వైర‌ల్‌: చావు నుంచి త‌ప్పించుకున్న‌ మ‌హిళ‌

Viral: Tamil Nadu Woman Escapes Unhurt After Being Run Over By Truck - Sakshi

చెన్నై: మ‌నిషి ప్రాణం గాల్లో దీపం వంటిది. దీన్ని హ‌రించేందుకు ప్ర‌మాదాలు ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తాయ‌న్న‌ది ఎవ‌రూ ఊహించ‌లేరు. కానీ ఇక్క‌డ చెప్పుకునే మ‌హిళ కూడా పెద్ద ప్ర‌మాదంలో చిక్కుకుంది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డి అదృష్ట‌వంతురాల‌ని నిరూపించుకుంది. త‌మిళ‌నాడులోని తిరుచెంగోడ్‌కు చెందిన ఓ మ‌హిళ చేతిలో సంచితో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తోంది. ఇంత‌లో వెన‌క‌నుంచి ఓ పెద్ద ట్ర‌క్కు ఆమెపై దూసుకుంటూ వెళ్లింది. ఓ క్ష‌ణంపాటు ఆమె పై ప్రాణాలు పైనే పోయినా ఎలాంటి చిన్న‌ గాయాలు కూడా కాకుండా ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. మ‌హిళ‌ను గ‌మ‌నించ‌కుండా ఆమె పై నుంచి ట్ర‌క్కు పోనిచ్చిన డ్రైవ‌ర్ ఆగ‌కుండా వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న ఎన్న‌డు జ‌రిగింద‌న్న వివ‌రాలు పూర్తిగా తెలియ‌రాలేదు. (చ‌ద‌వండి: ఇంత భారీ అనకొండా.. నిజమేనా?!)

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా.. ఇంత పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం మామూలు విష‌యం కాద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌హిళ‌ను చూడ‌కుండా ఆమెపై వాహ‌నాన్ని పోనిచ్చిన ట్ర‌క్కు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యాన్ని నిందిస్తున్నారు.  అస‌లు రోడ్డు మీద న‌డుచుకుంటూ రావ‌డం ఆమె త‌ప్ప‌ని మ‌రికొంద‌రు స‌ద‌రు మ‌హిళ‌ను త‌ప్పుప‌డుతున్నారు. ఏదేమైనా మ‌హిళ ఓ క్ష‌ణం చ‌చ్చి బ‌తికింద‌ని కామెంట్లు చేస్తున్నారు. దేవుడున్నాడ‌ని, అత‌డే ఆమెను ఈ ప్ర‌మాదం నుంచి ర‌క్షించాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. (చ‌ద‌వండి: 10 లాటరీలు ఒకేసారి తగిలాయా, ఏంటి? )

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top