ఎన్టీఆర్ కొత్త ఇంటికోసం స్పెషల్ పెయింటింగ్ | NTR Buys Thota Vaikuntam Art For His New House | Sakshi
Sakshi News home page

NTR: స్పెషల్ పెయింటింగ్.. ఎన్టీఆర్ పోస్ట్ వైరల్

Nov 26 2026 4:22 AM | Updated on Nov 26 2026 4:22 AM

NTR Buys Thota Vaikuntam Art For His New House

ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ పెయింటింగ్‌ని టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. తారక్ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి దీన్ని తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిని తోట వైకుంఠం స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఇటీవల అందజేశారు.

తెలంగాణకు చెందిన తోట వైకుంఠం.. దేశవిదేశాల్లో గుర్తింపు పొందిన చిత్రకారుడు. పల్లెటూరి జీవనశైలి, సంప్రదాయాలు, గ్రామీణ సంస్కృతిని తనదైన శైలిలో చిత్రీకరించడం ఈయన ప్రత్యేకత. పచ్చని పొలాలు, కల్లు కుండలు మోసే వ్యక్తులు, ఇంటి పనులు, ఆలయ ఆచారాలు, గ్రామీణ పండగలు తదితర అంశాల ఈయన చిత్రాల్లో కనిపిస్తుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈయన పెయింటింగ్స్ రూ.లక్షల ధర పలికే అవకాశం ఉంది.

ఇకపోతే ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పెయింటింగ్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మవారు సంప్రదాయ గ్రామీణ వాతావరణంలో కొలువుదీరినట్లు కనిపించారు. భక్తులు స్వామివారికి పూజలు చేస్తున్న దృశ్యం ఎంతో అందంగా ఉంది. ఈ అరుదైన పెయింటింగ్‌ని అందుకున్న ఆనందాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. “లెజెండరీ తోట వైకుంఠం గారు ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందకరమైన క్షణం” అని రాసుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement