మనం ఆచరిస్తే..పిల్లలు నేర్చుకోగలరు. మనం మంచి విలువలు నోటి మాటగా చెప్పడం కంటే చేసి చూపడమే మేలు. అదే వాళ్ల మనసులో బలంగా నాటుకుంటుంది. అంతకు మించిన బెస్ట్ పేరెంటింగ్ పాఠం మరొకటి ఉండదు. అదే చేసి చూపించింది ఈ ఆధునిక అమ్మ..!.
Early Lesson in financial independence: బెంగళూరుకి చెందిన కన్సల్టెంట్ అర్పితారావు తన విద్యారుణాన్ని ముగించడానికి బ్యాంకుకి వెళ్లినప్పుడూ తోడుగా మూడేళ్ల కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లింది. అందుకు సంబంధించిన విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో ఇలా పంచుకుందామె. ఆమె ఇంటర్నెషనల్ స్కూల్‌లో ఎంబీఏ చేసిందామె. అందుకోసం ఎవ్వరిపై ఆధారపడకుండా..రూ. 26 లక్షల ఎడ్యుకేషన్ లోన్ సాయంతో చదువుకుంది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే ఇదంతా చేసిందామె.
అయితే తోటి విద్యార్థులందరికీ కేవలం రెండు నుంచి మూడేళ్లే పడితే ఆమెకు మాత్రం ఏకంగా ఎనిమిదేళ్లు పట్టింది. ఎందుకంటే ఆమెకు 18 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే తండ్రి ఆర్థిక మద్దతు ఇవ్వలేదని తన సోదరి కాలేజీ చదువు నుంచి ప్రతి విషయంలోనూ అండగా నిలిచిందని తెలిపింది. అలా తాను 22 ఏళ్ల వయసులో సంపాదించడం ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తన కోసం, కుటుంబం కోసం తన సంపాదన ఖర్చు చేసింది. అయితే తాను ఈ లోన్ తీర్చడానికి మూడు ఎదురుదెబ్బలు తగిలాయని అందువల్ల ఇంత ఆలస్యమైనట్లు తెలిపింది.
వ్యాపారంలో మార్పుల కారణంగా తన బాధ్యతలను మార్చుకుని, తక్కువ జీతాన్ని అంగీకరించాల్సి రావడం ఒక ఎదురుదెబ్బ. అనుకున్న విధంగా జరగని ఒక వ్యవస్థాపక ప్రయత్నం వల్ల ఎదురైన వైపల్యం మరొకటి, ఇంకొకటి బిడ్డ పుట్టినప్పుడు. సరిగ్గా మెటర్నిటీ లీవ్‌లో ఆదాయం లేకుండా గడపాల్సి వచ్చినట్లు వెల్లడించింది. ఆరునెలల ప్రసూతి ప్రయోజనాలను ఒక స్టార్టప్ యజమాని చెల్లించలేదని చెప్పుకొచ్చింది.
ఆ టైంలో సంపాదన లేక ఇబ్బందిపడ్డట్టు వెల్లడించింది. అయితే ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా..ఇంపాక్ట్ కన్సల్టింగ్ సంస్థలలో తన కెరీర్‌ను నిర్మించుకుంటూనే రుణ చెల్లింపులు కొనసాగించారు. అలాగే ఆమె విద్య, జెండర్ ఈక్వాలిటీ, వాతవరణం, ఇంధర పరివర్తన రంగాల్లో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేసింది. ఇంక ఈ లోన్ తీర్చడానికి కొడుకు ఎందుకంటే.. అర్పితారావు తీసుకుంది రూ. 26 లక్షలు అయితే ఆమె ఆ లోన్ పూర్తి చేయడానికి రూ. 43 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అంటే లోన్ టైం పీరియడ్ ఎక్కువైతే చెల్లించాల్సింది కూడా ఎక్కువ అవుతుంది కదా.
అంత పెద్ద మొత్తం చెల్లించడం తన కుమారుడి సమక్షంలో జరిగితే..వాడికి డబ్బు విలువ, ఆర్థిక స్వాతంత్ర్యం గురించి తెలుస్తుంది. సొంతంగా జీవితాన్ని నిర్మించుకునే దైర్యం గురించి తెలుసుకోవాలనే తీసుకొచ్చానని చెబుతోంది ఆ అమ్మ. నిజానికి మూడేళ్ల పిల్లవాడికి అప్పు తీర్చడం అర్థంకాకపోయినా..డబ్బు అనేదాని గురించి తెలుస్తుంది, ఆర్థిక స్వాతంత్ర్యం అనే తొలిపాఠాన్ని ఇలా ఆమె చేతలతో చూపించే ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ తన కొడుక్కి డబ్బు విలువ కంటే..బ్యాంకు సెక్యూరిటీ గార్డు పట్టుకున్న నిజమైన తుపాకీని టచ్ చేయడమే అత్యంత అపురూపమైన ఘట్టంగా నిలిచిందని నవ్వుతూ చెబుతోంది అర్పితారావు.
ప్రస్తుతం తాను అప్పుల నుంచి విముక్తి పొందడమే గాక, ఆర్తికంగా స్థిరంగా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన ధ్యాసంతా వ్యాపారాన్ని నిర్మించుకోవడంపైనే ఉందంటూ తన లింక్డ్ ఇన్ పోస్ట్‌ని ముగించింది. నెటిజన్లు గొప్ప అమ్మగా కీర్తించడమే కాకుండా అప్పుల నుంచి విముక్తి అయ్యినందుకు సెలబ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
ఇదీ చదవండి: డిగ్రీ చేస్తూనే..కేఫ్ ప్రారంభించింది! జస్ట్ 50 రోజుల్లోనే ..


