సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, డీఎస్‌సీపై మాట్లాడారు.
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్..
- డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం.
- డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- ప్రశ్నిస్తే గింజుకున్నారు. తప్పు ఒప్పుకోవడం లేదు.
- తప్పులను ప్రతిపక్షం ఎత్తుచూపుతున్నదని చంద్రబాబుకు భయం
- అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ బ్యాటింగ్ చేస్తున్నారు.
- ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు.
- ప్రశ్నపత్రం తయారీ ఎస్‌సీఈఆర్‌టీ బాద్యత
- రెండూ ఒకే వ్యక్తి చేతిలోపెడితే పారదర్శకత ఉంటుందా?
- ఇక్కడే స్కామ్‌కు బీజం పడింది.
- ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?
- స్వయంగా లోకేష్ సభలో అంగీకరించారు.
- ఏపీ డీఎస్సీ నియామాక చరిత్రలో ఎప్పుడు ఒకే వ్యక్తికి రెండు బాధ్యతలు అప్పగించలేదు
- పేపర్ తయారీ విభాగంలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
- పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్‌ది.
- ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో ఫస్ట్ ర్యాంకర్ నవీన్ పేరు ఉంది
- ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్‌కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?
- వెరిఫికేషన్‌లో నవీన్ పేరు లేదని ఉద్యోగం ఇవ్వలేదట
- ఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు?
- సెకెండ్ వెరిఫికేషన్ లిస్టులో కూడా నవీన్ పేరు తొలగించారు.
- సర్టిఫికెట్ వెరిఫికేష్‌కు నవీన్ ఎలా వస్తాడు?
- డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా ఎంఎల్‌సీలు స్తంభింపచేశారు.
- కాని, అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడంలేదు.
- ఎందుకు కౌన్సిల్‌లో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి.
- డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారు.
- మేం లేవనెత్తిన కీలక అంశంకూడా ఇదే.
- అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించాడు.
- ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి?
- అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.
- మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?
- వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.
- చదువు చెప్పేవారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా?
- డీఎస్సీ నియామకం తర్వాత ఇచ్చిన జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారు
- పీవీ సింధు పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ అబద్ధాలు
- చరిత్రలో లేనివిధంగా పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు.
- మెడల్స్ కాదు కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చేశారు.
- గతంలో డీఎస్సీ క్వాలిఫై అయితేనే ఉద్యోగం వచ్చేది.
- జీవోలు ఇచ్చే స్థాయికి స్కాం వెళ్లింది.
- 372 మందికి ఉద్యోగాలిచ్చిన జీవోలను రద్దు చేశారు.
- మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?
- డీఎస్ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి.
- డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్‌కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీచేశామనికూడా ఒప్పుకున్నారు.
- దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామ్మూలుగా లేవు.
- స్పోర్ట్స్ పర్సన్స్‌కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట, పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువుచెప్పే ఈ టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట?
- ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా, కొడుకులు ఇద్దరికే తప్ప, ఎవరికైనా సాధ్యం అవుతుందా?
- పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేష్‌ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్‌లో చిప్‌లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా?
- పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ వచ్చాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది.
- స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పీవీ సింధులా ఎంతమందికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అచీవ్‌మెంట్స్ ఉన్నాయి? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా?
- తన స్కాంలను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్‌ను అడ్డుపెట్టుకుంటున్నాడు.
- సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్‌మెంట్లో స్పోర్ట్స్‌కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని, చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ - ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు.
- ఒకవైపు సింధు పేరుచెప్పి, మరోవైపు వీళ్ల అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి - అంటే, చివరకు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన, ఎస్‌టీ కేండిడేట్ దుర్గయ్యకు కూడా, కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా, పోస్టు ఇవ్వకుండా అన్యాయం చేశారు.
- డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.
- విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే: వైఎస్ జగన్
- ‘నీట్’ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- ధర్మేంద్ర ప్రధాన్‌కు ఒక నీతి.. బాబు కుమారునికి మరొక నీతా?
- కొడుకును కాపాడుకునేందుకు బాబు మరింత దిగజారుడు
- బాబు, లోకేష్ డైరెక్షన్‌లోనే పోలీసుల వ్యవహరం
- మేం నిర్వహించిన ఎపీపీఎస్సీలో లీకేజీ జరగలేదు.
- స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు చేసినట్టుగా, ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.
- మరి వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్‌ఐఆర్ కాపీలో, పేరు చూపకుండా, కేవలం సస్పెక్ట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు.
- ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది?
- అసలు ఆకేసును ఎందుకు నిర్వీర్యం చేశారు. మరి చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు?
- ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక డీఎస్‌సీ అభ్యర్థికి స్పోర్ట్స్‌కోటాలో పోస్టు ఇప్పిస్తామని రూ.14లక్షలు తీసుకున్నారు.
- రిఫరెన్స్‌గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రిఫరెన్స్‌గా చూపిన వ్యక్తికి పోస్టు వచ్చింది, కాని, ఈ అమ్మాయికి పోస్టు రాలేదు.
- గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు.
- తనకు అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో డీఎస్‌సీ పోస్టుకోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు.
- గత ఏడాది నవంబర్ 11న, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే, ఇప్పటివరకూ ఎలాంటి చర్యల్లేవు. తన కంప్లైంట్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్‌పీకి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.
- అంటే డీఎస్‌సీ విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడవి అక్కడే ఎలాంటి విచారణ లేకుండా వదలిలేయాలని, తండ్రికొడుకులు ఇద్దరూ ఆదేశాలు ఇచ్చినట్టుగా, దాన్ని పోలీసులు పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.
- లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్‌కోటా వరకూ, ఆపై బేరసారాల వరకూ ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు.
- అందుకే డీఎస్‌సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి.
- మేం ఎవరికీ అనుకూలంగా జీవోలు తీసుకురాలేదు
- కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం
- నిజాలను ఎవరూ దాచలేరు.. బయట పెట్టాల్సిందే
- అప్పట్లో కోవిడ్ వల్ల డిజిటల్ వాల్యుయేషన్‌కు వెళ్లాం.
- మార్కుల ఆధారంగా 165 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
- కొంతమంది కోర్టుకు వెళ్లడంతో డిజిట్ వాల్యుయేషన్‌ను పరిగణలోకి తీసుకోలేదు.
- మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది.
- నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు.
- కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టాడు. మరింత దిగజారిపోయి 2018- ఏపీపీఎస్సీ గ్రూప్-1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు.
- 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు.
- అప్పటి ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో ఇప్పటి, డీఎస్సీ మాదిరిగా పేపర్ లీకేజీ అప్పుడు జరగలేదు.
- ఇప్పటి డీఎస్సీ మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ లేదా ఇతర ఉద్యోగులు ఎవ్వరికీ ర్యాంకులు రాలేదు.
- ఎవ్వరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు, పరీక్షలే లేకుండా ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.
- ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియో, వీడియో ఆధారాల్లాంటివి బయటకు రాలేదు.
- బయటకు వస్తున్నదల్లా చంద్రబాబు ఆక్రోశం. కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే.
- చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్‌లో ఒక సిట్ వేశాడు.
ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని హైకోర్టులో గవర్నమెంటు అడ్వకేట్లు సైతం అఫడవిట్ ఫైల్ చేశారు. - ఇది ఓవైపు జరుగుతుండగానే 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు.
- సిట్‌లో ఉండేది ఎవరు? చంద్రబాబుగారి కింద పనిచేసే వారే.
- బురదజల్లడంకోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు.
- గ్రూప్-1 వాల్యూషన్‌కు సంబంధించి హాయ్‌ల్యాండ్‌లో ఏదో జరిగిపోయిందని, అదే పనిగా, ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు.
- హాయ్‌లాండ్‌లో ఎలాంటి ఎవాల్యూషన్ జరగలేదని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి.
- చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్ 15న, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ఇదే విషయాన్ని రాశారు.
- మరి ఏదో జరిగిపోయిందన్న ప్రచారం ఎందుకు చేస్తున్నారు?
- గ్రూప్ -1పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది.
- బాబు హయాంలోని ఏపీపీఎస్‌సీ ఫలితాలు బయటపెట్టగలారా?
- ఇంటర్వ్యూలలో ఎన్ని మార్కులు వచ్చాయో, రిటన్ టెస్ట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా?.. చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..
- ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: వైఎస్ జగన్
- ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం.
- 2018 గ్రూప్ -1, 2025 డిఎస్సీ విచారణకు రెడీ.. సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?
- తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకుని అడుగుతున్నాం.. చంద్రబాబు, లోకేష్‌కు వైఎస్ జగన్ సవాల్
- మేం ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్లను చంద్రబాబు పెండింగ్‌లో పెట్టాడు. మరో రెండింటిని రద్దు చేశాడు. ఇదీ నిరుద్యోగుల మీదున్న ప్రేమ.
- చంద్రబాబూ…మేం సవాల్ విసురుతున్నాం. మేం అడుగుతున్నట్టుగా DSC-2025పైనే కాదు, 2018 గ్రూప్-1 నోటిఫికేషన్‌మీదా, సీబీఐ ఎంక్వైరీ వేయండి. మేం రెడీ. చంద్రబాబు రెడీనా?
- తప్పు చేయలేదు కాబట్టి, మేం రెడీగా ఉన్నాం. చంద్రబాబు రెడీ అయితే వెంటనే సీబీఐ దర్యాప్తుకు లెటర్ రాయాలి.



