
ఇంటర్నెట్, సోషల్ మీడియా వాడకం పెరిగాక సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. అయితే నిజమో కాదో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీది వాస్తవం కాదు. టెక్నాలజీ సాయంతో గోరంతను కొండంతలు చేసి.. మనల్ని వెర్ని వాళ్లని చేస్తుంటారు కొందరు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతోంది. దీనిలో సినిమాల్లో మాత్రమే కనిపించే భారీ సైజు అనకొండను ఎర వేసి పట్టుకున్నారు. ‘కోళ్ల దొంగను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ నీటి మడుగు బయట నీల రంగు డ్రమ్మును ఉంచారు. దాని ముందు కోడిని ఎరగా ఉంచారు. ఇంతలో నీటిలో నుంచి ఓ అనకొండను కోడిని మింగడానికి బయటకు వచ్చి డ్రమ్ములో దూరుతుంది. బయటకు రావడానికి మార్గం లేక గిజగిజా తన్నుకుంటుంది. ఇక వీడియోలోని అనకొండను చూస్తే భయం, ఆశ్చర్యం రెండు ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే ఇంత పెద్ద అనకొండను సినిమాల్లో తప్ప రియల్‌గా చూసి ఉండరు. 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని 24 గంటల వ్యవధిలో 1.2మిలయన్ల మంది వీక్షించారు. (జాగ్రత్త! చావుతో ఆడుకుంటున్నావ్)
ఇక ఈ వీడియో నిజమా కాదా తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ‘స్నోప్స్’ రంగంలోకి దిగింది. తన పరిశోధనలో తేలింది ఏంటంటే.. ఇది మానిప్యులేటెడ్ వీడియో. అంతేకాక ఇది రెండు సంవత్సరాల క్రితం నాటిది అని తేల్చేసింది. ఇక ఒరిజనల్ వీడియోలో కనిపించే పాము కూడా పెద్దదే కానీ మరీ అనకొండంత భార సైజుది మాత్రం కాదు. అలానే నీలం రంగు పైపుని కూడా భారీ డ్రమ్ముగా మార్చారు.
I thought the snake in anaconda was an exaggeration, then i saw this video https://t.co/PmL1qJ2fzP
— Tony Digs (@ToneDigz) July 20, 2019