‘డల్‌’ కాదు మోడల్‌! | Sofia Jirau a Puerto Rican model with Down syndrome | Sakshi
Sakshi News home page

‘డల్‌’ కాదు మోడల్‌!

Aug 14 2026 6:29 AM | Updated on Aug 14 2026 6:29 AM

Sofia Jirau a Puerto Rican model with Down syndrome

ఛాలెంజ్‌

ఊహ తెలిసినప్పటి నుంచి ఒక అమ్మాయికి మోడల్‌ కావాలన్న ఆశ. కాని పుట్టుకతోనే గుండె లోపం. ఈ లోపం ఉంటే సహజంగానే పిల్లలు యాక్టివ్‌గా కనిపించడం చాలా కష్టం. అయితే ఆరోగ్య సమస్య అడుగడుగునా ఆమెను ఇబ్బంది పెడుతున్నా, ఊపిరి తీసుకునే ప్రతిసారి గుండె లయ తనని వెక్కిరిస్తున్నా, మోడల్‌ కావాలన్న ధ్యాస మాత్రం మారలేదు.. ర్యాంప్‌ వాక్‌ చేసేవరకు ఆమె గమనం ఆగలేదు... పోర్టోరికోకి చెందిన సోఫియా పుట్టుకతోనే డౌన్స్‌ సిండ్రోమ్‌తో పుట్టింది. 

డౌన్‌ సిండ్రోమ్‌ అంటే గుండె లోపం. పిల్లల ఎదుగుదల సరిగా లేకపోవడం, మాటలు రాకపోవడం, నేర్చుకోవడం ఆలస్యమవడం, శారీరక ఎదుగుదల సవ్యంగా జరగకపోవడం వంటివి ఈ సిండ్రోమ్‌ తాలూకు లక్షణాలు.. సహజంగా ఈ సిండ్రోమ్‌ ఉన్న వాళ్లు అంత ఉత్సాహంగా ఉండరు. క్లాస్‌లో డల్‌ స్టూడెంట్స్‌లా కనిపిస్తారు. కాని సోఫియా మాత్రం తన లోపానికి ఏరోజూ తలొగ్గలేదు. ప్రతిసారీ తనని తాను మరింత మెరుగుపరుచుకుంది. 

సోఫియాకి 17వ ఏట గుండెకు శస్త్ర చికిత్స చేశారు. తరచూ ఆమె హాస్పిటల్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేది... అనేక వైద్యసవాళ్లు ఎదుర్కొన్నా ఆమె మాత్రం కుంగిపోలేదు... మోడలింగ్‌ వైపు అడుగులేసింది. 2019లో 23వ ఏట ్ర΄÷ఫెషనల్‌ మోడలింగ్‌ ప్రారంభించింది. ‘ఐ లవ్‌ ఇట్‌’ పేరిట ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించింది. 2020లో న్యూయర్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో రన్‌ వేపై నడిచింది. ఆమె ప్రయాణంలో అతి పెద్ద మలుపు 2022లో వచ్చింది.

 ‘విక్టోరియాస్‌ సీక్రెట్‌ లవ్‌ క్లాడ్‌ కలెక్షన్‌’ ప్రచారంలో పాల్గొన్న తొలి డౌన్స్‌ సిండ్రోమ్‌ మహిళగా సోఫియా చరిత్ర సృష్టించింది. తనలా డౌన్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నవారికి ధైర్యాన్నిచ్చేందుకు క్యాంపెయిన్‌ను మొదలుపెట్టింది. అలా మోడల్‌గా, వ్యాపారవేత్తగా, మోటివేషనల్‌ స్పీకర్‌గా కొనసాగుతున్న సోఫియా జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే.. అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టకూడదు అని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement