అన్నమయ్య జిల్లా: చంద్రబాబు పాలనలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు విద్య, వైద్యం దూరమైందని రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్, బీటీ కాలేజీను నిలిపేశారని, అసలు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి మాటే లేదని మండిపడ్డారు. మదనపల్లి, పుంగనూరులో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందనే విషయాన్ని మిథున్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పుంగనూరు నియోజకవర్గం ప్రజలపై రాజకీయ కక్ష ప్రభుత్వం అవలంబిస్తుంది. పుంగనూరు హంద్రీ నీవా బ్రాంచి కెనాల్ పేరుకు మాత్రమే పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ కు హంద్రీ నీవా జలాలుతో ప్రభుత్మం వెంటనే నింపి ప్రజల దాహార్తిని తీర్చాలి. ఎల్‌నీనో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన కరువు అములుకోంది హంద్రీ నీవా జలాలను పోలీసులను కాపలాపెట్టి కుప్పంకు నీరు తీసుకొని వెళుతున్నారు. మదనపల్లె, పుంగనూరు సమ్మర్ స్టోరేజ్‌లు నింపి ప్రజల దాహార్తిని తీర్చండి’ అని ప్రభుత్వ పెద్దలకు సూచించారు.
ఇదీ చదవండి: కూటమి ప్రభుత్వం భయపడుతోంది: లేళ్ల అప్పిరెడ్డి


