నన్ను కూడా విజయ్‌లా సీఎం చేస్తారా? | Sharwanand Funny Comments Singer Narsanna Latest | Sakshi
Sakshi News home page

Sharwanand: నర్సన్న.. చాలామందిని సీఎంలని చేశావంట

Nov 25 2026 3:57 AM | Updated on Nov 25 2026 3:57 AM

Sharwanand Funny Comments Singer Narsanna Latest

శర్వానంద్ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'భోగి'. పలుమార్లు వాయిదాపడ్డ ఈ చిత్రం.. ఎట్టకేలకు ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ లాంటివి వచ్చాయి. తాజాగా 'గంగ' పేరుతో ఉన్న పాట రిలీజ్ చేశారు. దీన్ని నల్గొండ గద్దర్ అలియాస్ నర్సన్న పాడాడు. అయితే మంగళవారం రాత్రి జరిగిన 'భోగి' మ్యూజికల్ ఈవెంట్‌లో భాగంగా శర్వానంద్-నర్సన్న మధ్య సరదా సంఘటన జరిగింది.

(ఇదీ చదవండి: ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ)

సినిమా టీమ్‌లోని అందరి గురించి మాట్లాడిన శర్వానంద్.. సింగర్ నర్సన్న గురించి చెబుతూ నర్సన్న.. చాలామందిని సీఎంలని చేశావంట. మరి నన్ను కూడా విజ‌య్‌లాగా సీఎం చేస్తావా? అని అన్నాడు. నర్సన్న ఇదివరకు కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు,  వైఎస్ జగన్ తదితరల కోసం పొలిటికల్ పాటలు పాడాడు. గత కొన్నాళ్లుగా సినిమాల్లో పాడుతున్నాడు. ఈ క్రమంలోనే శర్వానంద్.. నర్సన్న గురించి సరదా వ్యాఖ్యలు చేశాడు.

(ఇదీ చదవండి: ఆవేశపడిపోయిన తరుణ్ భాస్కర్.. ఎందుకింత కోపం? ఎవరిపైన?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement