‘ నేను నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ : స‍్వీట్‌ కపుల్‌ జాయ్‌ రైడ్‌ వీడియో వైరల్‌ | elderly couple' bike ride goes viral with 35 million viewsvideo viral | Sakshi
Sakshi News home page

‘ నేను నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ : స‍్వీట్‌ కపుల్‌ జాయ్‌ రైడ్‌ వీడియో వైరల్‌

Jun 21 2025 12:56 PM | Updated on Jun 21 2025 1:35 PM

elderly couple' bike ride goes viral with 35 million viewsvideo viral

ఒక స్వీట్‌ కపుల్‌ అండ్‌ ఓల్డ్‌ కపుల్‌  (Elderly Couple) గాల్లో తేలినట్టుందే..అంటూ దర్జాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (టైటానిక్‌) బుల్లెట్‌ మీద రయ్య్‌మని దూసుకుపోతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంత వైరల్‌ అంటే 3.5 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయంటే ఈ వీడియో క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.

కమలాక్షి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు: " అందమైన వృద్ధ జంట అందమైన వింటేజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ రైడ్‌ చూశాను. సూపర్‌.. పొగడ్త తరువాత తాతగారి నవ్వు  చూడాలి.. అమూల్యం’’ అంటూ  ఈ వీడియోను షేర్‌ చేశారు. ప్రశంసకు ఉబ్బితబ్బిబ్బవుతూ తాతగారి నవ్విన నవ్వు ఈ వీడియోకే  హైలైట్ అని పేర్కొన్నారు.

> ఈ వీడియోలో,బామ్మగార్ని  వెనుక కూర్చోబెట్టుకున్న తాతగారు బామ్మగారు ‘నేను నడిపే  బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌’ అంటూ దూసుకుపోతున్నారు. ఇది చూసి  కమలాక్షి వారిని  పొగడ్తల్లో ముంచెత్తింది. దీంతో పబ్లిక్‌షాక్‌డ్‌ , చాచా రాక్‌డ్‌ అంటూ కమెంట్‌ చేశారునెటిజన్లు.అంతేకాదు  టైటానిక్‌ జాక్‌ అండ్‌ రోజ్‌ అని  కొందరు, అర్జున్‌ రెడ్డి, ప్రీతి అంటూ మరికొందరు ఈ వీడియోను ఎంజాయ్‌ చేయడం  విశేషం. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement