సైకాలజీ విద్యార్థి మిస్బా అర్షద్ ఇటీవలే మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విషయాన్ని మిస్ యూనివర్స్ పాకిస్థాన్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పంచుకుంది. తమకొత్త మిస్ యూనివర్స్ పాకిస్థాన్ 2026 మిస్బా అర్షద్ హుందాతనం, అందం, ఆత్మవిశ్వాసం, లక్ష్యంతో ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించే గౌరవాన్ని అందుకుందని పేర్కొంది.
75వ మిస్ యూనివర్స్ పోటీ ఈ ఏడాది నవంబర్ 24న ప్యూర్టోరికోలని శాన్‌జువాన్‌లో జరగనుంది. ఈ పోటీలో ఆమె అధికారికంగా పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించనుందని ఆ దేశ అందాల పోటీ సంస్థ పేర్కొంది. ఈమేరకు టైటిల్ గెలుచుకున్న మిస్బా అర్షద్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఈ గెలుపుతో తన మిస్ యూనివర్స్ పోటీ జర్నీ అధికారికంగా ప్రారంభమైందని పేర్కొంది. ఇన్నేళ్లలో తాను నేర్చుకున్న విషయం ఓటమి మనం విజేతనా కాదా అని నిర్ణయించదని తెలుసుకున్నానన్నారు. ఎ
ల్లప్పుడు ఆశను సజీవంగా ఉంచుకోవడం, కృషి చేయడం, ప్రతి అడుగులో మెరుగవ్వడం ఇవే మనల్ని విజేతగా నిలుపుతాయని రాసుకొచ్చారామె. అలాగే అందాల పోటీల ఫైనల్‌లో తాన ధరించిన కాస్ట్యూమ్ గురించి కూడా ఇలా రాశారామె. తన తెల్లటి గౌను ఆశకు ప్రతిక అని, ఇది ఎల్లప్పుడు మన కలలను నమ్మడం మానేయకూడదని గుర్తుచేస్తుందని పేర్కొంది. అలాగే దానిలోని రాయల్ బ్లూరంగు స్పటికాలు, మనం నేర్చుకుంటూ మెరుగుపడే విద్యకు ప్రతికని అన్నారు. ఇక మిస్బా ధరించిన కాస్ట్యూమ్‌ని వియత్నామీస్ డిజైనర్ గుయెన్ టియెన్ ట్రూయెన్ డిజైన్ చేశారు. ఆయన ఈ గౌనుని సాంప్రదాయ పాకిస్థానీ మూలాంశాలతో డిజైన్ చేయడం విశేషం.
ఎవరీ మిస్బా అర్షద్
మిస్బా అర్షద్ ఒక సైకాలజీ విద్యార్థిని. విద్య ద్వారానే బాలికలకు సాధికారత కల్పించగలమని నమ్ముతానని, ఇది పాకిస్తాన్ కోసం సంస్థలకు ఉన్న దార్శనికత గురించి తెలుసుకోవడం వల్ల ఈ విషయం అర్థమైందని అన్నారు. మన భవిష్యత్తు కోసం మనం పెట్టగలిగే అత్యంత శక్తిమంతమైన పెట్టుబడులలో విద్య ఒకటిగా పేర్కొంది.
ఆమె సైకాలజీ స్టూడెంట్ మాత్రమే కాదు మోడలింగ్ కూడా చేస్తుందామె. అలాగే ఫ్యాషన్, బ్యూటీరంగాలలో కంటెంట్‌ను సృష్టిస్తారామె. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలను బట్టి చూస్తే..ఆమె కొత్త సంస్కృతులను అన్వేషించడం, స్థానిక వంటకాలను రుచి చూడటం, ప్రకృతిలో గడపడాన్ని బట్టి.. ఆమెను ఒక ప్రపంచ యాత్రికురాలిగా పేర్కొనవచ్చు. కాగా, ఆమె జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2023తో సహా అనేక అందాల పోటీల్లో అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారామె.
(చదవండి: Sonam Kapoor: ట్రెడిషనల్ అనార్కలీ డ్రెస్‌లో సోనమ్ అత్యద్భుతమైన లుక్..!)


