అసభ్యకర డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయిన ఐటీడీపీ ఇంఛార్జ్ | TDP Leader Velugula Nani's Objectionable Dance Video Goes Viral | Sakshi
Sakshi News home page

అసభ్యకర డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయిన ఐటీడీపీ ఇంఛార్జ్

Nov 28 2026 5:27 PM | Updated on Nov 28 2026 5:45 PM

ITDP Incharge obscene dance video goes viral

ప్రత్తిపాడుకు చెందిన టీడీపీ యువ నాయకుడు, ఐటీడీపీ ఇంఛార్జ్ వెలుగుల కొండలరావు (నాని) అమ్మాయిలతో అత్యంత అసభ్యకరంగా  డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొంతమంది అమ్మాయిలతో కలిసి అశ్లీలంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో  ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకంగా టీడీపీలో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను తెలుగు తమ్ముళ్లే అసహ్యించుకుంటూ నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రత్తిపాడు ఎమ్మెల్యేకు అత్యంత కీలక అనుచరుడుగా పేరు పొందిన వెలుగుల నాని ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ గా కూడా ఉండటం గమనార్హం. 

అమ్మాయిలతో అత్యంత అసభ్యకరంగా డ్యాన్స్‌ చేస్తూ దొరికిపోయిన వెలుగుల నాని వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  గతంలో పలు సందర్భాలలో కొందరు టీడీపీ నాయకులు అమ్మాయిలు, డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రాజకీయ విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు మరోసారి  ఐటీడీపీ ఇంచార్జ్‌ అసభ్యకర వీడియో బయటకి రావడంతో టీడీపీని బూతు పార్టీగా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  కాగా, అభ్యంతకరంగా ఉన్న కారణంగా ఈ వీడియోను సాక్షి డాట్‌ కామ్‌లో పోస్టు చేయలేకపోతున్నాం. 

ఇదీ చదవండి: రేపే ఎన్నికలు.. ఓటమి భయంతో సర్కార్‌ కొత్త కుట్ర

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement