అప్పుడు అత్త అటెండర్‌.. నేడు కోడలు జెడ్పీ చైర్‌ పర్సన్‌ | Mother In Law Attender Daughter In Law Chittoor ZP Chairperson | Sakshi
Sakshi News home page

అప్పుడు అత్త అటెండర్‌.. నేడు కోడలు జెడ్పీ చైర్‌ పర్సన్‌

Nov 29 2026 9:16 AM | Updated on Nov 29 2026 9:16 AM

Mother In Law Attender Daughter In Law Chittoor ZP Chairperson

అచ్చమ్మ, శైలజ

చిత్తూరు కార్పొరేషన్‌ : చిత్తూరు జిల్లా రాజకీయా ల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జెడ్పీ కార్యాలయంలో అత్త అటెండర్‌ పనిగా పనిచేసిన కోడలు నేడు జెడ్పీ చైర్‌పర్సన్‌ అయ్యారు. వివరాల్లోకి వెళితే ఓ విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి తండ్రి మునస్వామినాయుడు పీఆర్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ మరణించారు. భార్య అచ్చమ్మకు కారుణ్య నియామకం కింద 1989లో అటెండర్‌ ఉద్యోగం ఇచ్చారు. ఆమె 2006లో ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం తేజోమూర్తి భార్య శైలజ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ అరుదైన పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement