బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఫ్యాషన్‌లో తనకు సాటిరారెవ్వరు అన్నట్లుగా ఉంటుంది. ఏ సందర్భమైన దానికి అనుగుణంగా భారతీయ హస్తకళను చాటే సంప్రదాయ వారసత్వ దుస్తులతో తళుక్కుమంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తన ముగ్ధమనోహరమైన ఫ్యాషన్ శైలితో కట్టిపడేస్తుంటుంది. ఈసారి కూడా అలానే అత్యంత సుందరంగా కనిపించింది సోనమ్. అదీకూడా సంప్రదాయ వింటేజ్‌తో కూడిన అనార్కలీ డ్రెస్‌లో సోనమ్.. చూపు తిప్పుకోనివ్వనంతా ఆకర్షణీయంగా ఉంది.
సోనమ్ కపూర్ ఫ్యాషన్ పరంగా తాను ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అనేలా మెరిశారామె. బుధవారం సాయంత్రం ఈ నటి ఒక జ్యువెలరీ బ్రాండ్ కోసం అత్యంత అద్భుతమైన లుక్‌లో వచ్చారు. భారతీయ హస్తకళ, సాంప్రదాయ శైలిని ప్రదర్శించేలా అద్బుతమైన బ్లాక్ అనార్కలీలో తళుక్కుమంది. పోడవాటి చేతుల కుర్తా, దానికి శాంతి బనారస్ క్లిష్టమైన డిజైన్ కూడిన దుప్పటా హెలెట్‌గా నిలిచింది.
టస్సర్ జార్జెట్ బేస్‌పై రూపొందించిన చేతి ఎంబ్రాయిడరీ సాంప్రదాయ పిచ్వాయి పెయింటింగ్‌ని పోలి ఉంది. ఈ నల్లటి దుప్పటా కాన్వాస్‌లా మొత్తం అంతా సూక్ష్మ కళాకృతులతో నిండి ఉండి, ఆ క్లిష్టమైన డిజైన్‌కి మరింత జీవం పోసింది. అంతేగాదు ఈ దుప్పటాపై ఉన్న ప్రతి నమునా సన్నని రేషమ్ దారాలతో చేతితో రూపొందించగా, దానిపై ఉన్న క్లిష్టమైన కళాకృతిని ప్రముఖంగా చూపించేలా కసబ్(వెండి, బంగారం లేదా రాగి రంగుల సన్నని మెటాలిక్ దారాలతో చేసే ఒక ప్రాచీనమైన ఎంబ్రాయిడరీ)ను ఉపయోగించారు.
అలాగే తన రూపం మరింత అందంగా కనిపించేలా భారీ బిర్ధిచంద్ ఆభరణాలు, స్టెప్స్ వజ్రాల నెక్లెస్, చెవిపోగులు, ఉంగరాలను ధరించారు. అలాగే జుట్టుని చక్కగా దువ్వి ముడి వేయడంతో మరింత హుందాగా కనిపించింది సోనమ్. ముఖ్యంగా ఆమె లుక్‌లో ఆభరణాలు, దుపట్టా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఈ రూపాన్ని పూర్తి చేయడానికి, సోనమ్ రత్నాలు పొదిగిన పెట్టె ఆకారపు క్లచ్‌ను పట్టుకుని, పదునైన నల్లటి పంప్ హీల్స్ ధరించి, మొత్తం రూపాన్ని అత్యంత సుందరంగా మార్చేశారామె.
వారసత్వ కళను అసాధారణమైన ఆభరణాల మేళవింపుతో అత్యంత ప్రభావవంతంగా చూపించారామె. భారతీయ హస్తకళను తన ఫ్యాషన్ ఎంపికలో మేళవించి తనదైన శైలితో స్టైలిష్‌గా కనిపించడంతో సోనమ్ అగ్రస్థానంలో ఉంటుంది.
(చదవండి: వేలాది మల్లెపూవులతో డిజైన్ చేసిన గౌనులో వధువు..! అమ్మమ్మ కోసం..)


