అంతరిక్షంలో శాండ్‌విచ్‌? | Fallout from the Unauthorized Gemini III Space Sandwich | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో శాండ్‌విచ్‌?

Nov 10 2026 4:26 AM | Updated on Nov 10 2026 4:26 AM

Fallout from the Unauthorized Gemini III Space Sandwich

మీకు తెలుసా?

తిండి యావ ఎక్కువైతే కాగల కార్యం అటకెక్కుతుందంటే ఇదే...అది 1965 మార్చి 23. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జెమినీ–3 ప్రయోగానికి సిద్ధం చేసే పనుల్లో తలమునకలై ఉంది. వ్యోమగాములు జాన్‌యంగ్, విర్జిల్‌ గస్‌ గ్రిసమ్‌ స్పేస్‌ రేస్‌లోకి వెళ్లేందుకు సూట్‌ వేసుకుంటూ సిద్ధపడుతున్నారు. వీరి జర్నీ లో వర్రీలు రాకుండా ఉండేందుకు మరీ మనం తినే కర్రీలు కాకుండా డ్రై ఫుడ్స్‌ గట్రా వంటివి పెట్టి ఉంచారు. 

ఇక జెండా ఊపితే ఛలో అంతరిక్షం.. కాని పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు కదా...అక్కడే స్టాఫ్‌లో ఒక్కరు తెచ్చిన వేడివేడి శాండ్‌విచ్‌ మీద గ్రిసమ్‌ కన్నుపడింది. తినకూడదు.. తినకూడదు అనుకుంటూనే సుష్టుగా ఓ బైటు లాగించేశాడు. లాంచింగ్‌ టైం అంటూ సౌండ్‌ వచ్చేసరికి లాంఛన్రపాయం మిగిలిన శాండ్‌విచ్‌ తన స్పేస్‌ సూట్‌లోకి లోడ్‌ చేసి తన సీట్‌లోకి వెళ్లిపోయాడు. 

ప్రయోగం సక్సెస్‌..జెమినీ–3 మాత్రమే కాదు..శాండ్‌విచ్‌ స్మగుల్‌ కూడా. కాని అక్కడే చిక్కు కూడా వచ్చింది.. ఎవరూ చూడకూడదని ఆత్రంగా శాండ్‌విచ్‌ తిని జేబులో పెట్టుకుండగా బ్రెడ్‌ ముక్కలు క్యాబిన్‌లో పడ్డాయి. స్పేస్‌లో ఆహార పదార్థాలు ఒక క్రమపద్థతిలో ప్రిజర్వ్‌ చేయడం, వినియోగించడం తప్పనిసరి. లేదంటే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాంతో గ్రిసమ్‌ చేసిన పనికి అమెరికా ఆహార పదార్థాల విషయంలో కఠిన నియమాలను రూపొందించాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement