truck
-
బహురూపాల బండి.. ఎక్కడికెళ్లాలన్నా ఈ ఒక్కటుంటే చాలు
-
అడ్వెంచర్స్ కోసం అద్భుతమైన వాహనం: ఫియర్స్ ఫోర్డ్ సూపర్ డ్యూటీ క్యాంపర్ ట్రక్ (ఫోటోలు)
-
టమాటాలకు పోలీసు బందోబస్తు
పట్నా: ఉత్తరప్రదేశ్‌లోని ఒక వింత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న టమోటాలకు పోలీసు సిబ్బంది కాపలాగా నిలుచున్న ఆ దృశ్యం అందరినీ ఆలోచింపజేస్తోంది. టమాటాలు రోడ్డున పడ్డాయన్న సంగతి తెలుసుకున్న చుట్టుపక్కల వారు వాటిని ఎత్తుకెళ్లేందుకు హైవేపైకి గుంపులుగా చేరుకున్నారు. అయితే అక్కడున్న పోలీసులు వారిని తరిమికొట్టడంతో వారంతా మౌనంగా వెనుదిరిగారు.వివరాల్లోకి వెళితే ఒక లారీలో 1,800 కిలోల టమోటాలను ఢిల్లీకి తరలిస్తుండగా దారిలో ఆ లారీ ప్రమాదానికి గురైంది. దీంతో లారీలోని టమాటాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే సదరు టమాటాల యజమాని టమాటాల భద్రత కోసం పోలీసులకు సమాచారం అందించారు. అర్జున్ అనే వ్యక్తి ఈ లారీని బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకువెళుతున్నాడు.ఝాన్సీ-గ్వాలియర్ హైవేలోని సిప్రి బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి 12 గంటల సమయంలో లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ వెనుకే స్కూటీపై వస్తున్న ఒక మహిళకు గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. టమాటాలు ఎవరూ ఎత్తుకెళ్లకుండా చూసేందుకు ముగ్గురు పోలీసులు ఘటనా స్థలంలో కాపలాగా నిలిచారు. ఉదయాన్నే క్రేన్ రాగానే, లారీని సరిచేసి మళ్లీ టమాటాలను లారీలోకి ఎక్కించారు. అంత వరకూ పోలీసులు అక్కడే కాపలాగా ఉన్నారు. ప్రస్తుతం టమోటాల ధర మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 వరకు ఉంది. పలు చోట్ల భారీ వర్షాలకు టమాటా పంట నాశనమైంది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. बंगलुरू से 1800 किलो टमाटर लेकर दिल्ली जा रहा ट्रक झांसी, यूपी में पलट गया। टमाटर की लूट न हो जाए, इसलिए रातभर पुलिस तैनात रही। मार्केट में टमाटर का रेट 80 से 120 रुपए किलो तक है।@RajuSha98211687 pic.twitter.com/g19jkVgOSs— Sachin Gupta (@SachinGuptaUP) October 18, 2024ఇది కూడా చదవండి: గాంధీజీ అడిగితే... బంగారు గాజులు ఇచ్చారు -
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..పది మంది మృతి
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో శుక్రవారం(అక్టోబర్4) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి ప్రయాగ్‌రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో ట్రాక్టర్‌ను ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ట్రాలీ ఏకంగా పక్కనున్న కాలువలో ఎగిరిపడింది. దీంతో ట్రాలీలో ఉన్న 10 మంది కూలీలు మృతిచెందారు.ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వారణాసి ట్రామా సెంటర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సనందిస్తున్నారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసు ఉన్నతాధికారి అభినందన్ తెలిపారు.ట్రక్కు డ్రైవర్ ఘటనాస్థలి నుంచి పారిపోయాడని చెప్పారు. ఇదీ చదవండి: వైవాహిక అత్యాచారం నేరం కాదు -
Rajasthan: రోడ్డు ప్రమాదం.. ఎనిమిదిమంది మృతి
సిరోహి: రాజస్థాన్‌లోని సిరోహి జిల్లా పిండ్వారా ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సిరోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. జీపు రాంగ్ డైరెక్షన్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన సమయంలో జీపు ప్రయాణికులతో నిండివుంది.జీపులో ప్రయాణిస్తున్నవారంతా పాలి జిల్లాలోని నాడోల్ ఆలయాన్ని సందర్శించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కంటల్ సమీపంలోకి రాగానే ఆ జీపు ఒక ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో జీపు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు పురుషులు, ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు మృతిచెందారని పిండ్వారా పోలీస్ స్టేషన్ ఇన్చార్జి హమీర్ సింగ్ తెలిపారు. మృతులు, గాయపడినవారు ఉదయపూర్ జిల్లాలోని గోగుండా, ఝడోల్కు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: నైజీరియాలో పడవ బోల్తా.. 41 మంది మృతి -
పెరిగిన ట్రక్ అద్దెలు
పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్‌కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్‌తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్‌ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
ఇలాంటి సైబర్ ట్రక్ ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
Madhya Pradesh: కావడియాత్రలో విషాదం.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావడియాత్రికులతో కూడిన ట్రాక్టర్‌ను ఒక ట్రక్కు బలంగా డీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కావడి యాత్రికులు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మొరెనా జిల్లాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు కావడియాత్రికులు ఖాదియాహర్ గ్రామం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గంగా ఘాట్‌కు ట్రాక్టర్లో తరలివెళ్తున్నారు.డియోరీ గ్రామ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కావడియాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన 12 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టమాటా ట్రక్కు బోల్తా.. పండుగ చేసుకున్న జనం
దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని అంటాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ. 100ను దాటింది. దీంతో సామాన్యులు టమాటాను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో మధ్యప్రదేశ్‌లో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..మధ్యప్రదేశ్‌లోని సాగర్ నుండి టమోటాలతో ఢిల్లీ వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటన బంద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజువా గ్రామం సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. టమాటాలతో నిండిన ట్రక్కు బోల్తా పడిందని తెలియగానే సమీప గ్రామాల ప్రజలు టమాటాలను ఏరుకునేందుకు పరుగులు తీశారు. కొందరు ట్రక్కు నుంచి బయటపడిన టమాటాలు సంచులలోకి ఎత్తి తీసుకువెళ్లగా, మరికొందరు దర్జాగా ట్రక్కు లోనికివెళ్లి, టమోటాలను దక్కించుకున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ గుమిగూడిన జనాన్ని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 15 క్వింటాళ్లకు పైగా టమాటను జనం దోచుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ట్రక్కులోని టమాటాలను మరో వాహనంలోని ఎక్కించి, అది వెళ్లాల్సిన గమ్యస్థానానికి తరలించేందుకు డ్రైవర్‌కు సహకరించారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి 13 మంది..
బెంగళూరు, సాక్షి: కర్ణాటకలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హవేరి జిల్లా నేషనల్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఓ మినీవ్యాన్ కొట్టడంతో 13 మంది మృతి చెందారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్లని, దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.బ్యాడ్గి మండలం పుణేబెంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును శుక్రవారం వేకువ జామున ఓ మినీ వ్యాన్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వ్యానులోని 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన మరో నలుగురిని ఆస్పత్రికి తరలించారు. నిద్రమత్తు, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. ప్రమాద తీవ్రతకు ట్రక్కులోకి మినీ వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో అతికష్టం మీద మృతదేహాల్ని పోలీసులు బయటకు తీయగలిగారు. మృతులంతా శివమొగ్గ జిల్లా భద్రావతి మండలం ఎమ్మిహట్టి గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. బెలగావి సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో శుక్రవారం పొద్దున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రెండు ముక్కలైన ట్రక్ తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్‌ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్‌తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్‌ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్‌తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్‌కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్‌గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
గుడిసెపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి గుడిసెలో ఆదమరచి నిద్రిస్తున్నవారిపైకి అకస్మాత్తుగా ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఘటన హర్దోయ్ జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపైకి ఇసుక లోడుతో కూడిన ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. గంగానది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రక్కు హర్దోయ్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.భల్లా కంజాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మల్వాన్ పట్టణంలో రోడ్డు పక్కగా ఒక గుడిసెలో నివసిస్తున్నాడు. మెహందీఘాట్, కన్నౌజ్ నుంచి హర్దోయ్‌కు వెళ్తున్న ఇసుకతో కూడిన ట్రక్కు ఈ గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులంతా ఇసుకలో కూరుకుపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
కెన్వర్త్ సూపర్‌ట్రక్2 అదిరిపోయే ఫొటోలు
-
డీజిల్ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు
సరుకు రవాణా ధరలు మార్చి 2024లో ఫ్లాట్‌గా ఉన్నాయని శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ లాజిస్టిక్స్ పరిశోధన నివేదిక శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. గౌహతి-ముంబై ట్రిప్ మినహా మెజారిటీ రూట్లలో పెరుగుదల కనిపించలేదని చెప్పింది. ఈ మార్గంలో రవాణా ధరలు 1.1 శాతం పెరిగాయని పేర్కొంది. మరోవైపు దిల్లీ-కోల్‌కతా, దిల్లీ-చెన్నై, దిల్లీ-బెంగళూరు, ముంబై-కోల్‌కతా ట్రిప్‌ల్లో రవాణా ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీ-కోల్‌కతా మార్గంలో గరిష్టంగా 1.4 శాతం ధరలు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అందులోని వివరాల ప్రకారం..ఆల్ ఇండియా వెహికల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 20.29 మిలియన్ యూనిట్లతో పోలిస్తే మార్చిలో 21.27 మిలియన్ యూనిట్లు పెరిగాయి. ఈ విభాగంలో 4.81 శాతం వృద్ధి నమోదైంది. ఇది మార్చి 2023లో నమోదైన 20.62 మిలియన్లతో పోలిస్తే 3.14 శాతం ఎక్కువ. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నెల కావడంతో కార్పొరేట్ సంస్థలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త అధికంగా సరుకు రవాణా చేయడంతో ట్రక్కుల అద్దెలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి చివరి వరకు ఇంధన ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 28న దిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.89.62 ఉండగా, మార్చి 31న లీటరుకు రూ.87.62 పడిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 15న లీటరుకు రూ.2 చొప్పున ఇంధన ధరలను తగ్గించాయి. అయినా ట్రక్కు అద్దె ధరలు, రవాణా ధరల్లో ఎలాంటి మార్పు లేదని నివేదిక ద్వారా తెలిసింది. -
పెళ్లి వేడుకలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి!
మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు రాంగ్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసి, వివాహ వేడుకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. సుల్తాన్పూర్ ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు ప్రమాదం బారినపడ్డారని సుల్తాన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ఖమారియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైసెన్ కలెక్టర్ అరవింద్ దూబే తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వైద్య చికిత్స అందించేందుకు భోపాల్‌కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి!
బీహార్‌లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్‌కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్‌ను ఢీకొని, మరో లేన్‌లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్ 2లోని దేవ్‌కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్‌ను ఢీకొని, డివైడర్‌ను దాటి.. మరో లేన్‌లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు. -
అరెస్ట్ చేయండి!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎక్స్కవేటర్ ట్రక్కును పార్ట్స్.. పార్ట్స్‌గా విడదీయడం చూడవచ్చు. ఇది ఓ ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ట్రక్ హత్యగా పేర్కొంటూ.. దీనికి కారణమైన ఎక్స్‌కవేటర్‌ను అరెస్ట్ చేయండంటూ పేర్కొన్నారు. ఒక ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ, కృషి అవసరమో మాకు తెలుసు. కానీ అలాంటి ట్రక్కును కనికరం లేకుండా ముక్కలు చేయడం చాలా బాధాకరంగా ఉందని, రీ సైక్లింగ్ ద్వారా అవి మళ్ళీ ఎప్పటికైనా జీవిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆ ఎక్స్కవేటర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదీ చదవండి: 50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే! Someone arrest that claw-excavator for ‘truck homicide!’ As manufacturers, we know how much technology & effort goes into producing trucks. Hurts to see them so mercilessly torn apart. But I suppose through recycling they’ll live ‘forever.’ 🙂pic.twitter.com/vvhMDKF6MI — anand mahindra (@anandmahindra) February 22, 2024 -
ట్రక్కునే మొబైల్ హౌస్‌గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్‌గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్‌లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్‌తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
హైవేను దిగ్భంధించిన ఆందోళనకారులు..!
-
ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్న జనం
ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్‌లపై ఎగబడుతున్నారు. థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్‌పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్‌పూర్, బిలాస్పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్‌లోని బస్ స్టేషన్లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్‌లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
మార్కెట్లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..
సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్‌టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ల్లో ఈ వాహనాల బుకింగ్‌లు ప్రారంభమయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు. ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్‌తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్‌ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్‌టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అదిరిపోయే లుక్స్‌తో టెస్లా ‘సైబర్‌ట్రక్’ (ఫోటోలు)