ఈవీవీ సత్యనారాయణ బోల్డ్ అండ్ రియలస్టిక్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన మూవీ 'ఆరుగురు పతివ్రతలు'. దాదాపు 20 ఏళ్ల క్రితం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీకి ఈవీవీ సత్యనారాయణ దర్శకనిర్మాతగా వ్యవహరించారు. పెళ్లి పేరిట జరిగే మోసాలు, వైవాహిక బంధంలో భార్యభర్తల మధ్య ఉండే ఈగోలు, రకరకాల పరిస్థితులు, మనస్పర్థలని బోల్డ్‌గా ఇందులో చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది.
ఈ మూవీని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. డిసెంబర్ 11న రీ రిలీజ్ చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆరుగురు మహిళలు.. ఆరు కథలు.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే కామెడీ ఎంటర్‌టైనర్ టాలీవుడ్ ప్రియులను మరోసారి అలరించనుంది. ఈ సినిమా రిలీజైనప్పుడు కాంట్రవర్సీకి దారితీసింది. అప్పట్లో డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణపై కొందరు విమర్శలు కూడా చేశారు.
Six women. Six unforgettable stories. One crazy entertainer! 🔥 #AaruguruPathivrathalu returns to theatres on DECEMBER 11TH! ❤️🔥 Don't miss the madness on the big screen! GRAND RELEASE BY @PochammaFilms 🎬 @Pokirisai09 #AaruguruPathivrathalu https://t.co/49gwE0f5qq
— Roll Media (@Rollmedia9) November 24, 2026


