పండగ టైమ్‌లో రూ.10, 20, 50 నోట్లు దొరకవా? | RBI Warning, Fake Circular On Rs 10, Rs 20 And Rs 50 Notes Goes Viral Ahead Of Diwali, Here's The Truth, Read Story Inside | Sakshi
Sakshi News home page

పండగ టైమ్‌లో రూ.10, 20, 50 నోట్లు దొరకవా?

Nov 3 2026 2:37 PM | Updated on Nov 3 2026 2:51 PM

Fake Rs 10 20 50 Currency Shortage Circular Ahead of Diwali RBI Clarifies

పండగ సీజన్‌ వచ్చిందంటే ప్రజల్లో కొనుగోళ్ల జోరు పెరుగుతుంది. ముఖ్యంగా దీపావళి సమయంలో పెద్ద నోట్లతో పాటు చిల్లర లావాదేవీల కోసం రూ.10, రూ.20, రూ.50 విలువైన చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. అయితే, రాబోయే దీపావళి పండగ వేళ మార్కెట్‌లో ఈ చిన్న నోట్ల కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియాలో నకిలీ సర్క్యులర్ వైరల్ అవుతోంది. ఈ తప్పుడు ప్రచారంపై దేశీయ సెంట్రల్ బ్యాంకైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. ఆ సర్క్యులర్ పూర్తిగా అబద్ధమని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేసింది.

నకిలీ సర్క్యులర్ సృష్టిస్తున్న గందరగోళం

ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఆ ఫోర్జరీ సర్క్యులర్ ప్రకారం.. దేశంలో డిజిటల్ చెల్లింపులు (యూపీఐ, కార్డులు, నెట్ బ్యాంకింగ్) పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ చిన్న నోట్ల ముద్రణను క్రమంగా తగ్గిస్తున్నాయని, దీనివల్ల రాబోయే దీపావళికి రూ.10, రూ. 20, రూ. 50 నోట్లు తగినంతగా లభించవని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆర్‌బీఐ గవర్నర్ పేరుతో, నకిలీ సంతకంతో అక్టోబర్ 27, 2026 నాటి తప్పుడు తేదీతో ఈ పత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ పూర్తిగా డిజిటల్ లావాదేవీలపైనే ఆధారపడాలని ఆ సర్క్యులర్ తప్పుదోవ పట్టించేలా సూచించింది.

ఆర్‌బీఐ అధికారిక వివరణ

దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ వాల్ట్స్‌, కరెన్సీ చెస్ట్‌ల్లో చిన్న డినామినేషన్లతో సహా అన్ని రకాల కరెన్సీ నోట్లు తగినంత అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ పేరును, లోగోను, ఉన్నతాధికారుల పేర్లను అసాంఘిక శక్తులు మోసపూరితంగా వాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని హెచ్చరించింది. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, కేవలం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా ప్రకటనల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.

ఇదీ చదవండి: ఈరోజు అపరంజి ధర పెరిగిందా? తగ్గిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement