పంచాయతీ ఎన్నికలు.. పులివెందుల డీఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు | AP High Court Directs SEC, Police to Ensure Peaceful Polls in Pulivendula | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలు.. పులివెందుల డీఎస్పీకి హైకోర్టు కీలక ఆదేశాలు

Nov 28 2026 1:03 PM | Updated on Nov 28 2026 1:13 PM

AP High Court Directs SEC, Police to Ensure Peaceful Polls in Pulivendula

సాక్షి,విజయవాడ: పులివెందుల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరుతూ 48 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా నియోజకవర్గ వ్యాప్తంగా పోటీ చేస్తున్న తమకు కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని వారు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం , పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌కు ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించవద్దని అధికారులకు సూచించింది.

మరోవైపు, ఇప్పటికే పలు చోట్ల అల్లర్లు సృష్టించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని, వారికి పోలీసులే సహకరిస్తున్నారని పిటిషనర్లు (అభ్యర్థులు) ఆరోపించారు.

కాగా, రెండో దశలో భాగంగా పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement