అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వదిలిపెట్టం: రాచమల్లు | Rachamallu Siva Prasad Reddy Fires On Irregularities In Local Elections | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పాల్పడ్డ అధికారులను వదిలిపెట్టం: రాచమల్లు

Nov 28 2026 1:40 PM | Updated on Nov 28 2026 1:49 PM

Rachamallu Siva Prasad Reddy Fires On Irregularities In Local Elections

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారుల వ్యవహార తీరుపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటువంటి ఎన్నికలు నిర్వహించిన ఆర్వోలు, పోలీసు అధికారులను సంఘ బహిష్కరణ చేయాలి.. అంత ఘోర పాపం చేశారంటూ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నా బొందిలో ప్రాణం ఉండగా కలెక్టర్, ఆర్వోలను, పోలీసు అధికారులను మర్చిపోను’’ అంటూ రాచమల్లు వ్యాఖ్యానించారు.

అరాచకాలపై కాకాణి ఆగ్రహం
నెల్లూరు జిల్లా: కూటమి అరాచకాలపై మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేటి ఎన్నికల వేళ.. కూటమి పార్టీలో పోలీస్ శాఖ కూడా ఐదో పార్టీగా చేరింది. రాజులపాళెంలో పంచాయతీ ఎన్నికలలో ఆ శాఖను అడ్డంపెట్టుకొని సృష్టించిన అరాచకాలు దారుణమంటూ కాకాణి దుయ్యబట్టారు.

వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవాలపై అధికారులతో అగడాలకు పాల్పడ్డారు. ఏకోశాన ఇవి ఎన్నికలా జరగడం లేదు. ప్రజల్లో పట్టు కోల్పోవడంతో  వేమిరెడ్డి దంపతులు తట్టుకోలేక పోతున్నారు. ఏకగ్రీవాలను, ప్రజాస్వామ్య హక్కులను, ఫలితాలను తారుమారు చేసేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. అధికారులు, పోలీసులు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి వుండదు’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి: మార్పు మొదలైంది.. నిజం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement