విజయనగరం: జిల్లాలోని గరివిడి మండల ప్రజాపరిషత్ అధ్యక్ష(ఎంపీపీ) పదవిని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. గరివిడి మండలంలో వైఎస్సార్‌సీపీ 9 ఎంపీటీసీ స్థానాలను, టీడీపీ 9 ఎంపీటీసీ స్థానాలను చెరి సమానంగా దక్కించుకుంది. దాంతో ఇరు పార్టీల బలాబలాలు సమానం అయ్యాయి. ఈ నేపథ్యంలో లాటరీ పద్ధతి అనివార్యమైంది. లాటరీ పద్ధతిలో వైఎస్సార్‌సీపీనే విజయం వరించింది. గరివిడి ఎంపీపీగా మీసాల విశ్వేశ్వరావు ఎన్నికయ్యారు.
ఈ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ సునాయాసంగానే గెలుచుకోవాల్సి ఉంది. అయితే ఎంపీపీ ఎన్నిక జరగడానికి కొద్ది గంటల ముందు గరివిడి మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన ఓ సభ్యుడు తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయడంతో ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ 9, టీడీపీ 9 స్థానాలతో సమానంగా నిలిచాయి. కానీ చివరకు లాటరీ పద్ధతిలో గరివిడి స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది.
ఇదీ చదవండి: ‘ఓటమి భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యం’


