అక్కడ దీపావళి రోజున ఉపవాసాలు, ప్రార్థనలు.. | Diwali 2026: Jainism commemorates Lord Mahaviras nirvana | Sakshi
Sakshi News home page

అక్కడ దీపావళి రోజున ఉపవాసాలు, ప్రార్థనలు..

Nov 4 2026 10:30 AM | Updated on Nov 4 2026 10:30 AM

Diwali 2026: Jainism commemorates Lord Mahaviras nirvana

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన పండుగ దీపావళి. నరకాసుర వధని పురస్కరించుకుని దీపాలు వెలిగించడం, పిల్లలు బాణాసంచా కాల్చడం సర్వసాధారణం. కాని జైన సంప్రదాయం ప్రకారం బిహార్‌లోని పావపురి ప్రాంతంలో కార్తీక అమావాస్య రోజున మహావీరుడు మోక్షం పొందాడు. ఆయన నిర్యాణంతో లోకానికి జ్ఞాన ప్రకాశం దూరమైందని భావించిన ప్రజలు, మహావీరుడి గుర్తుగా దీపాలు వెలిగిస్తారు. 

దీపావళి రోజున ఉపవాసాలు, ప్రార్థనలు, ధ్యానం చేస్తారు. ఆలయాల్లో మహావీరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నిర్వాణ లడ్డూ సమర్పిస్తారు. మరుసటి రోజును జైన నూతన సంవత్సరంగా భావిస్తారు. ఇతరులకు దీపావళి పండుగ కావచ్చు. కాని జైనులకు మాత్రం అది మహావీరుడి జ్ఞానజ్యోతిని గుర్తు చేసుకునే పవిత్ర దినం. 

ఇదీ చదవండి: థియేటరే ఇల్లు.. సినిమానే ప్రపంచం! జస్ట్‌ ఒక్క ఏడాదిలోనే 1,207 సినిమాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement