వైఎస్సార్ జిల్లా: వేంపల్లిలో డీఎస్పీ మురళీనాయక్ ఓవరాక్షన్ చేశారు. అక్రమంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి పీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి.. హుటాహుటీనా వేంపల్లి పీఎస్‌కు వెళ్లారు. అసలు తమ కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొచ్చారో చెప్పాలని డీఎస్పీని నిలదీశారు.
కాగా, స్థానిక ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కూడా డీఎస్పీ మురళీ నాయక్ అతిగా ప్రవర్తిస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. డీఎస్సీ మురళీ నాయక్ తీరుపై ఇప్పటికే వైఎస్సార్‌సీపీ పలుమార్లు ఫిర్యాదు చేసినా ఆయన తీరు మార్చుకోవడం లేదు. తాను ఒక పోలీస్ అధికారిననే విషయం మరిచిపోయి టీడీపీ ఏజెంట్‌లా పని చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: ఆర్వోకు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు


