కూటమి ప్రభుత్వం భయపడుతోంది: లేళ్ల అప్పిరెడ్డి | lella appireddy slams alliance govt | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం భయపడుతోంది: లేళ్ల అప్పిరెడ్డి

Oct 5 2026 5:31 PM | Updated on Oct 5 2026 6:08 PM

lella appireddy slams alliance govt

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని చెప్పారు. ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీ అభ్యర్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు.

తాడేపల్లిలో లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘బహిరంగ సభల్లో మాత్రం సీఎం నుంచి కిందిస్థాయి నేతల వరకు తొడలు కొడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలి అని జబ్బలు చరుస్తున్నారు. పోటీలో నిలిచేందుకు అవసరమైన సర్టిఫికెట్స్ కోసం వెళ్తే సర్వర్లు పనిచేయవు.

పోటీచేసే అభ్యర్థులు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఎన్నికల్లో మా పార్టీనేతలు పోటీలో లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు మరోసారి ఫిర్యాదు చేయబోతున్నాం. 

ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగాలి. అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. వైసీపీ అండగా ఉన్న వర్గాలపై అడుగడుగునా అణగదొక్కాలని చేస్తున్నారు. మా పార్టీలో ఎవరు పోటీ చేస్తారో మా నాయకుడు నిర్ణయిస్తారు. గెలుపోటములు మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు. 

YSRCP నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా కూటమి కుట్ర

సర్టిఫికెట్స్ కూడా ఇవ్వని దారుణ పరిస్థితులు ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించవు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే మాన్యువల్ విధానంలో అయినా సర్టిఫికెట్స్ ఇవ్వాలి. పోలీసులను అడ్డం పెట్టుకుని అనేక ప్రయత్నాలు చేసి గెలవాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement