నాసా ఉద్యోగం కాదని.. ఐపీఎస్‌ అధికారిగా! ఏకంగా 100 కోట్లు.. | Success Story: Anukriti Sharma left NASA to become an IPS officer | Sakshi
Sakshi News home page

Success Story: నాసా ఉద్యోగం కాదని.. ఐపీఎస్‌ అధికారిగా! ఏకంగా 100 కోట్లు..

Nov 4 2026 4:34 PM | Updated on Nov 4 2026 4:47 PM

Success Story: Anukriti Sharma left NASA to become an IPS officer

కొందరు అచ్చం సినిమాల్లో చూపించే పోలీసుల మాదిరి వీరోచితంగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎ‍న్నో అసాధారణ కేసులను చేధించి..అందరూ మెచ్చుకునేలా ప్రజాసేవ చేస్తుంటారు. అలాంటి కోవకు చెందింది లేడీసింగం. ప్రతిష్టాత్మకమైన నాసా రీసెర్చ్‌ని కాదని దేశ సేవే మిన్న అంటూ ఐపీఎస్‌ అయ్యి యువతకు స్ఫూర్తిని కలిగించడమే కాకుండా డ్యూటీలో బెబ్బులిలా క్రిమినల్స్‌ ఆటకట్టిస్తూ..లేడీ సింగం అని పేరు తెచ్చుకుంది.

ఆ ధీరవనితే ఉత్తరప్రదేశ్‌కి చెందిని ఐపీఎస్‌ అధికారిణి అనుకృతి శర్మ. ఆమె పోలీస్‌ సేవలో చేరడానికి ముందు ఆమె ఒక సైంటిస్ట్‌. అనుకుృతి విద్యా నేపథ్యం వచ్చేసి..ఆమె జైపూర్‌లోని ఇండో-భారత్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత కోల్‌కతాలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) బీఎస్‌-ఎంఎస్‌ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత 2012లో  టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఉన్న రైస్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందారు. 

ఆమె పరిశోధనలో అగ్నిపర్వతాలకు సంబంధించి ఒక ప్రాజెక్టు కూడా ఉంది. తన డాక్టరేట్‌ అధ్యయనాల సమయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకృతి రూ. 2 లక్షల వేతనం అందుకునేవారు. అయితే శాస్త్రీయ పరిశోధనలో వృత్తిని కాదని..సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా సేవ చేసేందుకే మొగ్గు చూపింది. అలా 2014లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షకు సిద్ధమవ్వడం ప్రారంభించి, 2015లో మొదటిసారి హాజరైంది. 

అయితే ఆమె తొలి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా..మెయిన్స్‌లో అర్హత సాధించలేకపోయారు. అయితే రెండో, మూడో ప్రయత్నాల్లో  సైతం ఓటమినే ఎదుర్కొన్నారామె. చివరికి నాల్గో ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో 355వ ర్యాంకును (AIR 355) సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS)కు ఎంపికయ్యారు. 

అయితే ఆమె లక్ష్యం ఐపీఎస్‌ అధికారి కావడం. అందువల్ల ఆ సర్వీస్‌లో చేరలేదు. ఆ తర్వాత 2020లో మళ్లీ యూపీఎస్సీ పరీక్షలకు హాజరై 138వ ర్యాంకును (AIR 138) సాధించడం ద్వారా ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో చేరాలనే తన కలను సాకారం చేసుకున్నారామె. ఆ తర్వాత ఐపీఎస్‌ అధికారిణిగా ఎన్నో కేసులను అత్యంత చాకచ​​క్యంతో చేధించి..క్రిమినల్స్‌ ఆటకట్టించింది. నేరస్తులు గుండెల్లో భయం తెప్పించే లేడి శివంగిలా మారి ఎన్నో నేరాలకు అడ్డకట్ట వేసిన అధికారిగా మంచి పేరుతెచ్చుకుంది. 

ముఖ్యంగా రూ. 100 కోట్ల ఇన్సురెన్స్‌ స్కామ్‌ చేధనలో ఓవర్‌నైట్‌ స్టార్‌లా ఆమె పేరు మారుమ్రేగిపోయింది. సంభాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు చేధనలో శివంగిలా ఆమె కనబర్చిన అసామాన్య ధైర్య సాహసాలకు గానూ ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోం మంత్రి దక్షత మెడల్‌కు ఎంపిక చేసి గౌరవించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.

ఇదీ చదవండి: మాటలతో కాదు చేతలతో అంటే ఇదే కదా! గొప్ప పేరెంటింగ్‌ పాఠం..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement