బొగ్గుల శ్రీనివాస్‌ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..! | Police Collect Key Evidence In Writer Boggula Srinivas Case | Sakshi
Sakshi News home page

బొగ్గుల శ్రీనివాస్‌ కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!

Feb 20 2026 7:05 AM | Updated on Feb 20 2026 8:45 AM

Police Collect Key Evidence In Writer Boggula Srinivas Case

కూసుమంచి: ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లి ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్‌ మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంచేశారు. రిజర్వాయర్‌లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ నిర్వహించారు.

ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్‌ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మేకల వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించడం, ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా ఆరా తీసినట్లు సమాచారం. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్‌ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని బయటపడినట్లు తెలుస్తోంది.

శ్రీనివాస్‌ మిత్రుడైన ఆయన తన వ్యాపార లావాదేవీల కోసం శ్రీనివాస్‌ జీఎస్టీ నంబర్‌ను దుర్వినియోగం చేస్తుండటంతో నిలదీయగా కక్ష పెంచుకుని అతనిని హత్యచేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో శ్రీనివాస్‌ మృతి కేసు మిస్టరీ వీడనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement