మిస్ యూనివర్స్ కిరీటమే లక్ష్యంగా.. ప్యూర్టో రికోకి పయనం! | Kaziah Liz Mejo Sets Off For Miss Universe 2026 In Puerto Rico | Sakshi
Sakshi News home page

Kaziah Liz Mejo: మిస్ యూనివర్స్ కిరీటమే లక్ష్యంగా.. ప్యూర్టో రికోకి పయనం!

Nov 4 2026 12:43 PM | Updated on Nov 4 2026 1:11 PM

Kaziah Liz Mejo Sets Off For Miss Universe 2026 In Puerto Rico

75వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌కి ప్యూర్టోరికో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌కి ప్రాతినిథ్యం వహిస్తున్న కజియా లిజ్‌ మెజ్‌ బయలుదేరనుంది. ఈ విషయాన్ని మిస్‌యూనివర్స్‌ ఇండియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పేర్కొంది.  ఈ అందాల పోటీలో భారత్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న అందాల రాణి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కుతోంది అంటూ ఆమె ఫోటోలను షేర్‌ చేసింది. 

ఆ ఫోటోలకు ఒక అందాల రాణి కేవలం కిరీటాన్ని మాత్రమే కాదు దేశం కలలు, ఆశలను మోస్తోంది అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేసింది. సంప్రదాయ వస్త్రధారణతో, కిరీటాన్ని ధరించి మరి  మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2026 కజియా లిజ్‌ మెజో 75వ మిస్ యూనివర్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్యూర్టో రికోకు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అని పోస్ట్‌లో పేర్కొంది. అందాల భామ కజియా లిజ్‌ మెజో ప్యూర్టోరికోకు బయలుదేరినప్పుడూ క్లిష్టమైన ఎంబ్రాయిడీతో కూడిన మెరూన్‌ రంగు చీర ధరించి..ట్రెడిషన్‌లో లుక్‌లో ఆకట్టుకుంది. 

అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్‌ బ్లౌజ్‌తో వదులుగా జాలువారే జుట్టుతో క్లాసిక్‌ లుక్‌లో కనిపించింది. తన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని ప్రదర్శిస్తూ, వైబ్స్‌ సృష్టించింది. కాగా, ఈ 75వ మిస్ యూనివర్స్ పోటీ ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో ఉన్న జోస్ మిగెల్ అగ్రెలోట్ కొలీజియంలో జరగనుంది. ఫైనల్స్‌ నవంబర్ 24, 2026న జరగనున్నాయి. ఇక కజియా లిజ్‌  ఈ ఏడాది ప్రారంభంలోనే మిస్ యూనివర్స్ కేరళ 2026ని గెలుచుకుని, తన రాష్ట్రం నుంచి అతి పిన్న వయస్కురాలైన టైటిల్ హోల్డర్‌గా నిలిచింది.

 

ఇదీ చదవండి: డిగ్రీ చేస్తూనే..కేఫ్‌ ప్రారంభించింది! జస్ట్‌ 50 రోజుల్లోనే ..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement