చెత్త బండిలో వృద్ధురాలి మృతదేహం తరలింపు | Nagarkurnool incident | Sakshi
Sakshi News home page

చెత్త బండిలో వృద్ధురాలి మృతదేహం తరలింపు

Feb 20 2026 5:01 AM | Updated on Feb 20 2026 5:01 AM

Nagarkurnool incident

నాగర్‌కర్నూల్‌ క్రైం: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధురాలి మృతదేహాన్ని చెత్తబండిలో తరలించడంపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగర్‌కర్నూల్‌ లోని కేసరి సముద్రం చెరువు వద్ద గురువారం మున్సిపాలిటీ పరిధిలోని నాగ నూలు గ్రామానికి చెందిన కాశమ్మ (70) ఒంటరిగా జీవనం సాగిస్తోంది. భర్త మృతి చెందడంతో తాడూరులోని తన కూతురు వద్ద ఉంటున్న ఈమె.. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం నాగనూల్‌ వచ్చింది. ఓటు వేసిన తర్వాత రెండు రోజుల క్రితం కూతురి వద్దకు వెళ్తుండగా జిల్లాకేంద్రంలోని కేసరిసముద్రం చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను వినియోగించకుండా మున్సిపాలీ్టకి చెందిన చెత్త ట్రాక్టర్‌పై తరలించడంతో అక్కడే ఉన్న స్థానికులు వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement