలో పడిన సమయాన డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి నాయకన్‌గూడెం వైపు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ ఘటనాస్థలిని పరిశీలించారు.బయటపడిన వ్యక్తి ఏమైనట్టు? కారులో ఇద్దరు ఉండగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నీళ్లలో నుంచి ఒడ్డుకు రాగానే వెళ్లిపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెనుకాల సీటులో కూర్చున్న వ్యక్తిని కాపాడకుండా హడావుడిగా వెళ్లిపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మృతుడి నుదురు, ముఖంపై గాయాలు ఉండగా కారు నీటిలో పడిన సమయాన తగిలాయా, ఎక్కడైనా హత్య చేసి కారులో తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌కళ్యాణ్‌పై పుస్తకం రాసిన దృష్ట్యా శ్రీనివాస్‌కు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం రక్షణ కలి్పంచిందని శ్రీనివాస్ స్నేహితులు ‘సాక్షి’కి తెలిపారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్‌ది ముమ్మాటికీ హత్యేనని, పోలీసులు విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. కారు రిజర్వాయర్‌లో పడిన ప్రాంతాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం చేరేందుకు హైవే ఉన్నప్పటికీ పాత సర్వీస్ రోడ్డును ఎంచుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు రిజర్వాయర్‌లో పడిపోయి ప్రమాదం జరిగినట్టు చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా అని పోలీసులు, మృతుడి స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారు నీట మునిగాక ఒడ్డుకు చేరి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు ఆరా తీస్తూనే నాయకన్‌గూడెం వద్ద ఉన్న టోల్‌ప్లాజా సీసీ ఫుటేజీల ద్వారా కారు నంబర్ సేకరించి ఎవరిదనే కోణంలో విచారిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ మృతదేహం ప్రస్తుతం నేలకొండపల్లి ఆస్పత్రి మార్చురీలో ఉండగా, ఆయన సోదరులు శనివారం అర్ధరాత్రి వరకు ఇక్కడకు చేరే అవకాశముందని సమాచారం. -
'పవన్ కళ్యాణ్ హటావో' రచయితకు రక్షణ
హైదరాబాద్: 'పవన్ కళ్యాణ్ హటావో -పాలిటిక్స్ బచావో' పుస్తక రచయితకు రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు. ఈ పుస్తకాన్ని రాసిన తార్నాకకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ బుధవారం నుంచి 26వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హటావో-పాలిటిక్స్ బచావో పుస్తకాలను కూడా ప్రదర్శించి విక్రయిస్తారు. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు ఆయన అభిమానుల నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని శ్రీనివాస్ సోమవారం సచివాలయంలో హోంమంత్రిని కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని ఆయన శ్రీనివాస్‌కు హామీ ఇచ్చారు. అంతేకాకుండా హోమంత్రి, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి సమాచారం అందించారు. మహేందర్‌రెడ్డి సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించారు. రక్షణ కల్పించినందుకు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. -
పవన్ క్షమాపణ చెప్పాలి
పదవులు తుచ్ఛమైనవంటూ ఆయన రాజ్యాంగాన్ని అవమానించారు 24 గంటల్లో జాతికి క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు వెళ్తా ‘పవన్ కల్యాణ్ హఠావో...పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగాన్ని అవమానించిన పవన్‌కల్యాణ్ జాతికి 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో తాను ఈ విషయంపై న్యాయవ్యవస్థను ఆశ్రయించడానికీ వెనుకాడనని ‘పవన్ కల్యాణ్ హఠావో... పాలిటిక్స్ బచావో’ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయనాయకుడిగా పనికిరాడని, ఆ ఉద్దేశంతోనే తాను ‘పవన్ కల్యాణ్ హఠావో...పాలిటిక్స్ బచావో’ అనే పిలుపునిచ్చానని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం తన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం బొగ్గుల శ్రీనివాస్ పవన్‌పై తాను ఎందుకు పుస్తకం రాయాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు. తనకు ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం లాంటి పదవులన్నీ తుచ్ఛమైనవని జనసేన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పిన పవన్.. రాజ్యాంగబద్ధమైన పదవులు తుచ్ఛమైనవి అంటూనే తనకు నచ్చిన పార్టీలను అందలం ఎక్కించాలని అభిమానులకు పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి రాజకీయాలలో ఉండేందుకు అర్హుడు కాదని స్పష్టం చేశారు. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలకోడ్ వచ్చినప్పుడే పవన్ కూడా కోడై కూస్తాడని విమర్శించారు. ఆయన ప్రసంగాల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడం అనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. పవన్ రాజకీయాల్లో ఉన్నంతకాలం తన పుస్తకాలకు మరిన్ని భాగాలు వస్తూనే ఉంటాయని చెప్పారు. పవన్ ఓ కుహనా రాజకీయవేత్త, కుహనా ఉద్యమకారుడు, కుహనా సంస్కర్త అని ధ్వజమెత్తారు. -
పవన్ రాజకీయ అజ్ఞాని
ఆయన నిలకడలేని వ్యక్తి.. పూటకోమాట..ప్రాంతానికో వ్యాఖ్య ఆయన నైజం చంద్రబాబును తిట్టి.. ఆయన పంచన చేరడం దుర్మార్గం ‘పవన్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ పుస్తకావిష్కరణలో రచయిత ధ్వజం పంజగుట్ట,న్యూస్‌లైన్: పదవులు గడ్డిపోచతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించిన సినీహీరో పవన్‌కల్యాణ్ ఇప్పుడు మోడీ జపం, టీడీపీ వంతపాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. ‘పవన్‌కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అన్న పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించి పవన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తనకు కులం, మతం, ప్రాంతం తేడాల్లేవని ప్రగల్బాలు పలికిన ఆయన పూటకోమాట మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు పెద్ద అవినీతి పరుడని..ఇప్పుడు సీమాంధ్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని అంటున్నాడు. బాబు సింగపూర్‌లో డబ్బు దాచుకున్నారని విమర్శించి..ఇప్పుడు రెండురాష్ట్రాలను బాబు మాత్రమే సింగపూర్‌లా తీర్చిదిద్దగలరని ఎలా అంటున్నారు’ అని ప్రశ్నించారు. మహిళలపై యాసిడ్ దాడులు జరిగినప్పుడు, దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లు జరిగినప్పుడు స్పందించని ఆయన రాష్ట్ర విభజన విషయంలో దేశసమగ్రతకు భంగం వాటిల్లుతుందనడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఐదేళ్లు ఏమి మాట్లాడకుండా కేవలం ఎన్నికల సమయంలో పవన్ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను సీమాంధ్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని తేల్చిచెప్పారు. తెలంగాణ లో ఒకలా, సీమాంధ్రలో మరోలా మాట్లాడుతున్న ఆయన ఇరుప్రాంతాల్లో శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆయన శైలి మారకుంటే తమ పుస్తకం భాగాలు వస్తూనే ఉంటాయని శ్రీనివాస్ ఈసందర్భంగా వెల్లడించారు.


